Hero Raj Tarun: ‘బిగ్ బాస్’కు వెళ్తున్నారు అంట నిజమేనా? రాజ్ తరుణ రియాక్షన్ ఏంటో చూడండి
Raj Tarun: ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 మొదలుకాబోతుంది. దీంతో ఆ షోకి వాళ్లు వెళ్తారు. వీళ్లు వెళ్తారు అని ప్రచారం జరుగుతుంది. అలా హీరో రాజ్ తరుణ్ వెళ్తాడనే ప్రచారంపై ఆయన స్పందించారు. ఏమన్నారంటే?
Hero Raj Tarun About His Big Boss Entry And His Next Movie: హీరో రాజ్ తరుణ్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. చాలా కాంట్రవర్సీ నడిచింది ఆయన విషయంలో. దీంతో రాజ్ తరుణ్ బిగ్ బాస్ 8కి వెళ్తున్నాడనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై స్పందించారు రాజ్ తరుణ్. 'భలే ఉన్నాడే' సినిమా ప్రస్ మీట్ లో క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఓటీటీల్లో సినిమాలు చూడటం గురించి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాజ్ తరుణ్. సినిమా బాగుంటే ప్రేక్షకులు వాళ్లంతట వాళ్లే సినిమాకి వస్తారని చెప్పారు ఆయన.
ఓటీటీలో రీలీజ్ చేస్తున్నారా?
"సినిమా పోస్టర్స్ చూస్తే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ఉంది" అని అడిగిన ప్రశ్నకి రాజ్ తరుణ్ ఇలా సమాధానం చెప్పారు. "ఏ సినిమా అయినా ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సిందే. నిజానికి ఇంట్లో ఒక్కలిద్దరి మధ్య సినిమా చూడటం వేరు. థియేటర్ లో 200, 300 మందితో సినిమా చూడటం వేరు. పెద్ద స్క్రీన్ మీద, లైట్లు అన్నీ ఆపేసి చూడటంలో ఉండే ఎక్స్ పీరియెన్స్ వేరు. ఒక్కడు సినిమా నాకు చాలా ఇష్టం. ఆ సినిమా చూసినప్పుడు చుట్టూ లైట్స్ అన్ని ఆపేసి సినిమా మొదలుపెట్టినప్పుడు నా చుట్టూ ఎవ్వరూ లేరు అనిపించింది. అలాంటి ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ సినిమాలో లీనమైపోయాను. అప్పటి నుంచి సినిమాలు తెగ చూడటం మొదలుపెట్టాను. కాబట్టి కనెక్టివ్ ఎక్స్ పీరియెన్స్ అనేది చాలా ముఖ్యం. ఆ ఎక్స పీరియెన్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. థియేటర్ లో సినిమా చూస్తే వచ్చే ఎఫెక్ట్ ఇంట్లో చూస్తే కచ్చితంగా రాదు" అని అన్నారు.
సినిమా బాగుంటే కచ్చితంగా చూస్తారు..
"సెప్టెంబర్ 2న పవన్ కల్యాన్ పుట్టిన రోజు, ఇంకా చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అదే టైంలో మీ సినిమా రిలీజ్ చేస్తే చూస్తారా?" అని అడిగిన ప్రశ్నకి రాజ్ తరుణ్ ఏమన్నారంటే? "ఒకటి చెప్తాను. సంక్రాంతి పండుగకి చాలా సినిమాలు వస్తాయి. సినిమా బాగుంటే కచ్చితంగా థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తారు. సినిమాని నేను ప్రేమిస్తాను అని చెప్పను. సినిమా నాకు ప్రాణం. ప్రతి సినిమా బాగుండాలని ఆశిస్తాను. అప్పుడే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. అందరికీ ఉపాధి కూడా వస్తుంది" అని తెలిపారు.
బిగ్ బాస్ కి వెళ్తున్నారా?
"నేను గ్లాసోఫోబిక్ అండి నేను అస్సలు బిగ్ బాస్ వెళ్లను. వెళ్లే ఛాన్సే లేదు" అని అన్నారు రాజ్ తరుణ్. "ఆయన్ని ఒక దగ్గర ఒక గంట కూర్చోబెడితేనే కుర్చోలేరు అండి. అలాంటిది బిగ్ బాస్ కా? అని డైరెక్టర్ అన్నారు. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అలాంటివాడు అతను" అని అన్నారు.
రాజ్ తరుణ్ హీరోగా ‘భలే ఉన్నాడే’ అనే పేరుతో తెరకెక్కిన సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతోంది. మనీషా హీరోయిన్ గా నటించింది ఈ సినిమాలో. జె.శివసాయి వర్ధన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్రబృందం పాల్గొంది. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ ఈ సినిమా ప్రమోషన్స్ లో బాగా పాల్గొంటానని, అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి అంటూ చెప్పుకొచ్చారు.
Also Read: లావణ్య వ్యవహారంపై రాజ్ తరుణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్, అలా అనేశాడేంటీ?