(Source: ECI | ABP NEWS)
NTR: 'వార్ 2' సినిమాను నిలిపేయాలంటూ వార్నింగ్ - ఎన్టీఆర్‌ను బూతులు తిట్టిన టీడీపీ ఎమ్మెల్యే?... ఆడియో కాల్ లీక్
Anantapuram News: జూనియర్ ఎన్టీఆర్‌ను ఓ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టిన ఆడియో కాల్ తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. అనంతపురంలో వార్ 2ను నిలిపేయాలంటూ ఆయన వార్నింగ్ ఇవ్వడం అందులో ఉంది.

Anantapuram MLA Daggubati Venkateswara Prasad Warns War 2 Movie: అనంతపురం అర్జన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఫోన్ ఆడియో కాల్ తాజాగా వైరల్ అవుతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌ను ఆయన బూతులు తిట్టినట్లుగా అందులో ఉంది.
ఎన్టీఆర్‌ను లం.... కొడుకు అంటూ ఎమ్మెల్యే బూతులు తిట్టడం ఆ ఆడియో కాల్‌లో ఉంది. మంత్రి లోకేశ్ గురించి తప్పుగా మాట్లాడతాడా... సినిమా ఎలా ఆడుతుందో చూస్తా? అంటూ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వార్ 2' మూవీ ప్రదర్శనను అనంతపురంలో నిలిపేయాలంటూ ఆయన వార్నింగ్ ఇవ్వడం కూడా ఉంది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం
ఈ ఆడియో కాల్ వైరల్ అవుతుండగా... జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను నిలిపేయడానికి ఎమ్మెల్యే ఎవరని... మూవీ ప్రదర్శనను నిలిపేస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ ఎక్కడా పేర్లు ప్రస్తావించలేదని... ఇలా అవమానించడం కరెక్ట్ కాదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై టీడీపీ శ్రేణులు రియాక్ట్ కావడం లేదు.
అయితే, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతుండగా ఫ్యాన్స్ 'జై బాలయ్య' అంటూ కేకలు వేయగా... 'బ్రదర్ వెళ్లిపొమ్మంటారా? మాట్లాడాలా వెళ్లిపోనా?' అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ఆయన నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏ ఈవెంట్లలోనూ వారి గురించి ప్రస్తావించడం లేదు. తాజాగా... 'వార్ 2' ఈవెంట్‌లోనూ అలానే జరిగింది. ఇప్పుడు ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేనే ఎన్టీఆర్‌ను దుర్భాషలాడిన ఆడియో కాల్ వైరల్ కావడం కలకలం రేపుతోంది.
Also Read: ఎవర్రా మీరు... ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు - జడ్జ్ బిందు మాధవికే ఫ్రస్టేషన్ తెప్పించారుగా?





















