Bigg Boss Season 7 Day 23 Updates: శుభశ్రీ మీద మీదకు వచ్చిన శివాజీ - టచ్ చేయొద్దంటూ వార్నింగ్
కొన్నిసార్లు అనుకోకుండా బిగ్ బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్స్ చేసే పనులు.. ఇతర కంటెస్టెంట్స్‌ను ఇబ్బందులకు గురిచేస్తాయి. తాజాగా శివాజీ చేసిన పని కూడా శుభశ్రీని అసౌకర్యంగా ఫీల్ అయ్యేలా చేసింది.
బిగ్ బాస్ సీజన్ 7లో నాలుగో పవర్ అస్త్రా కోసం పోటీ మొదలయ్యింది. ముందుగా ఈ పవర్ అస్త్రాను సాధించుకోవడం కోసం బిగ్ బాస్ హౌజ్ ఒక బ్యాంకులాగా మారింది. కంటెస్టెంట్స్ అంతా బ్యాంకులోని కస్టమర్లుగా మారారు. ఇప్పటివరకు పవర్ అస్త్రాలు సాధించిన సందీప్, శివాజీ, శోభా శెట్టి.. బ్యాంకర్లుగా వ్యవహరించారు. ఈ టాస్క్ కోసం బ్యాంకర్లుగా ఉన్న శివాజీ, సందీప్, శోభాలకు ముగ్గురికి సెపరేటుగా 100 కాయిన్స్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ కాయిన్స్‌ను వారు ఎవరికి నచ్చితే వారికి ఇచ్చుకోవచ్చు. చివరికి ఎవరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటాయో.. వారు పవర్ అస్త్రా కంటెండర్స్ అవ్వగలరు. అదే క్రమంలో పలు వాగ్వాదాలు కూడా జరిగాయి. శివాజీ.. తనతో తప్పుగా ప్రవర్తించినట్టుగా శుభశ్రీ.. కెమెరాలకు చెప్పుకుంది.
బిగ్ బాస్ బ్యాంక్ టాస్క్ మొదలవ్వగానే కాయిన్స్ కోసం బ్యాంకర్స్‌ను ఐస్ చేయడం మొదలుపెట్టారు కంటెస్టెంట్స్. కానీ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్న కంటెస్టెంట్స్ కూడా ముందు నుండే ఎవరికి సపోర్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సందీప్ మాత్రం కాయిన్స్ కోసం తన దగ్గరకు వచ్చిన కంటెస్టెంట్స్‌కు ప్రత్యేకంగా టాస్కులు ఇస్తూ.. మరింత ఎంటర్‌టైన్మెంట్ పంచే ప్రయత్నం చేశాడు. ముందుగా కాయిన్స్ కోసం తన దగ్గరకు తేజ రాగా.. యావర్‌తో పచ్చిగుడ్డు తినిపించమని టాస్క్ ఇచ్చాడు సందీప్. ఒక కాయిన్ ఇస్తానని చెప్పడంతో యావర్ కూడా పచ్చిగుడ్డు తినడానికి అంగీకరించాడు, తిన్నాడు కూడా. ఇక రతికకు ప్రియాంకతో గొడవపడమని ఇచ్చాడు సందీప్. ఆ పని తను కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. అలా కాసేపు హౌజ్‌లో ఎంటర్‌టైన్మెంట్ సాగింది.
సేఫ్ లాకర్స్‌పై శుభశ్రీ కన్ను..
బ్యాంకర్స్‌ను ఐస్ చేసి కంటెస్టెంట్స్ అందరూ.. వారి ముగ్గురి దగ్గర ఉన్న కాయిన్స్‌ను తీసేసుకున్నారు. అందరికంటే ఎక్కువగా తేజ దగ్గర 51 కాయిన్స్ ఉన్నాయి. తేజ.. శోభా శెట్టి దగ్గర మాత్రమే కాకుండా ఇంకా ఇద్దరు బ్యాంకర్స్ దగ్గర కూడా కాయిన్స్ తీసుకోవడంతో తన దగ్గరే ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో 43 కాయిన్స్‌తో యావర్ ఉన్నాడు. ఆ తర్వాత ప్రియాంక, గౌతమ్ దగ్గర సమానంగా 41 కాయిన్స్ ఉన్నాయి. మిగతా వారి దగ్గర ప్రతీ ఒక్కరి దగ్గర 30కు పైగా కాయిన్స్ ఉన్నాయి. అయితే ఈ కాయిన్స్ అన్నింటిని బిగ్ బాస్.. ఎవరికి వారు సేఫ్ లాకర్స్‌లో దాచుకోమన్నారు. కంటెస్టెంట్స్ అంతా అదే పనిచేశారు. ఆ సేఫ్ లాకర్స్‌పై శుభశ్రీ కన్నేసింది. అక్కడికి వెళ్లి కాయిన్స్ కాజేయాలని చూసింది. కానీ బ్యాంకర్స్ మాత్రం సేఫ్ లాకర్స్‌కు గార్డులుగా ఉన్నారు.
ప్లీజ్ అంటూ దండం పెట్టింది..
సేఫ్ లాకర్స్ దగ్గరకు వచ్చిన శుభశ్రీతో కాసేపు సరదగానే ఉన్నారు శివాజీ. కానీ అంతలోనే శుభశ్రీని కార్నర్ చేసి తనకు చాలా దగ్గరగా నిలబడ్డాడు. ‘‘అంత దగ్గరగా రావద్దు ప్లీజ్’’ అని శుభశ్రీ రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. ‘‘ఇది నా ప్రాపర్టీ’’ అంటూ మాట్లాడడం మొదలుపెట్టాడు శివాజీ. లేదు ఇది మీ ప్రాపర్టీ కాదు అని శివాజీ వ్యాఖ్యలను ఒప్పుకోలేదు శుభ. ‘‘ప్లీజ్ వెనక్కి వెళ్లండి’’ అంటూ దండం పెట్టింది శుభ. ‘‘నేను మిమ్నల్ని టచ్ చేయలేదు. మీరే నన్ను టచ్ చేస్తున్నారు’’ అన్నాడు శివాజీ. అది శుభశ్రీ ఒప్పుకోలేదు. ‘‘నువ్వు చెప్తే నేను వెళ్లను’’ అనేశాడు శివాజీ. ‘‘ఇది కరెక్ట్ కాదు’’ అని శుభశ్రీ ఖండించింది. ఆ తర్వాత బిడ్డ అని పిలుస్తూ మీదకు వస్తున్నారని, అది కరెక్ట్ కాదని శివాజీని ఉద్దేశిస్తూ తనలో తాను మాట్లాడుకుంది శుభశ్రీ. అది ఓవరాక్షన్ అని వ్యాఖ్యలు చేసింది. అయితే, శుభశ్రీ అలా చేయడాన్నిచూసి ప్రేక్షకులు తనను తప్పుగా భావిస్తారేమో అనే ఆందోళన కూడా శివాజీలోకనిపించింది. ఆయన ఉద్దేశపూర్వకంగా చేసినా, చేయకపోయినా.. ఆ సిట్యువేషన్‌ను చూస్తే శివాజీదే తప్పు అనే అభిప్రాయపడే అవకాశాలు ఉన్నాయి.
Also Read: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial