News
News
X

Bigg Boss 6 Telugu Episode 24: మరో షన్ను - సిరిలా మారిన సూర్య -ఆరోహి, ఇంట్లో బీబీ హోటల్ గేమ్, చంటికి సీక్రెట్ టాస్కు

Bigg Boss 6 Telugu: సూర్య - ఆరోహి మధ్యలో స్నేహమో లేక ప్రేమో తెలియదు కానీ ఆ బంధం గట్టిగానే బలపడుతోంది.

FOLLOW US: 

Bigg Boss 6 Telugu: ముందు రోజు నామినేషన్లలో అందరూ ఇనయాను టార్గెట్ చేయడం బాగోలేదంటూ మాట్లాడింది ఫైమా. పోలీసుగా టీమ్ చెప్పిందే తాను చేశానని, కానీ తననే తప్పుపట్టి నామినేషన్ చేశారని ఇనయా బాధపడుతూ కూర్చుంది. ఇక ఇంట్లోని జంట రోహిత్ -మెరీనా వచ్చి నామినేషన్ వేసినందుకు సారీ చెప్పారు. ఫైమా మాత్రం ఇనయాను సపోర్ట్ చేస్తూ కనిపించింది. 

ఇనయా వయసు తక్కువే
ఇక శ్రీహాన్ కెమెరాలకు కనిపించేలా గడ్డిలో పడుకుని ‘ఈ నామినేషన్లు ఏంటో, ఒకడు ఏం మాట్లాడుతాడో వాడికే తెలియదు, ఇక ఈమె ఏమో ఒక మాటకి అర్థాలు, నానార్థాలు, పర్యాయపదాలు తీస్తుంది. నా ఏజ్ తక్కువ  అంటే బాడీ షేమింగ్ అంటుంది. ఈమెకు ఆస్కార్ ఇచ్చిన తక్కువే’ అనుకున్నాడు శ్రీహాన్. ఆయన చేసేదే ఆస్కార్ లెవెల్ యాక్టింగ్. నిజానికి శ్రీహాన్ కన్నా ఇనయా చిన్నదే. శ్రీహాన్ 33 ఏళ్లు కాగా, ఇనయాకు 27 ఏళ్లు. ఇక రివ్యూస్టార్ ఆదిరెడ్డి ఈసారి సూర్య, రేవంత్, గీతూ, శ్రీహాన్ తప్ప ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు అని చెప్పాడు. దానికి రేవంత్ ఇనయా కూడా వెళ్లదని అన్నాడు. అలాగే పైకి ధైర్యంగా కనిపిస్తున్నా నాకూ భయమేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు రేవంత్.

వీళ్లద్దరిది స్నేహమేనా?
సూర్య ఆరోహి  మళ్లీ  ముచ్చట్లు పెట్టారు. నువ్వు వాళ్లతో కనెక్ట్ అయ్యావ్, అంటే నువ్వు వీళ్లతో కనెక్ట్ అయ్యావ్ అంటూ కాసేపు మాట్లాడుకున్నారు. తరువాత బెడ్ మీద కూర్చుని మళ్లీ అవే కబుర్లు. సూర్య మాట్లాడుతూ ‘నేను ఎవరికీ అన్నం తినిపించినా, నీకు పెట్టినప్పుడు వచ్చే ఆ ప్రేమ వేరు’ అంటూ చెప్పుకొచ్చాడు. వీళ్లదో స్నేహమో, ప్రేమో వారికైనా క్లారిటీ ఉందో లేదో. 

చంటికి సీక్రెట్ టాస్క్
బిగ్ బాస్ హోటల్ వర్సెస్ హోటల్ టాస్కు ఇచ్చాడు. అలేగా చంటికి సీక్రెట్ టాస్కు కూడా ఇచ్చాడు. బీబీ హోటల్ పక్కనే గ్లామ్ పారడైజ్ అనే అమ్మాయిలు నడిపే హోటల్ కూడా ఉంటుంది. బీబీ హోటల్ నుంచి గ్లామ్ ప్యారడైజ్‌కు ఎక్కువమందిని పంపడమే చంటి సీక్రెట్ టాస్కు. గెస్టుల నుంచి ఎక్కువ డబ్బులను సంపాదించడమే ఈ టాస్కు. ఇక బీబీ హోటల్ స్టాఫ్‌గా సుదీప, బాలాదిత్య, మెరీనా, గీతూ, రేవంత్, చంటి. ఇక గ్లామ్ ప్యారడైజ్ స్టాఫ్‌గా వాసంతి, ఫైమా, కీర్తి, శ్రీసత్య, ఆరోహి. గెస్టులుగా శ్రీహాన్, ఇనయా, ఆదిరెడ్డి, రాజ్, అర్జున్ వ్యవహరించారు. 

News Reels

అర్జున్‌తో ఆడేసుకున్న సత్య
శ్రీసత్య వెనుక అర్జున్ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ టాస్కులో డబ్బుల కోసం అర్జున్ పట్టేసింది. మీద చేయేసి ఫోటో తీసుకున్నందుకు డబ్బులు, ఆమ్లెట్ వేసినందుకు డబ్బులు, అన్నం ముద్ద తినిపించినందుకు డబ్బులు, కాఫీకి డబ్బులు ఇలా ప్రతిది ఆమె టాస్కును తెలివిగా ఆడింది. కాకపోతే అర్జున్ వీక్ నెస్‌తో ఆమె ఆడుకున్నట్టు అనిపించింది. ఇదే విషయంపై ఫైమా, ఆరోహి మాట్లాడుకున్నారు. 

డ్యాన్సులతో అదరగొట్టారు..
గ్లామ్ ప్యారడైజ్ ను నడిపే అమ్మాయిలు పాటలకు డ్యాన్సులతో అదరగొట్టారు. టాస్కులో పెద్దగా తెలివి తేగలు చూపించింది లేదు కానీ, అందరూ ఆనందంగా ఛిల్ అయ్యారు. ఫైమా పోల్ డ్యాన్స్ నవ్వించింది. చంటి సీక్రెట్ టాస్కును మాత్రం ఒకంతట మొదలుపెట్టలేదు. ఈరోజు అర్జున్ నుంచి సత్యానే ఎక్కువ డబ్బులు లాగేసింది. ఈ టాస్కు ఇంకా కొనసాగుతోంది. 

Also read: హౌస్‌లో జంటల గోల, శ్రీసత్య చుట్టూ తిరుగుతున్న అర్జున్, ఆరోహి - సూర్య మధ్య గొడవ, అతనికి సీక్రెట్ టాస్క్

Also read: ముద్దలు కలిపి అర్జున్‌కు తినిపించిన శ్రీసత్య, హౌస్‌లో ఫన్నీ టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్

Published at : 28 Sep 2022 05:47 AM (IST) Tags: bb hotel task Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Telugu written Updates Biggboss

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

టాప్ స్టోరీస్

Sajjala On Supreme Court : సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం - మూడు రాజధానులకు ప్రజామోదం ఉందన్న సజ్జల !

Sajjala On Supreme Court :   సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం  - మూడు రాజధానులకు ప్రజామోదం ఉందన్న సజ్జల !

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Sharmila Arrest : షర్మిల అరెస్ట్ - పాదయాత్ర ఆపబోనన్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు !

Sharmila Arrest :   షర్మిల అరెస్ట్ - పాదయాత్ర ఆపబోనన్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు !

Yadamma Raju Engagement: ఓఓ ఇంటివాడు కాబోతున్న కమెడియన్ యాదమ్మ రాజు, ఎంగేజ్మెంట్ పోటోలు వైరల్

Yadamma Raju Engagement: ఓఓ ఇంటివాడు కాబోతున్న కమెడియన్ యాదమ్మ రాజు, ఎంగేజ్మెంట్ పోటోలు వైరల్