Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు
Bigg Boss 6 Telugu: ఈ సీజన్ బెస్ట్ కెప్టెన్ ఎవరు, వరస్ట్ కెప్టెన్ ఎవరో ఈ వారం చెప్పారు నాగార్జున.
Bigg Boss 6 Telugu: ఈ సీజన్ చివరి కెప్టెన్ ఇనాయ. మొదటి వారం నుంచి కెప్టెన్ అవుదామని ప్రయత్నిస్తూ చివరి వారం అయింది ఇనాయ. కాగా ఈ ఎపిసోడ్లో నాగార్జున ఎవరు బెస్ట్ కెప్టెన్, ఎవరు వరస్ట్ కెప్టెన్ చెప్పమని అడిగారు. దానికి ఎక్కువ మంది ఇనాయ పేరు చెప్పడంతో ఆమె బెస్ట్ కెప్టెన్ అయింది. ఇక ఆదిరెడ్డి వరస్ట్ కెప్టెన్‌గా నిలిచాడు.
కోపమే పెద్ద లాస్
ఎపిసోడ్ మొదలవ్వగానే రేవంత్ కన్ఫెషన్ రూమ్లో ఉన్నాడు. అతనికి బిగ్ బాస్ కూతురు పుట్టిన సంగతి చెప్పాడు బిగ్ బాస్. అతను ఆనంద పడుతూ ఇంటిసభ్యులను ఆ విషయాన్ని పంచుకున్నాడు. ఇక తరువాత ‘టిక్కెట్ టు ఫినాలే’ చివరి టాస్కు ఇచ్చారు. శ్రీహాన్, రేవంత్ తాళ్లను చేత్తో ఊపే టాస్కు ఇచ్చారు. ఆదిరెడ్డి సంచాలక్ గా ఉన్నారు. ఆడుతూ మధ్యలో రేవంత్ కోపం కారణంగా వదిలేసి వచ్చాడు. ఆయన కోపమే ఆయనకు పెద్ద లోపం అని చెప్పచ్చు. ప్రతి టాస్కులో కోపం, అలకలు చూపిస్తూనే ఉన్నాడు. ఈ లక్షణం లేకపోతే ఆయన కచ్చితంగా విన్నర్ అవుతాడు. కాగా శ్రీహాన్ టిక్కెట్ టు ఫినాలే గెలుచుకుని ఫైనల్లోకి అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్ అయ్యాడు.
రేవంత్‌కు సర్‌ప్రైజ్
తండ్రయిన రేవంత్‌కు నాగార్జున సర్ ప్రైజ్ ఇచ్చారు. అతని భార్య, పుట్టిన బిడ్డను వీడియో కాల్ ద్వారా చూపించారు. కూతురిని చూసి ఆనందపడ్డాడు రేవంత్. పాట పాడి తల్లులందరికీ అంకితం చేశాడు. కాగా నాగార్జున రేవంత్ ఆట మధ్యలో వదిలేసి వెళ్లడంపై క్లాసు పీకారు. ‘భగవద్గీత తెలుసు కదా ప్రయత్నం మాత్రమే నీది, ఫలితం గురించి ఆలోచించరకు, నువ్వు ప్రయత్నం ఆపేస్తే ఫలితం మారిపోతుంది కదా, అదే జరిగింది’ అని చెప్పారు. నేను చేసింది తప్పే సర్ అన్నాడు రేవంత్. కానీ మళ్లీ మళ్లీ అలాగే కోపంతో రగిలిపోతూ, అలిగి వెళ్లిపోతుంటాడు రేవంత్.
ఇక తరువాత ఇంటి సభ్యులు రిగ్రెట్ అయిన వారం ఏంటో చెప్పమని అడిగారు. దానికి రేవంత్ 13వ వారం ఆదిరెడ్డి రెచ్చగొట్టేసరికి ఓవర్ గా మాట్లాడాను అని అన్నారు. ఇక రోహిత్ 12వ వారం ఇనాయను నమ్మి మోసపోయానని చెప్పారు. శ్రీసత్య 11వ వారంలో కీర్తిని ఇమిటేట్ చేసి తప్పు చేశానని చెప్పింది. ఆదిరెడ్డి 9వ వారంలో మైక్ విసరడం, 11వ వారంలో ఎవిక్షన్ ఫ్రీపాస్ వేస్టు అనడం రిగ్రెట్ అవుతున్నట్టు చెప్పింది.
ఆదిరెడ్డి ఇక చాలు...
ఆదిరెడ్డి - రేవంత్ మధ్య ఒక ఇష్యూ ఇంకా నడుస్తూనే ఉంది. రేవంత్ అమ్మాయిలే వీక్ అని మాట్లాడాడని ఆదిరెడ్డి వాదిస్తూనే ఉన్నాడు. ఆ విషయంపై గత వారం వీడియో వేసి మరీ చూపించినా ఆదిరెడ్డి ఒప్పుకోలేదు. మొత్తం వీడియో వేస్తే తెలుస్తుంది అంటూ వాదించసాగాడు. దీనిపై నాగార్జున మొత్తం వీడియో వేసి చూపించాడు. ఇక్కడ రేవంత్ ఎక్కడైనా ఆడపిల్లలు వీక్, వాళ్లు వస్తే ఈజీగా గెలవచ్చు అనే పదం వాడాడా అని ఇంటి సభ్యులను అడిగారు. అందరూ లేదు అన్నారు. ఆదిరెడ్డి ఉద్దేశించి ‘ఆదిరెడ్డి నాన్సెన్స్ మాట్లాడుతున్నావు, ఇక మీదట దీన్ని సాగదీయద్దు’ అని స్ట్రాంగ్‌గా చెప్పారు.
Also read: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్