Bigg Boss Telugu 9 Day 3 Promo 1 : బిగ్‌బాస్‌లో రెండోరోజూ కొనసాగిన నామినేషన్స్.. సంజనకు అలవాటైపోయింది, తనూజ ఏడ్చేసింది
Bigg Boss Telugu 9 Promo : దమ్ము శ్రీజ తన నామినేషన్స్‌లో భాగంగా తనూజ, సంజనను నామినేట్ చేసింది. ఈ క్రమంలో సంజన పొగరు చూపించగా.. తనూజ ఏడ్చేసింది. ప్రోమో హైలెట్స్ చూసేద్దాం.

Bigg Boss Telugu 9 Day 3 Sep 10 Promo 1 : బిగ్‌బాస్ సీజన్ 9 డే 3 ప్రోమోను రిలీజ్ చేశారు. నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియ ఈరోజు కూడా కొనసాగనుంది. ఈ క్రమంలో సంజనా అందరికీ టార్గెట్ అవ్వగా.. తర్వాత మిగిలిన వారికోసం ఓనర్స్ పాయింట్స్ వెతుక్కుంటున్నారు. సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేసిన మొదటి ప్రోమోలో.. దమ్ము శ్రీజ నామినేషన్స్ చూపించారు. దీనిలో ఆమె ఇద్దరును ఎంచుకోగా.. ఒకరు ఏమి పట్టనట్టు ఉన్నారు. మరొకరు ఏడ్చేశారు.
ప్రోమో ఎలా సాగిందంటే..
శ్రీజకు సుత్తి ఇచ్చేందుకు భరణి, ఇమ్మాన్యుయేల్ మధ్య పోటి జరిగింది. దీనిలో భరణి యాక్టివ్‌గా టాస్క్ ఫినిష్ చేసి శ్రీజకు సుత్తి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎక్కువ పే చేసి తీసుకున్న భరణి ఈ టాస్క్‌ల్లో వర్త్ అనిపించేలానే ఉన్నారు. భరణి తీసుకున్న సుత్తిని శ్రీజకు ఇవ్వగా.. ఆమె సంజన, తనూజను నామినేట్ చేసింది.
సంజనకు స్టాండ్ తీసుకోవడమే రాదట
సంజనా గారు.. ఏమండీ మీరు అలా పెట్టడం ప్రాబ్లమ్ అండి.. మాకొద్దు అన్నా కూడా.. లేదు నేను అలానే ఉంటా.. నా స్టాండ్ మీదనే ఉంటా అన్నారు. ఆ స్టాండ్ తీసుకోవడమే కరెక్ట్ కాదు అంటూ నామినేట్ చేసింది. కళ్యాణ్ మిమ్మల్ని అవి తీసేయమని చెప్పినా కూడా మీరు తీయను అంటూ సమాధానం ఇచ్చారంటూ నామినేట్ చేసింది.
తనూజ కమెంట్స్ చేస్తుందట
తనూజ గారు.. మీరు ఫస్ట్ డే వచ్చినప్పటి నుంచి కూడా కమెంట్లు వేయడం మొదలు పెట్టారు. ఈ కమెంట్సే ఇలా మొదటి రోజు నుంచి జరుగుతూనే ఉన్నాయి మీ దగ్గర నుంచి. మనిషిలా చూడట్లేదంటున్నారు అది రాంగ్ అని పవన్ కూడా వత్తాసు పలికాడు. చిరాకు పడుతూ పనులు చేస్తున్నారనిపించిందని తెలిపింది శ్రీజ.
ఒకరు వచ్చి ఒకసారి చెప్తారు. మరొకరు వచ్చి మరొటి చెప్తారు. మేము మనుషులమే అంటూ ఎమోషనల్ అయింది తనూజ. హరీశ్ ఏదో చెప్తుండగా తనూజ అడ్డుకుంటుంది. దీంతో హరీశ్ మీ బాడీ లాంగ్వేజ్, మాటలు కరెక్ట్‌గా లేవని అనడంతో తనూజ ట్రిగర్ అయి మీరు బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడొద్దు అంటూ ఏడ్చింది. తర్వాత సుమన్ శెట్టితో వాళ్లు నామినేట్ చేసినందుకు ఏడ్వలేదు. నా బిహేవియర్‌ని అన్నారు.. అది బయటకు ఎలా వెళ్తుంది? ఆడపిల్లని అలా అనొచ్చా అంటూ ఎమోషనల్ అయింది. దీంతో ప్రోమో ముగిసింది.






















