News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అప్పట్లో రెమ్యునరేషన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, కమలహాసన్, శ్రీదేవి లాంటి యాక్టర్స్ కి కూడా తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారని అన్నారు.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో సినిమాకు రూ.30 నుంచి రూ.40 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ అందుకుంటూ యంగ్ హీరోలకు షాక్ ఇస్తున్నాడు. ఈమధ్య రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటాలు కూడా తీసుకుంటున్నాడు. అలా ప్రస్తుతం కోట్లలో పారితోషకం తీసుకుంటున్న చిరంజీవి రెమ్యునరేషన్ ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేదట. ఇదే విషయాన్ని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇప్పుడు హీరోలకు ఇచ్చేంత రెమ్యునరేషన్ ఒకప్పుడు ఉండేవి కావని, వాటాలు కూడా లేవని వేలల్లో మాత్రమే రెమ్యూనరేషన్ ఇచ్చే వారిని ఈ సందర్భంగా పేర్కొన్నారు వీరేంద్రనాథ్. "నేను రచయితగా పనిచేస్తున్నప్పుడు ఒక సమయంలో ఒకే డైరెక్టర్ తో మాత్రమే పని చేశాను. అలా కోదండరామిరెడ్డి గారితో ఒకే సమయంలో 8కి పైగా సినిమాలు చేశాను. అప్పట్లో రెమ్యునరేషన్స్ మాత్రమే ఇచ్చేవారు. సినిమాకి వాటాలు తీసుకునే అవకాశం లేదు. నాకు అభిలాష సినిమాకు రూ.20,000 ఇస్తే 'స్టువర్టుపురం పోలీస్ స్టేషన్' సినిమాకు డైలాగ్, స్క్రిప్ట్, స్టోరీ, డైరెక్షన్ కలిపి రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చారు. అప్పట్లో రెమ్యూనరేషన్స్ పెద్ద మొత్తంలో ఉండేవి కాదు. కమల్ హాసన్, శ్రీదేవి లాంటి యాక్టర్స్  కి అప్పట్లో రెండు లక్షలు ఇచ్చారు. అంతకంటే ఎక్కువ ఇచ్చేవారు కాదు. అలాగే నా సినీ కెరియర్లో నేను ఎంతో మంది డైరెక్టర్స్ తో ప్రొడ్యూసర్స్ తో జర్నీ చేశాను. నా జర్నీలో సినిమాల్లో పార్ట్నర్ షిప్స్, ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న వాళ్ళు అయితే ఎవరూ లేరు" అని అన్నారు.

ఎన్నో వ్యక్తిత్వ వికాసాలను బోధించిన మీరు జీవితంలో నేర్చుకున్న నీతి ఏంటని? రిపోర్టర్ అడిగితే దానికి బదులిస్తూ.. "ఒకటి నవ్వుతూ ఉండాలి. నా వాళ్ళు బాగుండాలి, నేనే బాగుండాలనే తాపత్రయం ఉండకూడదు. రెండోది మనం కంఫర్టబుల్‌గా బతకడానికి వీలైనంత డబ్బు ఉండాలి. నేను వ్యక్తిత్వ వికాస పాటలు బోధించడం వల్ల కోపం పూర్తిగా తగ్గిపోయింది. నేను కోప్పడి దాదాపు 15 ఏళ్ల అవుతుంది. ఓసారి సింగపూర్లో నా కొడుకు, కోడలు నుంచి తప్పిపోయాను. నా దగ్గర పాస్ పోర్ట్ లేదు. ఫోన్ కూడా పనిచేయడం లేదు. అప్పుడు ఓ తెలుగు వ్యక్తిని సహాయం అడిగాను" అని తెలిపారు.

"అప్పుడు అతను డబ్బులు ఏమైనా కావాలా అని అడిగాడు. డబ్బులు అక్కర్లేదు, నీ ఫోన్ కావాలని అడిగాను. అప్పుడు ఫోన్ ఇవ్వగానే నేను ఎవరో తెలుసా? అని అడిగాను. అతను ఎవరు సార్ మీరు? అని చెప్పాడు. నిజంగా అతనికి నేనెవరో తెలియదు. ఆ తర్వాత ఫోన్ తీసుకుని డైరెక్టర్ పట్టాభికి చేశాను. ఆయన నెంబర్ మాత్రమే నాకు గుర్తు. అలా మా ఇంటికి ఫోన్ చేయమని ఆ తర్వాత మా వైఫ్ ఫోన్ చేస్తే మన అబ్బాయి నా దగ్గరలోనే ఉన్నాడు. నేను తప్పిపోయాను. ఈ నెంబర్ కి ఫోన్ చేయమని చెప్పు అని చెప్పగానే మా అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. అలా మళ్లీ మా అబ్బాయిని కలుసుకున్నాను. ఇలా జరిగినప్పుడు టెన్షన్ పడకుండా ఉండటం, కోపం తగ్గడం, నవ్వుతూ ఉండడం దీన్ని క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు" అంటూ చెప్పుకొచ్చారు యండమూరి వీరేంద్రనాథ్.

Also Read : మరో మూవీ నుంచి శ్రీలీలా ఔట్? ప్రభాస్ సినిమాలో హీరోయిన్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 27 Sep 2023 08:28 PM (IST) Tags: Sridevi Yandamuri Veerendranath kamalhasan Chiranjeevi Writer Yandamuri Veerendranath

ఇవి కూడా చూడండి

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

Namo Movie: నమో - నరేంద్ర మోడీ కాదండోయ్, సర్వైవల్ కామెడీ సినిమా!

Namo Movie: నమో - నరేంద్ర మోడీ కాదండోయ్, సర్వైవల్ కామెడీ సినిమా!

Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!

Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!

‘మంగళవారం’ ఓటీటీ స్ట్రీమింగ్, ‘బ్రహ్మాస్త్ర 2’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘మంగళవారం’ ఓటీటీ స్ట్రీమింగ్, ‘బ్రహ్మాస్త్ర 2’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Brahmanandam: ‘యానిమల్’లో కొడుకు పాత్రలో బ్రహ్మానందం, తండ్రి ఎవరో తెలుసా? ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

Brahmanandam: ‘యానిమల్’లో కొడుకు పాత్రలో బ్రహ్మానందం, తండ్రి ఎవరో తెలుసా? ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

టాప్ స్టోరీస్

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే