Bigg Boss 6 Telugu: హౌస్‌లో జంటల గోల, శ్రీసత్య చుట్టూ తిరుగుతున్న అర్జున్, ఆరోహి - సూర్య మధ్య గొడవ, అతనికి సీక్రెట్ టాస్క్
Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో జంటల గోల ఎక్కువైపోయింది. ఇక సూర్య - ఆరోహి స్నేహితులో, ఇంకేమైనా వారి మధ్య ఉందో వారికే తెలియడం లేదు.
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో హోటల్ టాస్క్ మొదలైంది. అందులో కొంతమంది హోటల్ సిబ్బందిగా, కొంతమంది గెస్టులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గెస్టుల నుంచి ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలని హోటల్ సిబ్బంది, వారికి డబ్బులు ఎక్కువ దక్కకుండా చేయాలని గెస్టులు ప్రయత్నించాలి. ఆదిరెడ్డి, అర్జున్ కళ్యాణ్, శ్రీహాన్ గెస్టులుగా వ్యవహరిస్తున్నట్టు ప్రోమో ద్వారా తెలుస్తోంది. అయితే అర్జున్ కళ్యాన్ ఈ టాస్కులో కూడా శ్రీ సత్య చుట్టూ తిరుగుతూ, ఆమెకు అడిగినంత డబ్బులు ఇచ్చేస్తూ కనిపించాడు.
కొత్తగా విడుదలైన ప్రోమోలో ఏముందంటే... అందరూ ఓ రేంజ్‌లో ‘ఆకలేస్తే అన్నం పెడతా’ పాటకు డ్యాన్సులేస్తూ కనిపించారు. మధ్యలో రాజశేఖర్ చెరోపక్క కీర్తి, వాసంతిని వాటేసుకుంటూ కనిపించాడు. దీంతో శ్రీహాన్ ‘మా సింగిల్స్ ఏమైపోవాలి’ అంటూ కామెంట్ చేశాడు. మధ్యలో సత్య వచ్చి ‘సిరి సింగిలట’ అని కామెంట్ చేసింది. దానికి శ్రీహాన్ ‘ఇక్కడ సింగిలే’ అన్నాడు. సత్యను కాఫీ అడిగాడు రాజశేఖర్. సత్య రెండు వందల రూపాయలు అడిగింది. వెంటనే అర్జున్ తీసి ఆ రెండు వందల రూపాయలు ఇచ్చేశాడు.
ఎప్పుడూ చిర్రుబుర్రులాడే శ్రీసత్య ఈసారి అర్జున్ తో స్నేహంగా మెలిగింది. అది ఆట వరకే అని ఆమె గురించి తెలిసిన వారెవరైనా చెబుతారు. అర్జున్ చేయి పట్టుకుని, పక్కన కూర్చుని భుజం భుజం రాసుకుంటూ టాస్క్ కోసం చాలా చేసింది. అర్జున్ దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి ప్లాన్ వేసినట్టు కనిపిస్తోంది. వెంటనే సుదీప, బాలాదిత్య వచ్చి అర్జున్ ను హెచ్చరిస్తూ కనిపించారు. ‘మీరు పూల్ లో దిగుతున్నారని అనుకుంటున్నారు కానీ మీరు ఊబిలో దిగుతున్నారు సార్’ అంటూ జోకులేశారు.
మధ్యలో వీళ్ల గోల
ఇక ఆరోహి - సూర్య మళ్లీ ఏకాంతంగా కూర్చుని వాదించుకోవడం మొదలుపెట్టారు. నువ్వు కొంతమందికి దగ్గరవుతున్నావంటే, నువ్వే దగ్గరవుతున్నావ్ అని వాదించుకున్నారు. సూర్య ‘నువ్వు ఇద్దరితో కనెక్ట్ అయ్యావు, నేను నలుగురితో కనెక్ట్ అయ్యాను అంతే’ అన్నాడు సూర్య. దానికి ఆరోహి లేచి వెళ్లిపోయింది. బిగ్ బాస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఈ సమయంలో అదరగొట్టాడు. వెంటనే సూర్య ‘గేమ్ మీద ఫోకస్ పెట్టాలి’ అంటూ తనకు తానే చెప్పుకోవడం మొదలుపెట్టాడు. ఇక బిగ్ బాస్ చంటికి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. గత సీజన్లలో కూడా హోటల్ టాస్కులో ఒకరికి సీక్రెట్ టాస్కు ఇవ్వడం జరుగుతూనే వస్తోంది.
Chanti gets a secret task... 🤯
— starmaa (@StarMaa) September 27, 2022
Want to find out what it is? Don't miss today's episode on @StarMaa, streaming 24/7 on @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar #StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/O4IwbA1izE
Also read: ముద్దలు కలిపి అర్జున్‌కు తినిపించిన శ్రీసత్య, హౌస్‌లో ఫన్నీ టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్
Also read: హౌస్ టార్గెట్ ఇనయా, ఇలాగే అయితే ఇనయా ఆర్మీ రెడీ అవ్వడం ఖాయం, నామినేట్ అయింది వీళ్లే