By: ABP Desam | Updated at : 27 Sep 2023 09:52 PM (IST)
Image Credit: Tamannaah/Twitter
సౌత్‌లో విపరీతంగా పాపులారిటీ పొందిన తర్వాత నార్త్‌కు వెళ్లిన హీరోయిన్స్.. సౌత్ ఇండస్ట్రీ మీద కామెంట్స్ చేయడం కామన్‌గా మారిపోయింది. కొందరు హీరోయిన్స్ పాజిటివ్‌గా కామెంట్స్ చేస్తే.. కొందరు మాత్రం నెగిటివ్‌గా కామెంట్ చేస్తారు. చాలావరకు బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తమ కెరీర్ ఎక్కడ ప్రారంభించామని మర్చిపోయి భామలు.. ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు. అందులో కొంతవరకు నిజాలే అయినా ప్రేక్షకులు మాత్రం వాటిని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా సౌత్ పరిశ్రమపై చాలా ఘాటు వ్యాఖ్యలే చేసింది.
మిల్కీ బ్యూటీ తమన్నా ముందు మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించినా.. తనకు హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చింది మాత్రం తెలుగు సినీ పరిశ్రమనే. ఆ తర్వాత మెల్లగా అన్ని పరిశ్రమలను కవర్ చేస్తూ వెళ్లింది. హిందీ, తమిళ చిత్రాల్లో కూడా నటించింది. హీరోయిన్‌గా పరిచయమయ్యి ఎన్నో ఏళ్లు అవుతున్నా కూడా తమన్నా క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఇప్పటికీ సీనియర్ హీరోలతో జోడీకడుతూ తన కెరీర్‌ను బిజీగా గడిపేస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ‘‘అక్కడ పురుషాధిక్యాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు’’ అని పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చింది. తమన్నా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘‘కొన్ని కమర్షియల్ సినిమాల్లో నేను నా క్యారెక్టర్‌తో కనెక్ట్ అయ్యేదాన్ని కాదు. అందుకే మేకర్స్‌ను నా క్యారెక్టర్ తగ్గించమని కోరేదాన్ని. అలా చూసి చూసి మెల్లగా అలాంటి పాత్రలు చేయడమే మానేశాను. విషపూరితమైన పురుషాధిక్యతని సెలబ్రేట్ చేసుకొనే సినిమాల్లో భాగం కాకూడదని చేతనైన ప్రయత్నం చేస్తున్నా’’ అని తమన్నా సౌత్‌లోని కమర్షియల్ సినిమాలపై ఘాటు వ్యాఖ్యలే చేసింది. అయితే సౌత్‌లో వచ్చినంత ఫేమ్.. తమన్నాకు బాలీవుడ్‌లో రాలేదు. ఆ అంశంపై కూడా తను స్పందించింది.
తను సక్సెస్, ఫ్లాప్స్‌ను పర్సనల్‌గా తీసుకోను అని బయటపెట్టింది తమన్నా. తను బాలీవుడ్‌లో మొదట్లో చేసిన సినిమాలు వర్కవుట్ అవ్వకపోయినా.. అది తన తలరాత అనుకొని యాక్టింగ్ చేస్తూనే ఉన్నానని చెప్పింది. ‘‘ఒక సినిమాకు చాలామంది పనిచేస్తారు కాబట్టి నేను దానిని పర్సనల్ ఫెయిల్యూర్‌లాగా ఎప్పుడూ తీసుకోలేదు. నేను సక్సెస్, ఫెయిల్యూర్.. రెండిటినీ సీరియస్‌గా తీసుకోను. నేను బ్రతికే ఉన్నాను. ఇక్కడే ఉన్నాను. నేను దీనిని అలాగే చూస్తాను. 17 ఏళ్లు అయినా కూడా నేను ఇప్పటికీ లేచి ఇదే మళ్లీ మళ్లీ కావాలనుకుంటాను. యాక్టింగ్ అనేది నా ప్యాషన్. నేను కెమెరా ముందుకు వెళ్లడానికే నిద్రలేస్తాను. అదే నన్ను బాగా ఎగ్జైట్ చేస్తుంది.’’ అని తన కెరీర్‌లోని సక్సెస్, ఫెయిల్యూర్స్ గురించి ఒక్కమాటలో చెప్పింది తమన్నా. బాలీవుడ్‌లో తన కెరీర్ ఎలా ఉన్నా.. సౌత్‌లో మాత్రం స్టార్ హీరోలతో నటిస్తూ ఇప్పటికీ తమన్నా కెరీర్ వెలిగిపోతోంది. ఇక్కడ తన డ్యాన్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలాంటి ఇండస్ట్రీపై తమన్నా చేసిన వ్యాఖ్యలు.. తన ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్నాయి.
Also Read: ఫేస్‌బుక్ యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్, వాట్సాప్ చానెళ్లలో ఆమే టాప్ - దేవరకొండకు యమ క్రేజ్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?
Movies Releasing This Week : ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమా, సిరీస్‌లు ఇవే!
Prabhas Marriage: ప్రభాస్‌కు జన్మలో పెళ్లి కాదు - బాంబు పేల్చిన వేణు స్వామి, మండి పడుతున్న ఫ్యాన్స్!
Aditi Govitrikar: అందుకు ఒప్పుకోలేదని సినిమా నుంచి తీసేశారు - క్యాస్టింగ్ కౌచ్‌పై నోరువిప్పిన ‘తమ్ముడు’ బ్యూటీ
Aravind Krishna Actor: ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ లీగ్‌లో టాలీవుడ్ హీరో
Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
SI Exam Results: ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో
Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు
Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ
/body>