Murugadoss: బాలీవుడ్ లో షారుఖ్, ఇక్కడేమో బన్నీ - మురుగదాస్ ప్లాన్ మాములుగా లేదు
మురుగదాస్ బాలీవుడ్ లో చేస్తే ఆ సినిమా షారుఖ్ తోనే ఉంటుందని తెలుస్తోంది. ఇక టాలీవుడ్ లో బన్నీతో.
సౌత్ ఇండియన్ దర్శకులపై షారుఖ్ ఖాన్ దృష్టి పడింది. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు మరో సౌత్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట ఈ స్టార్ హీరో. గత కొంతకాలంగా బాలీవుడ్ లో ఓ సినిమా చేయాలని తిరుగుతున్నారు దర్శకుడు మురుగదాస్. సల్మాన్ ఖాన్ ని కలిసి ఓ కథ చెప్పారు. కానీ ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు.
ఇప్పుడు షారుఖ్ ఖాన్ దగ్గరకు వెళ్లగా.. ఆయనకు కథ నచ్చడంతో ఓకే చెప్పారట. అంతేకాదు.. షారుఖ్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ లోనే ఈ సినిమాను నిర్మించబోతున్నారని తెలుస్తోంది. అట్లీతో సినిమా పూర్తి కాగానే.. మురుగదాస్ సినిమాను పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. తెలుగులో కూడా ఓ సినిమా చేయడానికి మురుగదాస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
అల్లు అర్జున్ తో స్టోరీ సిట్టింగ్స్ జరిగాయి. బన్నీ కూడా మురుగదాస్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్. ఇదివరకు మురుగదాస్ తెలుగులో తీసిన 'స్పైడర్' సినిమా డిజాస్టర్ అయింది. ఈసారైనా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ప్రాజెక్ట్ తో వస్తారేమో చూడాలి. మురుగదాస్ బాలీవుడ్ లో చేస్తే ఆ సినిమా షారుఖ్ తోనే ఉంటుందని తెలుస్తోంది. ఇక టాలీవుడ్ లో బన్నీతో. ప్రస్తుతానికి ఈ రెండు ప్రాజెక్ట్ లు ఫిక్స్. కాకపోతే ఈ రెండింట్లో దేన్ని ముందుగా తెరకెక్కిస్తారో చూడాలి!
Also Read: 'శర్మాజీ నమ్‌కీన్' రివ్యూ: రిషి కపూర్ ఆఖరి సినిమా - వయసుతో పనేంటి?
Also Read: చిరంజీవితో సినిమా చేయలేదని ఇప్పటికీ బాధపడుతున్నా - ఉపేంద్ర
View this post on Instagram
View this post on Instagram