Bigg Boss 7 Telugu: 'బిగ్ బాస్ 7' ప్రోమో వచ్చేసింది - నాగార్జున స్థానంలో ఆ హీరో? కంటెస్టెంట్లు వీరే!
తెలుగు బుల్లితెర స్టార్ మా లో ప్రసారమయ్యే 'బిగ్ బాస్' రియాలిటీ షో విజయవంతంగా ఆరు సీజన్లను పూర్తి చేసుకోగా.. తాజాగా ఏడవ సీజన్ కి సంబంధించిన ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు.
బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన 'బిగ్ బాస్ సీజన్ 7' త్వరలోనే మొదలు కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ అదిరిపోయే ప్రోమో విడుదల చేశారు. బుల్లితెరపై ‘బిగ్ బాస్’ రియాలిటీ షోకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ‘బిగ్ బాస్’ ఇప్పుడు ఏడవ సీజన్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. నిజానికి సీజన్ సెవెన్ ఎప్పుడో మొదలు కావలసి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయింది. దీంతో అసలు ఈ ఏడాది బిగ్ బాస్ ఉంటుందా? లేదా? అనే అనుమానాలు సైతం ప్రేక్షకుల్లో వ్యక్తం అయ్యాయి. ఇక ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ మేకర్స్ ప్రేక్షకులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు.
డైరెక్ట్ గా 'బిగ్ బాస్ 7' ప్రోమోని రిలీజ్ చేశారు. "BB7 తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, ఈసారి ఎమోషన్స్, సర్ప్రైజెస్ థ్రిల్లింగ్ మూమెంట్స్ తో కూడిన రోలర్ కోస్టర్ రైడ్ లో మిమ్మల్ని తీసుకెళ్తుంది. మీరు మరింత ఉత్సాహంగా ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. సరదా గొడవల నుంచి హృదయాన్ని కదిలించే కథల వరకు అడగడుగునా మిమ్మల్ని ఇస్తామని మేము హామీ ఇస్తున్నాము" అంటూ తెలుపుతూ స్టార్ మా ప్రోమో వీడియోలో పేర్కొంది. ఇక ఈ ప్రోమో వీడియోని సడన్ సర్ప్రైజ్ గా రిలీజ్ చేశారు మేకర్స్. దాంతో ఎటువంటి అప్డేట్ లేకుండా డైరెక్ట్ గా ప్రోమో విడుదల చేయడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
ఇక తాజాగా విడుదలైన ప్రోమోతో పాటు సీజన్ సెవెన్ కు సంబంధించి ఐకాన్ డిజైనింగ్ కూడా సరి కొత్తగా ఉండడంతో కచ్చితంగా ఈ సీజన్ అన్ని సీజన్లకు మించే విధంగా ఉంటుందని స్పష్టం అవుతుంది. అయితే హోస్ట్ విషయంలో ఇంకా సస్పెన్స్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈసారి నాగార్జున హోస్ట్ గా చేయడం లేదని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నాగార్జున స్థానంలో దగ్గుబాటి రానా ఈ షో హోస్ట్ చేయనున్నట్లు సమాచారం.
ఈసారి హౌస్ లో స్టార్ సెలబ్రిటీలు సందడి చేయబోతున్నారట. కేవలం ఎక్కువ ఫేమ్ ఉన్న సెలెబ్రెటీస్ ని మాత్రమే 'BB7' కి సెలెక్ట్ చేశారని అంటున్నారు. ఈసారి 'BB7' కోసం ఈటీవీ ప్రభాకర్, కార్తీకదీపం శోభా శెట్టి, బుల్లెట్ బండి సాంగ్ ఫేమ్ మోహన భోగరాజు, ఢీ పండు, సిద్ధార్థ వర్మ, అమర్ దీప్ తేజస్విని జంటతో పాటు సోషల్ మీడియాలో జనాలకి బాగా తెలిసిన సెలబ్రిటీల పేర్లని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇక త్వరలోనే 'BB7' పాల్గొనే హౌస్ మేట్స్ పేర్లను మేకర్స్ అధికారికంగా తెలియజేయునట్లు సమాచారం. కాగా ఆరవ సీజన్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో చాలా వరకు విఫలమైంది. బిగ్ బాస్ చరిత్రలోనే సీజన్ 6 కి అతి తక్కువ రేటింగ్స్ నమోదు అయ్యాయి. అందుకే ఈసారి సీజన్ 7 ని సరికొత్త కొత్త టాస్కులతో, పాపులర్ సెలబ్రిటీస్ తో ప్లాన్ చేస్తున్నారట నిర్వాహకులు. అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు చివరి వారంలో 'బిగ్ బాస్ సీజన్ 7' ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
#BiggBossTelugu7 - A Full Package of Entertainment ! Get ready to be hooked as BB7 Telugu takes you on a rollercoaster ride of emotions, surprises, and thrilling moments that will leave you wanting more. Coming Soon Only on @StarMaa & @DisneyPlusHSTel pic.twitter.com/ow2mnabHxJ
— Starmaa (@StarMaa) July 10, 2023
Also Read : 'బేబీ' బీజీఎం నన్ను ఏడిపించింది, ఈ మూవీకి అతడే మొదటి హీరో: డైరెక్టర్ సాయి రాజేశ్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial