By: ABP Desam | Updated at : 08 Apr 2022 05:19 PM (IST)
బిగ్ బాస్ ట్విస్ట్ - ఈ వారం డబుల్ ఎలిమినేషన్?
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఆరోవారం నామినేషన్స్ లో ఉన్నవారికి బిగ్ బాస్ షాకివ్వబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని అంటున్నారు. ఎందుకంటే గతవారం అనూహ్యంగా ముమైత్ ఖాన్ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. నిజానికి ముమైత్ మొదటివారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఆ తరువాత ఐదోవారంలో హౌస్ లోకి మళ్లీ వచ్చింది. అయితే ఇప్పుడు ముమైత్ రాకతో కచ్చితంగా ఏదొక వారం డబుల్ ఎలిమినేషన్ చేయడం ఖాయం.
అది ఈ వారమే ఉండొచ్చని అంచనాలు వేస్తున్నారు. ఓటింగ్ ప్రకారం.. బిందు మాధవి టాప్ ప్లేస్ లో, యాంకర్ శివ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఆ తరువాతి స్థానాల్లో మహేష్ విట్టా, హమీద, అషురెడ్డి ఉన్నారు. ఇక మిగిలిన వాళ్లు డేంజర్ జోన్ లో ఉన్నారు. అజయ్, మిత్రా శర్మా , ముమైత్ ఖాన్, స్రవంతిలకు తక్కువ ఓట్లు పోల్ అయినట్లు తెలుస్తోంది.
ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఈ నలుగురిలో ఇద్దరు ఇంటికివెళ్లిపోయే ఛాన్స్ ఉంది. మేల్ అండ్ ఫిమేల్ ని పంపించాలనుకుంటే స్రవంతి, అజయ్ లు బయటకు వెళ్లిపోవచ్చు. మిత్రాశర్మను మొదటినుంచి బిగ్ బాస్ సేవ్ చేస్తున్నారు కాబట్టి ఆమె ఈ వారం కూడా సేవ్ అవుతుందని భావిస్తున్నారు. అజయ్, స్రవంతి కాకుండా.. ముమైత్, స్రవంతిని బయటకు పంపించేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ తో ట్విస్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పటివరకు అయితే అది జరగలేదు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం.. ఒకరిని ఎన్నుకుంటారు. అదే జరిగితే కంటెస్టెంట్స్ అందరూ కలిసి మిత్రాశర్మ పేరు చెప్పడం ఖాయం. మరి బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!
Also Read: రణబీర్ కపూర్ పెళ్లిలో మాజీ గర్ల్ ఫ్రెండ్స్ హడావిడి?
"Nenu Love Cheyyanu! Pelli Cheskonu!"
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 8, 2022
Tholiprema icche kickee verappa! Housemates stories telusukondi tonight at 9 PM exclusively on @DisneyPlusHS #BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop @EndemolShineIND pic.twitter.com/gMIP86H6I2
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి
Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా
Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో - ఎవరికంటే?