అన్వేషించండి

Rj Shekar Basha: అరియానా కూడా ఏదో ఒక రోజు బయటికి వస్తుంది - రాజ్ తరుణ్, లావణ్య కేసుపై ఆర్జే శేఖర్ భాషా కామెంట్స్

Rj Shekar Basha: రాజ్ తరుణ్, లావణ్య కేసులో ఆర్జే శేఖర్ భాషా ఎంటర్ అయినప్పటి నుండి ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్.. అరియానాపై లావణ్య చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశాడు

Rj Shekar Basha: టాలీవుడ్‌లోని మంచి గుర్తింపు సాధించిన యంగ్ హీరోల్లో రాజ్ తరుణ్ కూడా ఒకడు. కానీ గత కొన్నిరోజులుగా రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. లావణ్య అనే అమ్మాయి.. రాజ్ తరుణ్‌ను ప్రేమించి మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. మధ్యలో ఆర్జే శేఖర్ భాషా రావడంతో ఈ కేసు.. రాజ్ తరుణ్‌కు ఫేవర్‌గా తిరిగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ భాషా.. లావణ్య గురించి, రాజ్ తరుణ్ - అరియానా రిలేషన్ గురించి మాట్లాడాడు.

బాధగా అనిపించింది..

రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య ఆరోపించినప్పుడే పలువురు నటీమణులతో రాజ్ తరుణ్‌కు అఫైర్ ఉందని కూడా ఆరోపణలు చేసింది. మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్‌తో పాటు బిగ్ బాస్ ఫేమ్ అరియానాతో రాజ్ తరుణ్ సన్నిహితంగా ఉండేవాడని తెలిపింది. దీంతో ఆర్జే శేఖర్ భాషా రంగంలోకి దిగాడు. లావణ్య ఎలాంటి అమ్మాయి అని ఆధారాలతో సహా బయటపెట్టాడు. దీంతో లావణ్య చేసినవన్నీ తప్పుడు ఆరోపణలు అని కోర్టు తేల్చేసింది. ఇక రాజ్ తరుణ్, అరియానా ఫ్రెండ్‌షిప్‌పై ఆర్జే శేఖర్ భాషా తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు. అరియానా గురించి లావణ్య తప్పుగా మాట్లాడడం చాలా బాధ కలిగించిందని తెలిపాడు. 

అలాంటి అమ్మాయి కాదు..

‘‘రాజ్ తరుణ్ కేసులో నేను జోక్యం చేసుకున్నందుకు నన్ను తిట్టినా పర్వాలేదు. ఈ క్రమంలో వీళ్లు చాలామంది అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడారు. అయినా ఇంకా అరియానా ఎందుకు స్పందించలేదంటే.. అందరూ రోడ్డున పడి అయ్యో అనుకోరు. కానీ కచ్చితంగా ఏదో ఒకరోజు తను కూడా బయటికి వస్తుంది. పరువునష్టం దావా వేస్తారు. డిపార్ట్‌మెంట్‌లో ఒక సపోర్ట్ ఉంటే ఎలా ఉంటుంది, సెక్షన్లు ఎలా వాడుకోవాలి అని లావణ్యకు బాగా తెలుసు. కానీ అరియానాకు ఇదంతా అలవాటు లేదు. కేసులు పెట్టడం, సెటిల్‌మెంట్ చేసుకోవడం ఆ అమ్మాయికి ఇంకా తెలియదు. అరియానా ముందుకు వచ్చి కేసుపెడితే అంతా దద్దరిల్లిపోతుంది’’ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు శేఖర్ భాషా.

అలా పరిచయం..

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్‌లో ఒకసారి అరియానాను కలిశాను అని తనతో పరిచయం గురించి గుర్తుచేసుకున్నాడు శేఖర్ భాషా. ‘‘అరియానా చాలా మంచి అమ్మాయి. బూతులు మాట్లాడి రోడ్డున పడే అమ్మాయి కాదు. మన ఇళ్లల్లో అమ్మయిలు ఎంత డీసెంట్‌గా ఉంటారో అలాగే ఉంటుంది. ఇదంతా జరిగిన తర్వాత ఒకసారి ఫోన్ చేసి లావు అయితే ప్రెగ్నెన్సీ అంటున్నారు అని బాధపడింది.లావణ్య దగ్గర ఏ ఆధారం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. మాట్లాడడం కూడా పెద్ద విషయం కాదు.. కానీ ఇది ప్రసారం చేస్తే ఒక అమ్మాయికి భారీగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా మీడియా ఎలా వేస్తారు’’ అని మీడియాపై అసహనం వ్యక్తం చేశాడు శేఖర్ భాషా.

Also Read: వేణు స్వామికి అండగా ఆయన భార్య వీణశ్రీవాణి - మీడియా, జర్నలిస్ట్‌లపై ఫైర్‌.. వీడియో వైరల్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fake News on Minister Birthday : శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ - లోకేష్ వార్నింగ్ - ఏం జరిగిందంటే ?
శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ - లోకేష్ వార్నింగ్ - ఏం జరిగిందంటే ?
Viral News: దొంగకు దేహశుద్ధి చేసి పులిహోర తినిపించారు - నల్గొండ జిల్లాలో ఘటన, వైరల్ దృశ్యాలు
దొంగకు దేహశుద్ధి చేసి పులిహోర తినిపించారు - నల్గొండ జిల్లాలో ఘటన, వైరల్ దృశ్యాలు
What is Kejriwal strategy : రాజీనామాతో కేజ్రీవాల్ మరోసారి తప్పిదం చేస్తున్నారా ? రాజకీంగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారా ?
రాజీనామాతో కేజ్రీవాల్ మరోసారి తప్పిదం చేస్తున్నారా ? రాజకీంగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారా ?
Devara: దేవర మేనియా - అక్కడ భారీగా మిడ్‌నైట్ బెనిఫిట్‌ షోలకు ప్లాన్‌, టికెట్‌ రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే!
దేవర మేనియా - అక్కడ భారీగా మిడ్‌నైట్ బెనిఫిట్‌ షోలకు ప్లాన్‌, టికెట్‌ రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake News on Minister Birthday : శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ - లోకేష్ వార్నింగ్ - ఏం జరిగిందంటే ?
శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ - లోకేష్ వార్నింగ్ - ఏం జరిగిందంటే ?
Viral News: దొంగకు దేహశుద్ధి చేసి పులిహోర తినిపించారు - నల్గొండ జిల్లాలో ఘటన, వైరల్ దృశ్యాలు
దొంగకు దేహశుద్ధి చేసి పులిహోర తినిపించారు - నల్గొండ జిల్లాలో ఘటన, వైరల్ దృశ్యాలు
What is Kejriwal strategy : రాజీనామాతో కేజ్రీవాల్ మరోసారి తప్పిదం చేస్తున్నారా ? రాజకీంగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారా ?
రాజీనామాతో కేజ్రీవాల్ మరోసారి తప్పిదం చేస్తున్నారా ? రాజకీంగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారా ?
Devara: దేవర మేనియా - అక్కడ భారీగా మిడ్‌నైట్ బెనిఫిట్‌ షోలకు ప్లాన్‌, టికెట్‌ రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే!
దేవర మేనియా - అక్కడ భారీగా మిడ్‌నైట్ బెనిఫిట్‌ షోలకు ప్లాన్‌, టికెట్‌ రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే!
Telugu News: మేకపాటి విరాళానికి రాజకీయం అడ్డంకి- చంద్రబాబుకు స్పీడ్ పోస్టు- తెలంగాణలో మాత్రం నేరుగా అందజేత!
మేకపాటి విరాళానికి రాజకీయం అడ్డంకి- చంద్రబాబుకు స్పీడ్ పోస్టు- తెలంగాణలో మాత్రం నేరుగా అందజేత!
Ganesh Immersion Live Updates: ముగిసిన ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర
ముగిసిన ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర
Hansika Motwani: 'దేశముదురు'  సన్యాసినిని పోల్చుకున్నారా... బక్కచిక్కినా చక్కగున్న ఆపిల్ బ్యూటీ హన్సిక!
'దేశముదురు' సన్యాసినిని పోల్చుకున్నారా... బక్కచిక్కినా చక్కగున్న ఆపిల్ బ్యూటీ హన్సిక!
Swachhata Hi Seva 2024: తెలుగు రాష్ట్రాల్లో 'స్వచ్ఛతా హీ సేవ' కార్యక్రమం - స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా ప్రణాళిక
తెలుగు రాష్ట్రాల్లో 'స్వచ్ఛతా హీ సేవ' కార్యక్రమం - స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా ప్రణాళిక
Embed widget