Bigg Boss 6 Telugu: నెత్తిపై బకెట్ చెత్త పోసి మరీ నామినేషన్ - ఈసారి అందరూ కూల్‌గా ఉన్నారు ఎందుకో
Bigg Boss 6 Telugu: నామినేషన్ డే కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. కానీ ఈసారి నామినేషన్ డే కూడా కూల్‌గా ఉంది.
Bigg Boss 6 Telugu: వారమంతా ఆడకపోయినా... నామినేషన్లు వచ్చాయంటే చాలు అందరూ తమ గొంతులకు పని చెబుతారు. వాదిస్తారు, అరుస్తారు, ఏడుస్తారు... ఇలా గోల గోల చేస్తారు. కానీ ఈసారి నామినేషన్లు ఎందుకో కూల్‌గా అయినట్టు కనిపించాయి. బిగ్‌బాస్ బకెట్లతో చెత్త తెచ్చి వరుసగా పెట్టాడు. అందులో ఎండిపోయిన ఆకులు కనిపించాయి. ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి నెత్తిపై చెత్త పోసి మరీ ఎందుకు నామినేట్ చేస్తున్నారో చెప్పాలని అడిగాడు.
ఆదిరెడ్డి ఇంతవరకు తాను నామినేట్ చేయని ఇద్దరు వ్యక్తులను నామినేట్ చేస్తున్నట్టు చెప్పారు. వారు రోహిత్, శ్రీహాన్. తనను నామినేట్ చేస్తుంటే శ్రీహాన్ చాలా ఆశ్చర్యపోయాడు. శ్రీహాన్ గురించి చెబుతూ ‘సంచాలక్ తప్పు వల్ల మనం గెలవాలి అనుకోవడం నీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేదు’ అన్నాడు. దానికి శ్రీహాన్ ‘తెలిసి కూడా చెప్పకపోవడం కంటే వాళల అజాగ్రత్త ఎక్కువ ఉంది అని నేను అనుకుంటున్నా’ అంటూ శ్రీహాన్ చాలా కూల్ గా సమాధానం ఇచ్చాడు. ఇక ఫైమా రోహిత్, ఇనాయను నామినేట్ చేసింది. రోహిత్ ‘ఎఫ్’ పదం వాడినందుకు తాను నామినేట్ చేసినట్టు చెప్పింది. రోహిత్ మాత్రం తనకు ఆ పదం వాడినట్టు గుర్తులేదని చెప్పాడు. ఇక ఇనాయ గురించి చెబుతూ ఫైమా ‘అమ్మాయిలో ఎవరైనా ఫిజికల్ అవుతారు అంటే అది నీ పేరే వచ్చేలా చేసుకోకు’ అని చెప్పింది. దానికి ఇనాయ ‘నేను నిన్నే ఎటాక్ చేయాలని చేయలేదు’ అంది. వీరిద్దరూ పెద్దగా వాదించుకోకుండానే ముగించినట్టు కనిపించింది.
శ్రీహాన్ రోహిత్‌ను నామినేట్ చేశాడు. రోహిత్ గత వారం కెప్టెన్సీ కంటెండర్ల టాస్కులో బ్యాగ్‌ను విసిరికొట్టడంపై శ్రీహాన్ ఆయన్ను నామినేట్ చేశాడు. మెరీనా రేవంత్‌ను నామినేట్ చేసింది. ‘నువ్వు అప్ సెట్ అయ్యావు, కన్ఫ్యూజ్ కూడా అయ్యావ్’ అంటూ ఏదో చెప్పింది. దానికి రేవంత్ నేను గేమ్ ఆడకపోతే బయట ఉండే వాడిని అంటూ సమాధానం ఇచ్చాడు.
కీర్తిని నామినేట్ చేసిన శ్రీహాన్ ‘ఈ వారం నిన్ను అందరూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం, నువ్వు గెలవాలని గట్టిగా కోరుకున్నాం’ అని చెప్పాడు. దానికి కీర్తి ‘నాకు ఎవరి హెల్ప్ వద్దు’ అంది. ఇలా ఎందుకు అన్నదో ఎపిసోడ్లోనే తెలిసేది. ఆదిరెడ్డిని ఇనాయ నామినేట్ చేసింది. దాంతో ఆదిరెడ్డి ‘బిగ్ బాస్ నా నెక్ట్స్ వీక్ నామినేషన్ ఇనాయ’ అంటూ చెప్పాడు. వీరిద్దరిదీ కాస్త ఫన్నీగా సాగింది. ఇనాయ నామినేషన్ కారణం చెప్పగానే ఆదిరెడ్డి కింద వేసి చెత్తను తీసి మళ్లీ నెత్తి మీద పోసుకున్నాడు. దానికి అందరూ నవ్వారు.
గతవారం షాకింగ్‌గా ఇద్దరిని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్. వాసంతి, బాలాదిత్యలతో ఆదిత్య శనివారం, వాసంతి ఆదివారం ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఇంకో నాలుగు వారాల్లో బిగ్ బాస్ ముగియనుంది. ఇప్పటికీ టైటిల్ ఫేవరేట్ గా రేవంత్ ఉన్నాడు. టాప్ 4లో ఉండే కంటెస్టెంట్లుగా శ్రీహాన్, ఆదిరెడ్డి, ఫైమా ఉన్నారు.
Also read: ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 6 గ్లామర్ డాల్ వాసంతి అవుట్