ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 6 గ్లామర్ డాల్ వాసంతి అవుట్
Bigg Boss 6 Telugu: సీజన్ 6 నుంచి ఒక్కొక్కరుగా ఇంటి సభ్యులు బయటికి వచ్చేస్తున్నారు. రెండు వారాల్లో టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో తేలిపోతుంది.
Bigg Boss 6 Telugu: వాసంతి... బిగ్ బాస్ సీజన్ 6 గ్లామర్ డాల్ అని చెప్పుకోవచ్చు. మొదట్నించి అందంతోనే ఆ ఇంట్లో నెట్టుకొచ్చింది వాసంతి. చక్కగా రెడీ అవ్వడంలో ఆమెను మించిన వారు ఆ ఇంట్లో లేరు.బుట్టబొమ్మలా రెడీ అయిపోయి బిగ్ బాస్ ఇంట్లో అందాల రాణిలా తిరుగుతూ ఉంటుంది. ఎట్టకేలకు ఈ బ్యూటీ ఇంటి నుంచి బయటికి వెళ్లింది. బిగ్ బాస్ సీజన్ 6లో నోరు పారేసుకోకుండా, డీసెంట్‌గా ఆడిన వారిలో వాసంతి కూడా ఒకరు. ఆమె ఇన్నాళ్లు ఇంట్లో ఉండేందుకు అది కూడా ఒక కారణమే.
ఎపిసోడ్ లో ఏముందంటే... ఎపిసోడ్ మొదలవ్వగానే ఒకరిని సేవ్ చేసే పని మొదలుపెట్టారు. అందరికీ సిలిండర్ ఆకారంలో ఉన్న ఒక వస్తువును ఇచ్చారు. అందులో పాము వస్తే అన్ సేఫ్, నిచ్చెన వస్తే సేఫ్ అని చెప్పారు. ఇందులో కీర్తి, ఫైమా సేవ్ అయ్యారు. తరువాత ఇంటి సభ్యులతో ఆటలు ఆడించారు. పాటను బొమ్మ రూపంలో గీస్తే ఇంటి సభ్యులు పోల్చాలి. ఆ ఆటను కాసేపు ఆడించి పాటలకు డ్యాన్సులు వేయించాలి. తరువాత ఇంటి సభ్యుల చిన్నప్పటి ఫోటోలు చూపించి వారెవరో పోల్చుకోమని చెప్పారు. ఓడి పోయిన వారికి ఫన్నీ ఫన్నీ టాస్కులు ఇచ్చారు. రేవంత్‌కు నాలుక బయట పెట్టి పాటలు పాడమని, ఇనయాకు కోడిలా గెంతుకుంటూ పాట పాడమని ఇలా చెప్పారు. మధ్యమధ్యలో ఒక్కోక్కరినీ సేవ్ చేస్తూ వచ్చారు. రేవంత్, ఆదిరెడ్డి, ఇనాయ , శ్రీహాన్ సేఫ్ అయినట్టు చెప్పారు. చివరికి మిగిలింది మెరీనా, వాసంతి మిగిలారు. వీరిద్దరికీ ఫిష్ బౌల్స్ ముందు పెట్టారు. వారి చేతికి ఒక కాగితం పువ్వు ఇచ్చారు. ఆ పువ్వును నీటిలో ముంచినప్పుడు ఎవరి నీళ్లలో అయితే ఎరుపు రంగు కనిపిస్తుందో వారు ఎలిమినేట్ అని చెప్పారు. వాసంతి బౌల్‌లో ఎరుపు రంగు కనిపించడంతో ఆమె ఎలిమినేట్ అయ్యింది. c
ఫేక్ ఫ్రెండ్స్ ఉన్నారు...
వాసంతి వేదిక మీదకు వచ్చాక ఆమె జర్నీని చూపించారు. ఆమె జర్నీ ఆమెలాగే చాలా అందంగా ఉంది. తరువాత ఆమెకు ఇంట్లో ఆమెకు బెస్ట్ ఫ్రెండ్స్, ఫేక్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పమని అడిగారు. అందులో ఆమె మెరీనా, కీర్తి, ఇనాయ, రేవంత్ మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది. ఇక తనకు పెద్దగా పరిచయం లేని వారిగా రాజ్, ఆదిరెడ్డి, ఫైమా ఫోటోలను పెట్టింది.
View this post on Instagram