Bigg Boss Telugu: ఈసారి బిగ్ బాస్ లో "రీ ఎంట్రీ" సెన్సేషన్.. ఎవరొస్తున్నారో తెలుసా?
Bigg Boss: బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ ను సరికొత్తగా ముందుకు తెచ్చేందుకు ప్రొడక్షన్ టీమ్ ప్లాన్ చేసింది. ఈ సీజన్ లో ఇన్ఫినిటీ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తామన్న మాట నిలబెట్టుకునేలా గేమ్ ప్లాన్ రూపొందించింది.
Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ (Bigg Boss 8) తెలుగు సీజన్ 8కు అంతా రెడీ అయ్యింది. సెట్ కన్‌స్ట్రక్షన్ పూర్తయ్యింది. క్రూ టీమ్ మెంబర్స్ అంతా ట్రయల్ రన్ చేసేస్తున్నారు. లాంచింగ్ ఎపిసోడ్ కు హోస్ట్ కింగ్ నాగార్జున (Bigg Boss Telugu Host Nagarjuna) కూడా రెడీ అయిపోతున్నారు. మరోవైపు.. గత కొన్ని రోజులుగా తమ కొత్త సీజన్ గురించి లీకులు ఇస్తున్న బిగ్ బాస్ ప్రొడక్షన్ టీమ్.. ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేస్తోంది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ అంటూ ఏదీ లేకుండానే.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది. దీనికి తోడు.. ఈసారి బజ్ మరింత పెంచేలా చక్కర్లు కొడుతున్న ఓ ఇంట్రెస్టింగ్ లీక్.. బిగ్ బాస్ సీజన్ ప్రారంభం కాకుండానే అంచనాలు పెంచేస్తోంది. ఇంతకీ ఆ లీక్ ఏంటి.. అందులో ఉన్న విషయం ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. మైండ్ బ్లాంక్ అయ్యే విషయం తెలిసింది.
నార్మల్ గా అయితే.. బిగ్ బాస్ తెలుగులో ఓటీటీ సీజన్ మినహాయిస్తే.. ఇప్పటివరకూ ఒకసారి హౌజ్ లోపల అడుగుపెట్టిన వాళ్లు.. మరో సీజన్ లో కంటెస్టెంట్ గా వచ్చిన సందర్భాలు లేవు. ఇప్పుడు ఆ సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రొడక్షన్ టీమ్ డిసైడ్ అయిందన్న టాక్.. బలంగా వినిపిస్తోంది. ఇదే విషయాన్ని కొందరు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు స్ట్రాంగ్ గా చెబుతున్నారు. అలాగే.. బిగ్ బాస్ ఇన్ సైడ్ నుంచి వినిపిస్తున్న గుసగుసలను బట్టి.. ఈ టాక్ నిజం కావచ్చన్న విషయం కూడా తెలుస్తోంది. ఇప్పటివరకూ బిగ్ బాస్ 7 సీజన్లలో కంటెస్టెంట్లుగా వచ్చి.. సీజన్ పై తమ ముద్ర వేసుకున్న వాళ్లలో నుంచి కొందరిని సెలెక్ట్ చేస్తారని.. వాళ్లను సీజన్ 8 లో హౌజ్ లోకి పంపించి ఓ రెండు మూడు వారాలు గేమ్ ఆడిస్తారని తెలుస్తోంది. ఇదే జరిగితే.. సీజన్ 8 గురించి ప్రచారం జరుగుతున్నట్టుగా.. అన్ లిమిటెడ్ ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ ఖాయమన్న అభిప్రాయం ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతోంది.
ఈ విషయం తెలుసుకున్న బిగ్ బాస్ తెలుగు హార్డ్ కోర్ ఫ్యాన్స్.. రకరకాలుగా అంచనాలు చేసేస్తున్నారు. విన్నర్లను కాకుండా.. గత సీజన్లలో రన్నర్లుగా నిలబడిన వాళ్లను పంపించే అవకాశం ఉందని.. అలాగే టైటిల్ రేసులో టఫ్ ఫైట్ ఇచ్చి.. చివరికి సడన్ గా గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన గత సీజన్ల కంటెస్టెంట్లను హౌజ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా పంపిస్తారని అనుకుంటున్నారు. ఇదే జరిగితే.. సీజన్ 7 లాగే.. సీజన్ 8 కూడా మాంచి రేటింగ్ దక్కించుకుంటుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే.. ఈ కాన్సెప్ట్ తెలుగు బిగ్ బాస్ కు కొత్త కావచ్చు. కానీ.. హిందీలో ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పుడో ఇంప్లిమెంట్ చేశారని.. అక్కడ మంచి రెస్పాన్స్ కూడా రావడానికి ఇలాంటి ఎత్తులు పని చేశాయని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ సారి తెలుగు కొత్త సీజన్ లో.. ఏ పాత కంటెస్టెంట్లు మెరవబోతున్నారు... వాళ్లతో సీజన్ కు ఎంత వరకు ప్లస్ అవుతుంది అన్నది.. ముందు ముందు తెలుస్తుంది.
Also Read: ‘బిగ్ బాస్’కు వెళ్తున్నారు అంట నిజమేనా? రాజ్ తరుణ రియాక్షన్ ఏంటో చూడండి