News
News
X

Bigg Boss 6: బిగ్ బాస్6లో అల్లు అర్జున్ ఐటెం గర్ల్ - ఆర్జీవీ బ్యూటీకి ఛాన్స్!

బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6) కోసం సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా షోకి సంబంధించిన లోగోను విడుదల చేస్తూ.. చిన్న వీడియో వదిలారు. అలానే ఈ షోకి సంబంధించిన ప్రోమోని కూడా రిలీజ్ చేశారు.

FOLLOW US: 

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. హాట్ స్టార్ లో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షోని నడిపించారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటీటీ వెర్షన్ క్లిక్ అవ్వలేదు. 

ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6) కోసం సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా షోకి సంబంధించిన లోగోను విడుదల చేస్తూ.. చిన్న వీడియో వదిలారు. అలానే ఈ షోకి సంబంధించిన ప్రోమోని కూడా రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 4 నుంచి ఈ షో మొదలవుతుందని వెల్లడించారు. సెప్టెంబర్ నుంచి వంద రోజుల పాటు ఈ షో సాగనుంది. షోకి వచ్చే క్రేజ్ ని బట్టి మరో వారం రోజులు పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. 17 లేదా 18 మంది కంటెస్టెంట్స్ ఈ షోలో కనిపించనున్నారు. గతంలో కామన్ మ్యాన్ కి ఈ షోలో అవకాశం దక్కింది. కొన్నాళ్లకు ఆ కాన్సెప్ట్ ను పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ షో కామన్ మ్యాన్ కనిపించబోతున్నారు. అలానే బుల్లితెరపై అలరిస్తోన్న కొందరు సెలబ్రిటీలను ఈ షో కోసం తీసుకురాబోతున్నారు. 

బిగ్ బాస్6లో అల్లు అర్జున్ ఐటెం గర్ల్:

అభినయ శ్రీ గుర్తుందా..? అదేనండీ.. అల్లు అర్జున్ నటించిన 'ఆర్య' సినిమాలో 'అ అంటే అమలాపురం' సాంగ్ కి స్టెప్పులేసింది కదా.. ఆమెనే. ఈ బ్యూటీని ఇప్పుడు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అభినయ శ్రీ తన కెరీర్ లో 'ఎవడి గోల వాడిది', 'పైసాలో పరమాత్మ', 'అత్తిలి సత్తిబాబు' వంటి సినిమాల్లో నటించింది. చాలా కాలంగా ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇప్పుడు తిరిగి కం బ్యాక్ ఇవ్వడానికి రెడీ అయింది. ఇందులో భాగంగా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా కనిపించడానికి రెడీ అయింది. 

ఆర్జీవీ బ్యూటీకి ఛాన్స్:

ఇటీవల రామ్ గోపాల్ వర్మతో ఇంటిమేట్ డాన్స్ చేస్తూ వార్తల్లో నిలిచింది ఇనయ సుల్తానా. ఈమెను కూడా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో కూడా ఆర్జీవీ బ్యూటీస్ కి అవకాశం వచ్చింది. ఆ సమయంలో వర్మ వారికి తన మద్దతు తెలిపారు. మరి ఇనయ సుల్తానాను కూడా సపోర్ట్ చేస్తారేమో చూడాలి. 

View this post on Instagram
 
A post shared by Inaya Sultana (@inayasulthanaofficial)

వీరిద్దరితో పాటు 'చంటిగాడు' ఫేమ్ బాలాదిత్య, 'నువ్వు నాకు నచ్చావు' సినిమాలో హీరోయిన్ చెల్లెలిగా కనిపించిన సుదీపా పింకీలను కూడా కంటెస్టెంట్స్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. 

Also Read : ‘ఆంటీ’ ట్రోల్స్‌పై అనసూయ ఆగ్రహం, రౌడీ బాయ్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్

Also Read : విజయ్ దేవరకొండ కాదు, అనకొండ - రౌడీ బాయ్ ప్రవర్తనపై ముంబై థియేటర్ ఓనర్ ఫైర్

Published at : 28 Aug 2022 03:32 PM (IST) Tags: Ram Gopal Varma Bigg Boss 6 Bigg Boss 6 contestants inaya sulthana abhinaya shree

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: నీ ఆటతీరు చూసి మేము కూడా షాకయ్యాం - ఆ కంటెస్టెంట్‌కు ఇచ్చిపడేసిన నాగార్జున

Bigg Boss 6 Telugu: నీ ఆటతీరు చూసి మేము కూడా షాకయ్యాం - ఆ కంటెస్టెంట్‌కు ఇచ్చిపడేసిన నాగార్జున

Bigg Boss 6 Telugu Episode 20: ఇంటి మూడో కెప్టెన్ ఆదిరెడ్డి, భార్యకు ఐలవ్యూ చెప్పిన కామన్‌మ్యాన్, జైలుకెళ్లిన లవర్ బాయ్

Bigg Boss 6 Telugu Episode 20: ఇంటి మూడో కెప్టెన్ ఆదిరెడ్డి, భార్యకు ఐలవ్యూ చెప్పిన కామన్‌మ్యాన్, జైలుకెళ్లిన లవర్ బాయ్

Bigg Boss Telugu 6: రేవంత్ తో గీతూ ఆర్గ్యుమెంట్ - వెక్కి వెక్కి ఏడ్చేసిన కీర్తి!

Bigg Boss Telugu 6: రేవంత్ తో గీతూ ఆర్గ్యుమెంట్ - వెక్కి వెక్కి ఏడ్చేసిన కీర్తి!

Bigg Boss Telugu: గీతూకు కన్నుకొట్టిన రాజశేఖర్, ఫీలైన ఫైమా - ఆరోహి ఏడుపు

Bigg Boss Telugu: గీతూకు కన్నుకొట్టిన రాజశేఖర్, ఫీలైన ఫైమా - ఆరోహి ఏడుపు

టాప్ స్టోరీస్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

For one last time! జులన్‌ను హత్తుకొని ఏడ్చేసిన హర్మన్‌ - లార్డ్స్‌లో ఆంగ్లేయుల గ్రేట్ రెస్పెక్ట్‌!

For one last time! జులన్‌ను హత్తుకొని ఏడ్చేసిన హర్మన్‌ - లార్డ్స్‌లో ఆంగ్లేయుల గ్రేట్ రెస్పెక్ట్‌!

Zodiac Signs: జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి

Zodiac Signs:  జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి