News
News
X

Bigg Boss 6 Telugu: హౌస్‌లో రేవంత్ భార్య సీమంతం వీడియో, ఎమోషనల్ అయిన స్టార్ సింగర్

Bigg Boss 6 Telugu: ఆటలో కాస్త డిప్రెస్‌కు గురవుతున్న రేవంత్‌ను ఖుషీ చేసేలా వీడియో వేశారు బిగ్‌బాస్.

FOLLOW US: 

Bigg Boss 6 Telugu: బీబీ హోటల్ టాస్కు నుంచి అవుట్ అయి రేవంత్ కాస్త డిప్రెస్‌గా కనిపించాడు. అతడిని ఖుషీ చేసేలా బిగ్ బాస్ ఓ అందమైన వీడియోను వేశాడు. అది చూసి రేవంత్ కంటి నుంచి ఆనందభాష్పాలు వస్తూనే ఉన్నాయి. కొత్తగా విడుదలైన ప్రోమోను చూస్తే ఈ రోజు ఎపిసోడ్ చూడాలనిపించేలా ఉంది. 

తండ్రి కావడం కన్నా మగవాడికి ఆనందమైన క్షణం ఏముంటుంది? తన భార్య గర్భంతో ఉండగా రేవంత్ హౌస్ లోకి వచ్చాడు. ఆమెకు నెలలు నిండుతున్నాయి. ఈ సందర్భంగా ఇంట్లో సీమంతం వేడుక నిర్వహించారు. ఆ వీడియోను రేవంత్ కోసం ప్రదర్శించాడు బిగ్‌బాస్. టీవీలో సీమంతం వీడియో చూస్తుంటే రేవంత్ కంటి వెంట కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. టీవీలో తన భార్య ఫోటోకు బొట్టు పెట్టి అక్షింతలు వేశాడు. ఇంటి సభ్యులందరినీ పిలిచి తన ఆనందాన్ని పంచుకున్నాడు. రేవంత్ భార్య నిండు గర్భంతో కళకళలాడుతూ ఉంది. 

ఒక ప్రోమో మొదలవ్వగానే ఆరోహి - సూర్య గొడవ ప్రారంభమైంది. ఇద్దరూ భోజనం చేస్తుండగా సూర్య ‘చాలా ఇరిటేషన్ గా ఉంది’ అని ఆరోహిని ఉద్దేశించి అన్నాడు. వెంటనే ఆరోహి అన్నం తినకుండానే లేచి వెళ్లిపోయింది. దీంతో సూర్య కూడా అన్నం తినకుండా డస్ట్ బిన్లో వేశాడు. వీరిద్దరి కథేంటో వారికే క్లారిటీ లేదు. స్నేహితులంటాడు ప్రేమికుల్లా వ్యవహరిస్తారు. 

కంటతడి పెట్టిన గీతూ...
గీతూ కూడా ఏడుస్తుందని, ఆమె కూడా ఎమోషనల్ అని ఈ ప్రోమో ద్వారా తెలిసింది. ఆదిరెడ్డి తనకు వంద రూపాయలు కూడా ఇవ్వలేదంటూ కంటతడి పెట్టుకుంది. ఫైమా కూడా రాజ్ తనను మోసం చేశాడని, ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదంటూ బాధపడింది. ఆదిరెడ్డి గీతక్కా అంటూ ఎక్కువ గీతూ వెంటే ఉంటాడు. అలాంటి వ్యక్తి బీబీ హోటల్ టాస్కులో చిన్న టిప్ కూడా గీతూకి ఇవ్వలేదు. మిగతా వారికి అంతో ఇంతో ఇచ్చాడు కానీ గీతూకి మాత్రం అసలు ఇవ్వలేదు. దీంతో ఆమె చాలా హర్ట్ అయిపోయింది. ఇనయ మెరీనాతో మాట్లాడుతూ రాజ్ ఆమెను (ఫైమా) మోసం చేశాడంటూ చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి గెస్టుల దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉన్నట్టు అంచనా. 

News Reels

బీబీ హోటల్ లో ఎవరి దగ్గరైతే ఎక్కువ డబ్బులు ఉంటాయో వారే కెప్టెన్సీ కంటెండర్ గా ఉంటారు. ఇప్పటికే చంటి, రేవంత్, బాలాదిత్య కెప్టెన్సీ కంటెండర్ టాస్కు నుంచి బయటికి వచ్చారు. ఇక మిగతా వారిలో ఎవరు కెప్టెన్సీ పోటీదారులు అవుతారో చూడాలి. ఈరోజు ఈ విషయం తేలిపోతుంది.  వచ్చే వారం కెప్టెన్ అవ్వబోతున్నారో మరి.

Also read: పూల్‌లో ఆ పనిచేసిన శ్రీహాన్? ఛీ కొట్టిన కంటెస్టెంట్లు, బాత్రూమ్ దగ్గరే కాపలా కాసిన రేవంత్

Also read: మరో షన్ను - సిరిలా మారిన సూర్య -ఆరోహి, ఇంట్లో బీబీ హోటల్ గేమ్, చంటికి సీక్రెట్ టాస్కు

Published at : 29 Sep 2022 01:03 PM (IST) Tags: Bigg Boss 6 Telugu Revanth wifes seemantham Video Revanth wife Seemantham Video of Revanth wife in Bigg boss

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

టాప్ స్టోరీస్

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీలో జోష్‌- స్వాగతించిన నేతలు, మంత్రులు

సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీలో జోష్‌- స్వాగతించిన నేతలు, మంత్రులు