Bigg Boss Telugu Season 8: నేచర్ థీమ్‌తో రెడీ అయిన బిగ్‌బాస్ సెట్- లోపల ఎలా ఉందో చదివేయండి!
Bigg Boss Telugu: బిగ్ బాాస్ తెలుగు 8వ సీజన్ కు అంతా సెట్ అయ్యింది. లాంచింగ్‌కు అవసరమైన గ్రౌండ్ వర్క్.. చాలా గ్రాండియర్ గా పూర్తి చేసింది.. షో ప్రొడక్షన్ యూనిట్.
Bigg Boss: బిగ్ బాస్ (Bigg Boss 8) తెలుగు సీజన్ 8 (Bigg Boss Telugu season 8) సెట్ (Bigg Boss Telugu Set) రెడీ అయిపోయింది. లాంచింగ్ కు కేవలం రెండే రోజులు టైమ్ ఉండడంతో.. ప్రొడక్షన్ టీమ్ సూపర్ ఫాస్ట్ గా వర్క్ కంప్లీట్ చేసింది. కంటెస్టెంట్స్ సెట్ లోపలికి పెట్టే మొదటి అడుగు నుంచే.. అద్దిరిపోయే ఫీల్ కలిగించేలా సెట్ జిగేల్ మంటోంది. ఇన్ సైడ్ నుంచి అందుతున్న టాక్ ను బట్టి.. ఈ సారి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసం నేచర్ థీమ్ ను కూడా ఇంప్లిమెంట్ చేసినట్టు తెలుస్తోంది. అదేంటి.. ఆ ప్రత్యేకతలేంటి.. ఇంతకీ సెట్ ఎలా ఉంది.. అన్న డిటెయిల్స్ తెలుసుకుందాం.
గ్రాండ్ లుక్‌లో హౌస్
బిగ్ బాస్ సెట్ లోపలికి అలా మొదటి అడుగు పెట్టగానే.. ఎప్పటి మాదిరిగానే విశాలమైన లాన్ ఏరియా కంటెస్టెంట్లకు వెల్ కమ్ చెప్పనుంది. ఎంట్రీ నుంచి కుడివైపు చూడగానే.. సుమారు ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తు ఉన్న స్విమ్మింగ్ పూల్ ఆకట్టుకోనుంది. ఆ పక్కనే జైల్.. కంటెస్టెంట్లను పనిష్ చేసేందుకు రెడీ అయిపోయింది. ఎంట్రీ నుంచి ఎడమవైపు చూస్తే.. స్మోకింగ్ జోన్ తో పాటు.. సిటౌట్ ఏరియా కూడా కంటెస్టెంట్లకు యూజ్ అయ్యేలా సెట్ చేశారు. అలా లోపలికి వెళ్లగానే.. కళ్లు మిరుమిట్లుగొలిపేలా ఉన్న లైటింగ్.. దానికి తోడు ఎంట్రీ ఇవ్వగానే అట్రాక్ట్ చేసే పే..ద్ద హాల్.. ఎంట్రీ పక్కనే సరదాగా కూర్చునే ఏర్పాటు.. ఇలా ఎటు చూసినా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ అన్నీ చక్కగా అమర్చారు.
Also Read: ఈసారి బిగ్ బాస్ లో "రీ ఎంట్రీ" సెన్సేషన్.. ఎవరొస్తున్నారో తెలుసా?
ప్రస్తుతానికి 9 బెడ్స్ మాత్రమే..
బెడ్ రూమ్ ల విషయానికి వస్తే.. ఇప్పటివరకూ అందిన ఇన్ఫో ప్రకారం.. 3 డిఫరెంట్ రూమ్స్ రెడీ చేశారట. అందులో ఒకటి కెప్టెన్ యాక్సెస్.. లేదా వీఐపీ యాక్సెస్ అన్న కాన్సెప్ట్ ను బట్టి యూజ్ చేసే చాన్స్ ఉంది. అందులో 3 బెడ్స్ ఉంటాయట. మిగతా రెండు గదుల్లో కూడా 3 చొప్పున 6 బెడ్స్ ఏర్పాటు చేశారట. ఈ లెక్కన.. ఓవరాల్ గా 3 బెడ్ రూమ్ లు కలిపి ప్రస్తుతానికైతే 9 బెడ్స్ అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ.. లాంచింగ్ రోజు మొత్తంగా 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన.. హౌజ్ కెప్టెన్ ఎంపికయ్యేంతవరకూ.. ఈ బెడ్స్ ను ఎలా యూజ్ చేస్తారన్నది క్లారిటీ లేదు.
Also Read: షాకిస్తున్న బిగ్‌బాస్ 8 ఫైనల్ లిస్ట్! - హౌజ్‌లోకి ఊహించని కంటెస్టెంట్స్, ఈసారి వాళ్లు కూడా...
నేచర్‌ను ప్రతిబింబిచేలా సెట్
ఇక.. హాల్ లో ఎడమ వైపు కిచెన్ సెక్షన్ తో పాటు స్టోర్ రూమ్.. కుడి వైపు కన్ఫెషన్ రూమ్ ఏర్పాట్లు కూడా చేసేసిందట బిగ్ బాస్ టీమ్. వీటికి తోడు.. ఈ సారి హాల్ తో పాటు ప్రతి బెడ్ రూమ్ లో కూడా ఆకట్టుకునేలా ఆర్టిస్టిక్ ఏర్పాట్లు చేశారట. నేచర్ ను ప్రతిబింబించేలా.. పక్షుల బొమ్మలను సెట్టింగుల్లో భాగంగా అమర్చి.. మంచి ఫీల్ కలిగించేలా అరేంజ్ మెంట్స్ చేశారట. ఇలా.. సెట్ రూపకల్పనలో బిగ్ బాస్ ప్రొడక్షన్ టీమ్ తీసుకుంటున్న చర్యలు.. కంటెస్టెంట్లకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ను ఇవ్వడమే కాదు.. వ్యూవర్స్ కు కూడా కొత్త అనుభూతి అందించడం ఖాయమన్న కాన్ఫిడెన్స్.. ఇన్ సైడ్ నుంచి వ్యక్తమవుతోంది.
ఈసారి ఓ ప్రత్యేక రూమ్ ఒకటి డిజైన్ చేశారని కూడా తెలుస్తోంది. అంది దేని కోసం అందులో ఎవర్ని ఉంచుతారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అంటోంది బిగ్‌బాస్ టీం. గతంలో సీక్రెట్ రూమ్ ఒకటి ఉండేదని ఈసారి ఆ సీక్రెట్ రూమ్‌తోపాటు ఇది కూడా ఉంటుందని అంటున్నారు.
Also Read: అరియానా ఏమిటి అందాల ప్రదర్శన.. లేటెస్ట్ ఫోటోషూట్‌తో వచ్చేసిన హాట్ బ్యూటీ