అన్వేషించండి

Ram Charan: ‘గేమ్ ఛేంజర్‘ విడుదలకు ముందు కడప దర్గాకు రామ్‌ చరణ్‌... కారణం ఏంటంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో కడప దర్గాకు వెళ్లనున్నారు. ఈ నెల 18న జరగనున్న జాతీయ ముషాయిరా గజల్ ఈవెంట్ లో ఆయన పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ వేడుక కోసం ఏర్పాట్లు మొదలు పెట్టారు.

Ram Charan to visit Kadapa Dargah: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్‘ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా వచ్చే ఏడాది (2025) జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. రామ్ చరణ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ టైమ్ లో ఆయన కడపకు వెళ్లబోతున్నారు. ఇంతకీ ఆయన అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే...

ముషాయిరా గజల్ వేడుకల్లో పాల్గొననున్న చెర్రీ

దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కడప దర్గాలో ఈ నెల 18న 80వ జాతీయ ముషాయిరా గజల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు గజల్ గాయకులు పాల్గొననున్నారు. ఈ వేడుకకు రామ్ చరణ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయన.. పనిలో పనిగా  కడప దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రామ్ చరణ్ దర్గాకు వస్తున్న నేపథ్యంలో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భక్తలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నారు. దీక్షలో ఉండగానే ఈ వేడుకలో పాల్గొంటారా? లేదంటే, అప్పటిలోగా దీక్ష పూర్తి అవుతుందా? అనేది తెలియాల్సి ఉంటుంది. కడపలోని అమీన్ పీర్ దర్గాకు మంచి గుర్తింపు ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, నందమూరి కల్యాణ్ రామ్, పవన్ కల్యాణ్ లాంటి సినీ నటులు తరచుగా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. తాజాగా ఈ లిస్టులో చెర్రీ కూడా చేరబోతున్నారు.

Read Also:మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?

‘గేమ్ ఛేంజర్’పై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల రిలీజైన టీజర్‌ సినీ అభిమానులలో భారీగా అంచనాలు పెంచింది. ఈ చిత్రంలో తెలుగమ్మాయి అంజలి, నవీన్‌ చంద్ర, సునీల్, శ్రీకాంత్‌, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్‌, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, కన్నడ నటుడు జ‌య‌రామ్‌ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు కథను అందిచగా, సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు.  ఈ చిత్రానికి ఎస్‌ థమన్ సంగీతం అందించారు. దిల్ రాజు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.   

త్వరలో RC16 షూటింగ్ ప్రారంభం

ఓవైపు ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో మరోవైపు ‘RC16’ మూవీ షూటింగ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాకు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్ అప్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.  

Read Also: కంగువ రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉందా? - కోలీవుడ్ స్టార్ హిట్ కొట్టారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Prakasam District News: బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
PAN 2.0 - Aadhaar: పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
RBI Governor Salary: ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
Embed widget