Bigg Boss 9 Agnipariksha: ఎవర్రా మీరు... ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు - జడ్జ్ బిందు మాధవికే ఫ్రస్టేషన్ తెప్పించారుగా?
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ కొత్త సీజన్ అగ్నిపరీక్ష భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈసారి సామాన్యుల ఎంట్రీతో హౌస్‌లో మరింత హీట్ పెరగనుంది. తాజాగా, జడ్జ్ బిందు మాధవి ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.

Bindu Madhavi Promo In Bigg Boss 9 Telugu Season: ఫేమస్ టీవీ రియాలిటీ షో 'బిగ్ బాస్ 9' కొత్త సీజన్ అగ్నిపరీక్ష రోజు రోజుకూ హీట్ పెంచేస్తోంది. ఈసారి సామాన్యులు హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తుండడంతో కామనర్స్, సెలబ్రిటీల మధ్య వార్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 15 మంది సామాన్యుల నుంచి ఐదుగురిని ఫైనల్ చేసేందుకు జడ్జెస్ నవదీప్, బిందు మాధవి, అభిజిత్ శ్రమిస్తున్నారు.
రీసెంట్‌గా బిగ్ బాస్ వాయిస్ మారుస్తూ జడ్జ్ అభిజిత్ ప్రోమో రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు తాజాగా జడ్జ్ బిందు మాధవి ప్రోమోను సైతం మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ నెల 22 నుంచి 'అగ్ని పరీక్ష' స్ట్రీమింగ్ కానుండగా ప్రొమోషనల్ వీడియోస్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ఎవర్రా మీరంతా...
'జడ్జెస్‌గా రమ్మంటే కామనర్స్‌యే కదా ఓ ఆటాడుకుందాం అనుకున్నా. ఇలా ఉన్నారేంట్రా వీళ్లు.' అంటూ ప్రస్టేషన్‌తో బిందు మాధవి రూంలోకి ఎంట్రీ ఇస్తారు. 'ఆ కంటెస్టెంట్స్‌లో ఎవరిని సెలక్ట్ చేయాలో ఎవరిని రిజెక్ట్ చేయాలో అర్థం కావట్లే. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా వీళ్లు'. అంటూ తన అసిస్టెంట్‌పై ప్రస్టేషన్ చూపిస్తుండగా... 'కామనర్స్ కదా మేడమ్ ఎందుకంత ఆలోచిస్తున్నారు?' అని అంటాడు. 'వాళ్లు కామనర్స్ ఏంటి? సెలబ్రిటీస్‌కే కాంపిటీటర్స్‌లా ఉన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ లేపేలా ఉన్నారు.' అంటూ చెబుతుంది.
'మరిప్పుడు ఏం చేస్తారు మేడమ్?' అంటూ అసిస్టెంట్ ప్రశ్నించగా... 'నేనేం చేయను. నా జడ్జిమెంట్ ఎంత టఫ్‌గా ఉంటుందో చూపిస్తా. పిచ్చి పిచ్చెక్కిపోయేలా చేస్తా. ఆగస్ట్ 22 నుంచి అసలైన అగ్నిపరీక్ష స్టార్ట్ అవుతుంది. అదెలా ఉంటుందో మీరు కూడా జియో హాట్ స్టార్‌లో చూసేయండి.' అంటూ చెప్పారు బిందు మాధవి. 'ఆడపులి బిందు మాధవి ఎంట్రీతో అగ్ని పరీక్ష వేడి పెరిగింది. ఆమె పదునైన వ్యూహం, ఆవేశపూరితమైన తీర్పు ప్రతీ సామాన్యుడిని పరీక్షిస్తుంది. వారు మంటలను తట్టుకోగలరా?' అంటూ వీడియోను రిలీజ్ చేశారు.
View this post on Instagram
Also Read: మూడో రోజు 'వార్ 2' కిందకు పడిందా? పైకి లేచిందా? ఎన్టీఆర్ సినిమా కలెక్షన్స్ సంగతేంటి?
ఈసారి 'డబుల్ డోస్ డబుల్ హౌస్' కన్ఫర్మ్ అంటూ రీసెంట్‌గా రిలీజ్ చేసిన స్పెషల్ ప్రోమోలో నాగార్జున (Nagarjuna) తెలిపారు. దీన్ని బట్టి కామనర్స్, సెలబ్రిటీల మధ్య హౌస్ వార్ ఖాయంగా కనిపిస్తోంది. గత సీజన్లలోలా గేమ్స్ కాకుండా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌ను ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. శారీరక శ్రమ లేకుండా మైండ్ గేమ్స్, క్రియేటివికీ పెరిగేలా డిజైన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 7 నుంచి ఈ షో ప్రారంభం కానుండగా తొలుత కామనర్స్ ఫైనల్ అయిన తర్వాత హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోయే సెలబ్రిటీల పేర్లను రివీల్ చేస్తారని తెలుస్తోంది.






















