అన్వేషించండి

Raj Tarun: లావణ్య వ్యవహారంపై రాజ్ తరుణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్, అలా అనేశాడేంటీ?

రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'భలే ఉన్నాడే'. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్ లో భాగంగా నిర్వహించి ప్రెస్ మీట్ లో రాజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Raj Tarun About Lavanya Issue: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గత నెలలో ఆయన హీరోగా నటించిన రెండు సినిమాలు విడుదల కాగా, త్వరలో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘భలే ఉన్నాడే’ అనే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న విడుదల కాబోతోంది. మనీషా హీరోయిన్ గా నటించింది. జె.శివసాయి వర్ధన్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్రబృందం పాల్గొన్నది. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.    

లావణ్య కాంట్రవర్సీ ప్రమోషన్ లో భాగమా?  

ఇటీవల రాజ్ తరుణ్ పై లావణ్య అనే అమ్మాయి సంచలన ఆరోపణలు చేసింది. చాలా కాలంగా కలిసి ఉంటున్నామని, ఓ హీరోయిన్ కు దగ్గరై తనను దూరం పెడుతున్నాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇద్దరి వ్యవహారం పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లింది. కొద్ది రోజులు హాట్ టాపిక్ గా మారింది. తాజా ప్రెస్ మీట్ లో రాజ్ తరణ్ ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించాడు. ఈ నేపథ్యంలో లావణ్య వివాదం నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్లు ఉన్నారుగా? అని మీడియా అడిగిన ప్రశ్నలకు కూల్ గా సమాధానం చెప్పారు. అదే సమయంలో ప్రమోషన్ కోసమే లావణ్యతో కాంట్రవర్సీ క్రియేట్ చేశారనే ప్రచారం జరుగుతుందనే ప్రశ్నకు కూడా రిప్లై ఇచ్చాడు. “ప్రమోషన్ కోసం లావణ్య కాంట్రవర్సీని తీసుకురాలేదు. ఎవరైనా అలాంటి విషయాలను ప్రమోషన్ కోసం వాడుకుంటారా? ప్రస్తుతం చాలా బాగున్నాను. మళ్లీ నన్ను కాంట్రవర్సీలోకి లాగొద్దు. ఈ గొడవ కారణంగా గత రెండు సినిమాలకు సరిగా ప్రమోషన్ చేయలేదు. ఈ సినిమా అయినా బాగా ప్రమోషన్ చేయాలి అనుకుంటున్నాను. నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఆ వివాదం ఆగడానికి నేనేం చేయలేదు” అన్నాడు రాజ్ తరుణ్.  

దాని గురించి నేను చెప్పను సిస్టర్!

గత కొంతకాలంగా రాజ్ తరుణ్ పెళ్లిళ్ల గురించి జోరుగా చర్చ జరుగుతుందని, ఇంతకీ పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు? అనే ప్రశ్నకు రాజ్ తరుణ్ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. “దాని గురించి చెప్పను సిస్టర్” అన్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.   

ఈ సినిమా అయినా హిట్ కొట్టేనా?

రాజ్ తరుణ్ గత కొంత కాలంగా లావణ్యతో వివాదాన్ని ఎదుర్కొంటూనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. గత నెలలో ‘పురుషోత్తముడు’, ‘తిరగబడరా సామీ’ అనే సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అయితే, ఈ రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఇప్పుడు ‘భలే ఉన్నాడే’ అనే సినిమాతో థియేటర్లలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ సినిమా కోసం గట్టిగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.  

Read Also: అరియానా కూడా ఏదో ఒక రోజు బయటికి వస్తుంది - రాజ్ తరుణ్, లావణ్య కేసుపై ఆర్జే శేఖర్ భాషా కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget