అన్వేషించండి

Bigg Boss season 8 episode 75: విష్ణు ప్రియ కూతురు లాంటిది - బాంబు పేల్చిన పృథ్వీ తల్లి... ప్రేరణ, అవినాష్ మధ్య గొడవ - గౌతమ్‌కి వార్నింగ్

బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. ఎపిసోడ్ 75 లో విష్ణు ప్రియ, పృథ్వీ, గౌతమ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఈ ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూసేద్దాం పదండి.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎపిసోడ్ 75లో ముందుగా విష్ణు ప్రియ ఫాదర్ ఇంట్లోకి అడుగు పెట్టారు. ఆయన హౌస్ మేట్స్ అందరితోనూ చాలా సరదాగా గడిపారు. అలాగే తను ఫ్యామిలీని వదిలేసి చాలాకాలంగా దూరంగా ఉన్నాను అని చెప్తూనే, తన ఫ్యామిలీకి అన్యాయం చేశానని ఆవేదన వ్యక్తం చేశారు.

విష్ణు ప్రియను సింగిల్ గా కూర్చోబెట్టి, తన ఆట తనను ఆడమని సలహా ఇచ్చారు తండ్రి. అయితే ఇలా మాట్లాడుతున్న క్రమంలో విష్ణు ప్రియ.. పృథ్వి గురించి మాట్లాడుతూ తనకు ఇక్కడ కలుగుతున్న ఫీలింగ్ నిజమే అయినప్పుడు, అది ఎందుకు దాచుకోవాలని తన తండ్రిని ప్రశ్నించింది. అంటే తాను జెన్యూన్ గా ఉన్నాను అంటూ తనకి సమాధానం చెప్పింది. 'అది ప్రేమ కాదు కానీ ఒక లాంటి ఫీలింగ్' అంటూ పృథ్వీపై మరోసారి తండ్రి ముందు తన ఇష్టాన్ని బయట పెట్టింది. ఇక ఆ తర్వాత విష్ణు ప్రియ తండ్రి దగ్గర పెళ్లి ప్రస్తావన రాగా, హౌస్ లో జరిగేవన్నీ అక్కడిదాకే పరిమితం అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారాయన. 'అయ్యే అవకాశం ఉందేమో' అంటూ తన తండ్రికి విష్ణు హింట్ ఇచ్చింది. 'అయితే సరే' అని విష్ణు ప్రియ తండ్రి ఒప్పుకున్నారు. అలాగే టేస్టీ తేజాకి 10 పుష్అప్స్ చేస్తే పిల్లను చూస్తానంటూ ఛాలెంజ్ ఇచ్చారు. కానీ టేస్టీ తేజ చేయలేకపోవడంతో ఆయన స్వయంగా చేసి చూపించి, అందర్నీ బాగా ఎంటర్టైన్ చేశారు. వెళ్తూ వెళ్తూ గేమ్ ఆడి, విష్ణు ప్రియ కి బర్గర్ గిఫ్ట్ గా వచ్చేలా చేశారు. 

ఇక ఆ తర్వాత హౌస్ లో మళ్ళీ పెళ్లి సందడి నెలకొంది. టాస్క్ లో భాగంగా పెళ్లి చేసే క్రమంలో పెళ్లి  కొడుకు చెప్పుల్ని పెళ్ళి కూతురు తరుపున వారు దాచి పెట్టారు. ఈ క్రమంలో ప్రేరణ వరస్ట్ ఫెల్లో అని నోరు జారడంతో అవినాష్ సీరియస్ అయ్యాడు. ఇక ఆ తర్వాత స్క్రిప్ట్ లో భాగంగా నబిల్ రోహిణినీ ప్రేమిస్తున్నాను అని చెప్పి లేపుకెళ్ళాడు. ఇక పెళ్లి సమయం దగ్గర పడ్డాక పిల్ల లేదని తెలిసి పెళ్లికూతురు ఫ్యామిలీతో పాటు పెళ్ళికొడుకు ఫ్యామిలీ ఇద్దరూ గొడవపడ్డారు. చివరికి రోహిణి తిరిగి వచ్చేసింది. ఇక గౌతమ్ కి ఇష్టం లేకపోయినా రోహిణిని ఇచ్చి పెళ్లి చేసేసారు. మొత్తానికి ఎపిసోడ్ అంతా ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది.

Read Also : Ram Charan: ‘గేమ్ ఛేంజర్‘ విడుదలకు ముందు కడప దర్గాకు రామ్‌ చరణ్‌... కారణం ఏంటంటే?

ఆ తర్వాత పృథ్వీ తల్లి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆవిడ అందరితో బాగా మాట్లాడుతూ విష్ణు ప్రియ తనకు నచ్చిందని, అమ్మాయిని కాదు కప్ తీసుకురా అంటూ పృథ్వి తో సెటైర్లు వేసింది. అయితే వీళ్ళిద్దరి వ్యవహారం గురించి ప్రస్తావిస్తూ పృథ్వికి ఏది ఇష్టమైతే అదే చేస్తామంటూ చెప్పుకొచ్చింది. అయితే నిఖిల్ 'ఈ అమ్మాయి బాగుందా? మంగళూరులో అమ్మాయిని చూద్దామా?' అని ప్రశ్నించగా... విష్ణు ప్రియ బాగుందని చెప్పింది ఆవిడ. ఇక కొడుకుతో కూర్చున్నప్పుడు  కోపం తగ్గించుకోమని, నీ ఆట నువ్వే ఆడుకోవాలని పృథ్వీతో చెప్పింది. అయితే పృథ్వీ తల్లి వెళ్తూ వెళ్తూ విష్ణు ప్రియ కూతురు లాంటిది అని బాంబు పేల్చి ఆమెను హగ్ చేసుకోవడం గమనార్హం. 

అనంతరం ప్రేరణ హస్బెండ్ రావడం కుదరలేదు అంటూ కేవలం రికార్డెడ్ వీడియోను చూపించారు. దీంతో ప్రేరణ కాస్త డిజప్పాయింట్ అయినట్టుగా కనిపించింది. చివరగా గౌతమ్ సోదరుడు హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఆయన అందరినీ పేరుపేరునా పలకరించిన తర్వాత, గౌతమ్ తో విడిగా కూర్చుని మాట్లాడుతూ "నువ్వు బాగా ఆడుతున్నావ్. అయితే ట్రయాంగిల్, రెక్టాంగిల్ అని పెంట మనకొద్దు. నువ్వు చూపించే స్వాగ్ బాగుంది. కప్పు గెలిచి ఇంటికి రావాలి' అంటూ సలహా ఇచ్చారు. ఇక మధ్య మధ్యలో తన తల్లి రావట్లేదని బాధతో తేజ కంటతడి పెడుతూ కనిపించాడు.

Read Also:మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Latest Weather Report: తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
Allu Arjun: ఆ పాటలో వింటేజ్ బన్నీను చూస్తారు... ఇకపై అభిమానులను వెయిట్ చేయించను - అల్లు అర్జున్ ప్రామిస్
ఆ పాటలో వింటేజ్ బన్నీను చూస్తారు... ఇకపై అభిమానులను వెయిట్ చేయించను - అల్లు అర్జున్ ప్రామిస్
Embed widget