అన్వేషించండి

Bigg Boss Updates: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఫుడ్ లొల్లి - శివాజీ దుమ్ముదులిపిన శోభా శెట్టి, యావర్ హర్ట్!

బిగ్ బాస్ ఇంట్లో నాలుగో పవర్ అస్త్ర కోసం గొడవలు తారా స్థాయికి చేరుకునేలా కనిపిస్తున్నాయి. ఎవరి స్ట్రాటజీ వాళ్ళు ప్లే చేస్తూ కనిపించారు.

బిగ్ బాస్ ఇంట్లో నాలుగో పవర్ అస్త్ర కోసం పోటీ కొనసాగుతోంది. పవర్ అస్త్రని సొంతం చేసుకునేందుకు ఎవరి స్ట్రాటజీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. దీని గురించి కిచెన్ లో పెద్ద గొడవే జరిగింది. పవర్ అస్త్ర కోసం ఇంటిని బ్యాంక్ గా మార్చారు బిగ్ బాస్. బజర్ మోగినప్పుడు కాయిన్స్ తీసుకోవడం కోసం ఇంట్లో శివాజీ, శోభా శెట్టి, సందీప్ మినహా మిగతా వాళ్ళు పోటీదారులుగా నిలిచారు. యావర్ తినడం గురించి సందీప్ సీరియస్ అయిపోతాడు. నిన్న శుభశ్రీ మీద గొడవకి దిగిన శివాజీ ఇప్పుడు శోభా శెట్టి మీద అరుస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన తాజా ప్రోమో రిలీజ్ చేశారు.

యావర్, ప్రశాంత్ బ్యాంక్ ఏటీఎం దగ్గర కూర్చుని తింటూ ఉంటాడు. ఆరు రొటీలు తిన్నాడు, ఎగ్స్ తిన్నాడు, ఇప్పుడు రైస్ తింటున్నాడని సందీప్ అంటాడు. అప్పుడే యావర్ వచ్చి చపాతీ మరొకటి కావాలని శివాజీని అడుగుతాడు. యావర్ బజర్ కొడితే ప్రశాంత్ ని పార్టనర్ గా చేసుకోవాలని అనుకుంటున్నట్టు రతిక చెప్తుంది. సందీప్ ఫుడ్ విషయంలో యావర్ తో వాదనకి దిగాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంటెస్టెంట్స్.. వాళ్ళు ఇక్కడ కూర్చుని తింటుంటే నువ్వు హెల్త్ బాగోని ప్రశాంత్ తో ఫుడ్ తెప్పించుకోవడం నాకు నచ్చలేదు” అని సందీప్ యావర్ మీద సీరియస్ అయ్యాడు. దీంతో యావర్ తినే ప్లేట్ ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ప్లేట్ అలా వదిలి వెళ్లొద్దని ప్రియాంక కోపంగా అంటుంది. సందీప్ కూడా అలా ప్లేట్ వదిలేయొద్దని, ఫుడ్ వెస్ట్ చేయవద్దని తిడతాడు. తను తిననని యావర్ గట్టిగా అరిచి చెప్పాడు.

తనకి ఆమ్లెట్ కావాలంటే చాలా సార్లు తెచ్చి ఇచ్చారు కదా అని శివాజీ యావర్ ని వెనకేసుకొచ్చే విధంగా మాట్లాడతాడు. అది కాదు యావర్ బజర్ దగ్గరే కూర్చుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిచ్చి వాళ్ళా ఏంటని సందీప్ మిగతా కంటెస్టెంట్స్ కి అనుకూలంగా కరెక్ట్ గా మాట్లాడతాడు. యావర్ తినే ప్లేట్ విసిరేయడం తనకి నచ్చలేదని సందీప్ అంటే జనాలు చూస్తున్నారు కదా అంటూ లా పాయింట్ మాట్లాడేందుకు శివాజీ చూస్తాడు. కానీ శోభా శెట్టి మాత్రం దుమ్ము దులిపేస్తుంది. ఇది తన స్ట్రాటజీ అని కావాలంటే వాళ్ళని వచ్చి కూర్చోమని యావర్ తను చేసిన పనిని సమర్థించుకుంటాడు.

ఇప్పటివరకు పవర్ అస్త్రాలు సాధించిన సందీప్, శివాజీ, శోభా శెట్టి.. బ్యాంకర్లుగా వ్యవహరించారు. ఈ టాస్క్ కోసం బ్యాంకర్లుగా ఉన్న శివాజీ, సందీప్, శోభాలకు ముగ్గురికి సెపరేటుగా 100 కాయిన్స్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ కాయిన్స్‌ను వారు ఎవరికి నచ్చితే వారికి ఇచ్చుకోవచ్చు. చివరికి ఎవరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటాయో.. వారు పవర్ అస్త్రా కంటెండర్స్ అవ్వగలరు. బ్యాంకర్స్‌ను ఐస్ చేసి కంటెస్టెంట్స్ అందరూ.. వారి ముగ్గురి దగ్గర ఉన్న కాయిన్స్‌ను తీసేసుకున్నారు. అందరికంటే ఎక్కువగా తేజ దగ్గర 51 కాయిన్స్ ఉన్నాయి. తేజ.. శోభా శెట్టి దగ్గర మాత్రమే కాకుండా ఇంకా ఇద్దరు బ్యాంకర్స్ దగ్గర కూడా కాయిన్స్ తీసుకోవడంతో తన దగ్గరే ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో 43 కాయిన్స్‌తో యావర్ ఉన్నాడు. ఆ తర్వాత ప్రియాంక, గౌతమ్ దగ్గర సమానంగా 41 కాయిన్స్ ఉన్నాయి. మిగతా వారి దగ్గర ప్రతీ ఒక్కరి దగ్గర 30కు పైగా కాయిన్స్ ఉన్నాయి. అయితే ఈ కాయిన్స్ అన్నింటిని బిగ్ బాస్.. ఎవరికి వారు సేఫ్ లాకర్స్‌లో దాచుకోమన్నారు. కంటెస్టెంట్స్ అంతా అదే పనిచేశారు.

Also Read: శుభశ్రీ మీద మీదకు వచ్చిన శివాజీ - టచ్ చేయొద్దంటూ వార్నింగ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Minsiter Gottipati Ravikumar: 'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
Special Trains: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
Embed widget