By: Haritha | Updated at : 04 Dec 2022 12:27 PM (IST)
(Image credit: Star maa)
Bigg Boss 6 telugu: హిట్:ద ఫస్ట్ కేస్ సినిమాకు సీక్వెల్ గా వచ్చి హిట్ 2. ఇందులో అడివి శేష్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా చేశారు. డిసెంబరు 2న ఈ సినిమా విడుదలైంది. మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అడివి శేష్, మీనాక్షి బిగ్ బాస్ కు వచ్చారు.
ఇక ప్రోమోలో ఏముందంటే... నాగార్జున ఇంటి సభ్యులతో మాట్లాడుతూ రేవంత్‌ను గ్లాస్ డోర్‌పై కోడి బుర్ర అని రాసి, ఒక దెయ్యం బొమ్మ వేయమని చెప్పారు. అలా వేశాక ‘కోడి బుర్ర అని ఎవరు రాశారో చెప్పడం కోసం ఒక కూల్ కాప్ (పోలీస్) వేదిక మీదకు వస్తున్నాడు’ అని చెప్పారు. ఆ వెంటనే అడివి శేష్ వేదిక మీదకు వచ్చారు. కోడి బుర్ర అని ఎవరు రాశారో కనిపెట్టమని చెప్పారు నాగార్జున. కోడిబుర్ర అని తననే అంటున్నారా అని అడిగాడు శేష్. తరువాత ఎవరో కనిపెట్టే పనిలో పడ్డాడు. రాసే రాత చూస్తుంటే అమ్మాయిలు రాసినట్టు లేదని, అమ్మాయిలు చక్కగా రాస్తారని చెప్పాడు. రాసిన హైట్‌ను బట్టి చూస్తూ బాగా ఎత్తుగా ఉన్నవాళ్లు కాకుండా సాధారణ హైట్ ఉన్నవాళ్లే ఇది రాసుంటారని అన్నారు. మొత్తానికి ఆయన కనిపెట్టారో లేదో తెలియదు కానీ ఇంటి కంటెస్టెంట్లతో కొన్ని ఆటలు ఆడించారు. నీస్, ఫోల్డర్స్ అంటూ చిన్న పిల్లల ఆట ఆడించారు. తరువాత హీరోయిన్ మీనాక్షి కూడా వేదిక మీదకు వచ్చింది.
ఆయనే నెంబర్ వన్?
నిజానికి మొన్నటి వరకు శ్రీసత్యకు అందరికన్నా తక్కువ ఓట్లు పడ్డాయి. కానీ చివరి నిమిషంలో ఓటింగ్ మారింది. ఫైమాకు అయిదు శాతం ఓట్లు పడితే, శ్రీసత్యకు ఎనిమిది శాతం ఓటింగ్ పడింది. అయితే మొన్నటి రేవంత్ ఎక్కువ శాతం ఓటింగ్‌తో మొదటి స్థానంలో ఉండగా, రోహిత్ అనూహ్యంగా దూసుకొచ్చి మొదటి స్థానాన్ని దక్కించు కున్నాడు. రేవంత్, రోహిత్‌లలో ఒకరు విన్నర్ అయ్యే ఛాన్సు అధికంగా ఉంది. ఇప్పటికే శ్రీహాన్ ఫైనల్లోకి వెళ్లిన మొదటి కంటెస్టెంట్‌గా మారాడు. టిక్కెట్ టు ఫినాలే దక్కించుకున్నాడు. శ్రీహాన్ టాప్ 5లోకి అడుగుపెట్టేశాడు.
Bigg Boss Telugu: నాన్‌స్టాప్‌కు పుల్‌స్టాప్? ‘బిగ్ బాస్’ ఓటీటీ వెర్షన్ ఇక లేనట్లేనా!
Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్
Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!
వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం
Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!
‘వసుమతి’కి పెళ్లైపోయింది - బాలీవుడ్ హీరో సిద్ధార్థ్‌తో ఘనంగా కియారా వెడ్డింగ్, ఒక్కరోజుకు అంత ఖర్చా?
Kadiyam Srihari On Sharmila: జగన్ జైలుకు వెళ్తే సీఎం చాన్స్ - ఏపీకి వెళ్లాలని షర్మిలకు కడియం శ్రీహరి సలహా !
Kiranmayee Alivelu: మిసెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన తెలంగాణ అందం!
YS Jagan: 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు - ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం జగన్ ప్రకటన
Khammam Politics : సస్పెండ్ చేయమంటున్న పొంగులేటి - రాజీనామా చేయమంటున్న పువ్వాడ ! ఇద్దరి కామన్ డైలాగ్‌లో "దమ్ము" హైలెట్ !