Bigg Boss 6 Telugu: హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఫైమా - ఆమె చేతిని ముద్దాడిన నాగార్జున
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ నుంచి ఫైమా ఎలిమినేట్ అయింది.
Bigg Boss 6 Telugu: గత వారమే ఫైమాకు చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. కానీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల మరొక వారం ఉండగలిగింది. ఈ వారం ఫైమాను ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్. కమెడియన్ గా అడుగుపెట్టిన ఫైమా కొన్ని రోజులు బాగానే నవ్వించింది. కానీ ఆరేడు వారాలుగా మాత్రం ఎంటర్టైన్ చేయడం, కామెడీ చేయడం పూర్తిగా మరిచ్చిపోయింది. గ్రూపులు కట్టి ఇనాయ మీద పగ సాధించినట్టు ప్రవర్తించింది. దాంతో ఆమె కామెడీ ట్రాక్ తప్పింది. ఇక ఎపిసోడ్ విషయానికి వస్తే సన్ డే ఫన్ డే అంటూ నాగార్జున వేదిక మీదకు వచ్చేశారు. ఎప్పటిలాగే ఇంటి సభ్యులతో గేమ్స్ ఆడించార.
ఎవరితో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటారు?
ఇంటి సభ్యుల్లో ఎవరితో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటారు, ఎవరి లైఫ్ లాంగ్ ఫ్రెండ్ అని అడిగారు. దానికి ఆదిరెడ్డి మొదటగా ఫైమా లైఫ్ లాంగ్ ఫ్రెండ్ అని, ఇనాయతో స్నేహం కొనసాగింలేనేమోనని చెప్పాడు. ఇక రేవంత్ శ్రీసత్య లైఫ్ లాంగ్ ఫ్రెండ్ అని, కీర్తి ఫ్రెండ్ కాదని చెప్పాడు. కీర్తి తనకు శ్రీహాన్ ఫ్రెండ్ కాడని, ఇనాయ ఫ్రెండ్ ఫర్ లైఫ్ అని చెప్పింది. శ్రీసత్య రోహిత్ తనకు ఫ్రెండ్ కానది, రేవంత్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్ అని చెప్పింది. శ్రీహాన్ రేవంత్ తన ఫ్రెండ్ అని, ఆదిరెడ్డి నెల్లూరులో ఉంటాడు కాబట్టి ఆయన ఫ్రెండ్షిప్ కట్ అవుతుందని చెప్పాడు. ఫైమా ఆదిరెడ్డి తనకు లైఫ్ లాంగ్ ఫ్రెండ్ అని, రోహిత్ తో బయటకు వెళ్లాక ఫ్రెండ్షిప్ కట్ అవుతుందని చెప్పింది.
హిట్ టీమ్
హిట్ 2 సినిమా టీమ్ అడివి శేష్, మీనాక్షి చౌదరి, శైలేష్ కొలను వేదిక మీదకు వచ్చారు. వారితో కాసేపు సరదాగా మాట్లాడించారు నాగార్జున. హౌస్ లో ఓ చోట కోడి బుర్ర అని రాసి, అది ఎవరు రాశారో కనిపెట్టమని అడిగారు అడివి శేష్‌ని. హిట్ 2 సినిమాలో క్రిమినల్స్‌ని కోడి బుర్రలతో హీరో పోలుస్తాడు. అందుకే కోడి బుర్ర అని రాయించి ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగింది. అందరూ సేవ్ అయ్యాక చివరికి ఆదిరెడ్డి, ఫైమా మిగిలారు. వారిలో ఫైమా ఎలిమినేట్ అయినట్టు చెప్పారు నాగార్జున.
ఫన్ ఎవరు?
వేదిక మీదకు వచ్చిన ఫైమాతో చిన్క గేమ్ ఆడించారు. ఇంట్లో ఫన్ ఎవరు? ఫ్రస్టేషన్ ఎవరు? అనే గేమ్ అది. ఫైమా రేవంత్ తప్ప అందరి ఫోటోలను ఫన్ కేటగిరీలో వేసింది. రేవంత్ మాత్రం ఫ్రస్టేషన్ కేటగిరీలోనే ఉన్నాడు. రేవంత్ ‘మార్చుకంటాను ఫైమా’ అనేసరికి, నాగార్జున ‘ఇంకెప్పుడు మార్చుకుంటావ్’ అంటూ నవ్వేశారు.
ఫైమాకు ముద్దు
రేవంత్ మాట్లాడుతూ ‘ఫైమాకు చేతిపై ముద్దు పెడితే నచ్చదు, చక్కిలిగింతలు వస్తాయి’ అని చెప్పాడు. దాంతో నాగార్జున ఫైమా చేయి దాచుకున్నా సరే, లాక్కుని మరీ ముద్దు పెట్టేశారు. ఆమె సిగ్గుపడుతూ ముఖం దాచుకుంది.
Also read: ‘కోడి బుర్ర అని రాసిందెరు?’ -బిగ్‌బాస్ వేదికపై హిట్ సినిమా హీరో అడివి శేష్ ఇంటరాగేషన్