అన్వేషించండి

WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!

వాట్సాప్ ఛానెల్స్‌లో అప్పుడే కొందరు సెలబ్రిటీలకు ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతోంది. అందులో టాప్ 9గా ఉన్న సెలబ్రిటీలు వీరే.

వాట్సాప్ అధినేత మార్క్.. తాజాగా ఆ మెసేజింగ్ యాప్స్‌లోకి కొత్త ఫీచర్‌ను పరిచయం చేశాడు. అదే వాట్సాప్ ఛానెల్. ఇతర సోషల్ మీడియా యాప్స్‌లో సెలబ్రిటీలను ఎలాగైతే ఫాలో అవుతారో.. వాట్సాప్‌లోని ఛానెల్స్‌లో కూడా యూజర్లు.. నచ్చిన సెలబ్రిటీని ఫాలో అవ్వవచ్చు. అయితే ఈ ఫీచర్ యాడ్ చేసి కొన్నిరోజులే అయినా ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు వాట్సాప్ ఛానెళ్ల ఫాలోయింగ్ విషయంలో రికార్డులు సృష్టించారు.

ఇప్పటికే కత్రినా కైఫ్, అక్షయ్ కుమార్, సన్నీ లియోన్ లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు వాట్సాప్ ఛానెళ్లు క్రియేట్ చేసుకున్నారు. మోమన్‌లాల్, మమ్ముట్టీ లాంటి సౌత్ సెలబ్రిటీలు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. వాట్సాప్ ఛానెళ్ల ద్వారా తమ ఫేవరెట్ సెలబ్రిటీల దగ్గర నుండి మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు అందుకోవచ్చు యూజర్లు. ప్రస్తుతం వాట్సాప్ ఛానెల్స్‌లో ఎక్కువగా ఫాలో అవుతున్న సెలబ్రిటీలు వీరే..

కత్రినా కైఫ్
ప్రస్తుతం వాట్సాప్ ఛానెళ్ల ఫాలోయింగ్ విషయంలో కత్రినా కైఫ్.. ఇతర సెలబ్రిటీలను దాటేసింది. 13.7 మిలియన్ ఫాలోవర్స్.. కత్రినా కైఫ్‌ను ప్రస్తుతం వాట్సాప్ ఛానెల్‌లో ఫాలో అవుతున్నారు. ఇప్పటికే తనను వాట్సాప్‌లో ఫాలో అవుతున్న యూజర్లకు తన పర్సనల్ లైఫ్ గురించి, కెరీర్ గురించి, ఫ్యాషన్ షూట్స్, సినిమాల గురించి పలు అప్డేట్స్‌ను అందించింది. అయితే, కత్రినా ఏకంగా మెటా అధినేత జూకర్ బర్గ్‌నే అధిగమించేసింది. ప్రస్తుతం జూకర్‌కు 9.2 మిలియన్ ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు.

అక్షయ్ కుమార్
కత్రినా కైఫ్ తర్వాత అక్షయ్ కుమార్‌ను ఎక్కువమంది యూజర్లు వాట్సాప్ ఛానెల్‌లో ఫాలో అవుతున్నారు. ఇప్పటికే తనను వాట్సాప్‌లో 7.7 మిలియన్ యూజర్లు ఫాలో అవుతున్నారు. ఇందులో తన ఫ్యాన్స్‌కు సినిమాల గురించి మాత్రమే కాకుండా తన సామాజిక సేవా కార్యక్రమాల గురించి, ఫిట్‌నెస్ టిప్స్ గురించి షేర్ చేసుకుంటూ ఉంటాడు అక్షయ్.

దిల్‌జిత్ దోసాంజ్
ఎంతోమంది హాలీవుడ్ సెలబ్రిటీలను సైతం దాటేసి వాట్సాప్‌లో తన ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు పంజాబీ, బాలీవుడ్ సింగర్ దిల్‌జిత్ దోసాంజ్. ఇప్పటికే దిల్‌జిత్ వాట్సాప్ ఛానెల్‌కు 5 మిలియన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సింగర్ ఎక్కువగా తన డైలీ రొటీన్‌ను వాట్సాప్ ఛానెల్స్‌లో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతాడు.

సన్నీ లియోన్
ఒకప్పుడు పార్న్ స్టార్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసి, ఆ తర్వాత బాలీవుడ్‌లో నటిగా మారింది సన్నీ లియోన్. ఇప్పుడు ఎక్కువగా తన సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు తన వాట్సాప్ ఛానెల్‌కు ఉన్న 4.4 మంది ఫాలోవర్స్‌కు కూడా ఎక్కువగా తన ఫ్యామిలీ లైఫ్ గురించే షేర్ చేసుకుంటోంది.

మోనాలిసా
మోనాలిసా ఒక భోజ్‌పూరీ నటి. తనకు వాట్సాప్ ఛానెల్‌కు 2.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తను.. తన ఆన్ స్క్రీన్ అనుభవాల గురించి, ఫ్యాషన్ టిప్స్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి తన ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

మోహన్‌లాల్
మలయాళం సినిమాలో లెజెండ్‌గా ఎదిగిన మోహన్‌లాల్ కూడా తమ వాట్సాప్‌ను అప్డేట్ చేసుకున్నారు. వాట్సాప్ ఛానెల్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటికే 1.2 మిలియన్ మంది మోహన్‌లాల్ వాట్సాప్ ఛానెల్‌ను ఫాలో అవుతున్నారు. ఆయన ఎక్కువగా తన సినిమా విశేషాలను ఫాలోవర్స్‌తో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు.

విజయ్ దేవరకొండ
వాట్సాప్ ఛానెల్‌లో ఫాలోయింగ్ పెంచుకుంటున్న వారిలో టాప్ 9లో ఉన్న ఒకేఒక్క తెలుగు సెలబ్రిటీ విజయ్ దేవరకొండ. తెలుగు సినిమాలో రౌడీ హీరోగా యూత్ మనసు దోచుకున్న విజయ్.. అతి తక్కువ సమయంలోనే వాట్సాప్ ఛానెల్‌లో 1.2 మిలియన్ ఫాలోవర్స్‌ను సాధించుకున్నారు. ఈ విషయంలో టాలీవుడ్ సెలబ్రిటీల కంటే టాప్‌లో ఉన్నాడు వీడి.

నేహా కక్కర్
బాలీవుడ్‌లో సింగర్ నేహా కక్కర్ వాయిస్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ప్లేబ్యాక్ సింగర్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న నేహా.. వాట్సాప్ ఛానెల్‌లో ఇప్పటికే 1.1 మిలియన్ మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది.

మమ్ముట్టి
మోహన్‌లాల్ తర్వాత మమ్ముట్టి కూడా వాట్సాప్ ఛానెల్‌లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న టాప్ 9 సెలబ్రిటీల లిస్ట్‌లో నిలిచాడు. ప్రస్తుతం మమ్ముట్టి వాట్సాప్ ఛానెల్‌కు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

Also Read: అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
Stock Market: కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget