అన్వేషించండి

Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్’ లవర్స్‌కు గుడ్ న్యూస్ - సీజన్ 8 స్టార్ట్ అయ్యేది అప్పుడే!

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ప్రేక్షకులంతా సీజన్ 8 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీజన్ 8 ప్రారంభం అయ్యేది అప్పటినుండే అంటూ ఒక డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Bigg Boss 8 Telugu Starting Date: తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా ఏడు సీజన్లు పూర్తిచేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్, దాని తర్వాత జరిగిన గొడవ.. చాలారోజుల పాటు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది. అందుకే తరువాతి సీజన్‌లో ఏం గొడవలు జరగబోతున్నాయో అని ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అయ్యింది. అలా సీజన్ 8 కోసం ఎదురుచూసే బిగ్ బాస్ లవర్స్ సంఖ్య పెరిగిపోయింది. ఇక అందరు అనుకున్నదానికంటే ముందే బిగ్ బాస్ 8 తెలుగు ప్రోమో విడుదలయ్యింది. ఇప్పుడు ఈ సీజన్ స్టార్ట్ అయ్యేది అప్పుడే అంటూ ఒక వార్త బిగ్ బాస్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

అప్పటినుండే స్టార్ట్..

మామూలుగా బిగ్ బాస్ అనేది ప్రతీ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతుంది. డిసెంబర్ వరకు కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్ హౌజ్‌లోనే ఉండాల్సి వస్తుంది. అదే విధంగా బిగ్ బాస్ సీజన్ 8 కూడా సెప్టెంబర్ మొదటి వారం నుండే ప్రారంభం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ 8 స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌కు సంబంధించిన ప్రోమో కూడా వచ్చేసిందంటే.. దాదాపుగా ఈ సీజన్ ప్రసారానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. పైగా చాలారోజుల నుంచి బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్స్‌గా వచ్చేది వీరే అంటూ పలువురి పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కే ఓటు..

ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, సింగర్స్, కనుమరుగు అయిపోయిన సినిమా ఆర్టిస్టులు, యాక్టివ్‌గా ఉన్న సీరియల్ ఆర్టిస్టులు, కామెడియన్స్.. వీరంతా కంటెస్టెంట్స్‌గా వస్తారు. అయితే బిగ్ బాస్ సీజన్ 7లో ఇన్‌ఫ్లుయెన్సర్ కేటగిరిలో కంటెస్టెంట్‌గా వచ్చిన పల్లవి ప్రశాంత్ ఒక రేంజ్‌లో ఫేమస్ అయిపోయాడు. కామన్ మ్యాన్ అంటూ, రైతుబిడ్డ అంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పల్లవి ప్రశాంత్ ఒకవైపు, మిగతా కంటెస్టెంట్స్ అంతా ఒకవైపు అంటూ జరిగిన గొడవలు అన్నీ బిగ్ బాస్‌కు కూడా మంచి టీఆర్‌పీని తెచ్చిపెట్టాయి. అందుకే బిగ్ బాస్ సీజన్ 8లో కూడా అలా ఎక్కువగా ప్రేక్షకులకు పరిచయం లేని ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను కంటెస్టెంట్స్‌గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.

అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్మెంట్..

బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమోలో ఒక్కసారి కమిట్ అయితే లిమిట్ లేదు అని ప్రకటించారు నాగార్జున. అంటే ఈసారి ఎంటర్‌టైన్మెంట్ అన్‌లిమిటెడ్ అని అర్థమవుతోంది. ఈసారి ఎక్కువగా పర్సనల్ లైఫ్‌లో కాంట్రవర్సీలు ఉన్న సెలబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా రావడానికి సిద్ధమవుతున్నారని సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా ఎక్కువగా కాంట్రవర్సీలు క్రియేట్ చేసేవాళ్లే అయ్యిండాలని సెర్చింగ్ మొదలుపెట్టారట. ఇక బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ దాదాపుగా ఫైనల్ అయిపోయినా.. సీజన్ ప్రారంభం అవ్వడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం.

Also Read: తెలుగు బిగ్ బాస్ 8లో వేణు స్వామి - భారీ పారితోషికం డిమాండ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Rayachoti Issue: రాయచోటిలో అయ్యప్పభక్తులపై దాడి ఘటన కలకలం  - బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
రాయచోటిలో అయ్యప్పభక్తులపై దాడి ఘటన కలకలం - బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
U19 Asia Cup Final: భారత్‌కు షాకిచ్చిన బంగ్లా టైగర్లు - అండర్ -19 అసియా కప్ కైవసం
భారత్‌కు షాకిచ్చిన బంగ్లా టైగర్లు - అండర్ -19 అసియా కప్ కైవసం
Embed widget