By: ABP Desam | Updated at : 27 Sep 2023 05:55 PM (IST)
Photo Credit : Prabhas/Instagram
టాలీవుడ్ లో ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలతో క్షణం తీరకలేకుండా బిజీబిజీగా గడుపుతున్న యంగ్ బ్యూటీ శ్రీలీల. ఆమె పాన్ ఇండియా హీరో ప్రభాస్‌కు జోడిగా నటిస్తోందంటూ గత మూడు రోజులుగా ఫిల్మ్ సర్కిల్ తో పాటు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. హను రాఘవపూడి ప్రభాస్‌తో తీయబోయే పీరియాడికల్ లవ్ స్టోరీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోందని, వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్తుందని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ న్యూస్ లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని హను రాఘవపుడిని అడిగితే అలాంటిది ఏమీ లేదని చెప్పాడు.
అంతేకాకుండా ప్రభాస్‌తో తాను చేస్తున్న ప్రాజెక్టు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మంగళవారం సాయంత్రం హైదరాబాదులో జరిగిన ఓ వెబ్ సిరీస్ ఈవెంట్ లో భాగంగా కొంతమంది మీడియా ప్రతినిధులతో ఇంటరాక్ట్ అయిన హను రాఘవపూడి ప్రభాస్ తో సినిమా విషయమై మాట్లాడుతూ.. "ప్రస్తుతం ప్రభాస్ మారుతి సినిమాతో పాటు మిగతా కమిట్మెంట్స్ అన్నింటినీ పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత సందీప్ వంగాతో ‘స్పిరిట్’, నా సినిమా ఒకేసారి ప్రారంభం కావచ్చు. బహుశా వచ్చే ఏడాది చివరి నాటికి అది జరగొచ్చు. ఆ తర్వాతే ఈ ప్రాజెక్టుకు సంబంధించి క్యాస్టింగ్ పై దృష్టి పెడతాం. ప్రభాస్ సినిమాకు సంబంధించి ఇంకా నటీనటులను ఎంపిక చేయలేదు." అని హను రాఘవపూడి చెప్పారు.
ఆయన చెప్పిన దాని ప్రకారం ప్రభాస్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోందనే వార్త పూర్తిగా అవాస్తవమని తేలింది. మరోవైపు ప్రభాస్ కి జోడిగా శ్రీలీల నటిస్తుందనే విషయం ఒక్కసారిగా బయటికి రావడంతో ఈ వార్త విని డార్లింగ్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఎందుకంటే ప్రభాస్ పక్కన శ్రీలీల సెట్ అవ్వదని, వాళ్ళ కెమిస్ట్రీ ఏ మాత్రం బాగోదని ఫ్యాన్స్ అభిప్రాయం. మరి హను రాఘవపూడి ప్రభాస్‌కు జోడిగా ఏ హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తాడో చూడాలి. గత ఏడాది హను రాఘవపూడి 'సీతారామం' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది.
ప్రస్తుతం ప్రభాస్ కోసం వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ లవ్ స్టోరీని సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. ఓ వైపు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా మరోవైపు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్టు తెలుస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సలార్' విడుదలకు ముస్తాబవుతోంది. సెప్టెంబర్ 28న రిలీజ్ అవ్వాల్సిన ఈ చిత్రం వీఎఫెక్స్ కారణంగా వాయిదా పడింది. డిసెంబర్ 22 క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే మూవీ టీమ్ నుంచి రిలీజ్ డేట్ పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read : మామా అల్లుళ్ళ రివేంజ్ డ్రామా - ట్రిపుల్ రోల్స్‌లో అదరగొట్టిన సుధీర్ బాబు, 'మామా మశ్చీంద్ర' ట్రైలర్ చూశారా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్, ‘సలార్’ సెన్సార్ పూర్తి - నేటి టాప్ సినీ విశేషాలివే!
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
Jamal Kudu Song: బాబీడియోల్ ‘జమల్ కుడు’ సాంగ్‌కు యమ క్రేజ్ - ‘యానిమల్’లోని ఈ పాట ఏ దేశానికి చెందినదో తెలుసా?
Happy Birthday Nabha Natesh: నభా నటేష్ బర్త్ డే: అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!
Hi Nanna : హాయ్ నాన్న - అక్కడ మహేష్ తర్వాత నానిదే పైచేయి!
TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం
Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !
YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు
AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?
/body>