By: ABP Desam | Updated at : 10 Sep 2023 07:07 PM (IST)
Photo Credit: Disney+ Hotstar & Star Maa/Instagram
బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ సెవెన్ లో వీకెండ్ వచ్చిందంటే హౌస్ లో సందడి మొదలవుతుంది. ముఖ్యంగా సండే అంటే పన్ డే అనే విషయం తెలిసిందే కదా. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున కంటెస్టెంట్స్ తో సరదాగా గేమ్స్ ఆడించడంతోపాటు హౌస్ లో గుర్తు పెట్టుకునే మూమెంట్, అలాగే మర్చిపోవాలనుకునే మూమెంట్ ఏంటని కంటెస్టెంట్స్ ని అడగడంతో ప్రోమో ప్రారంభమైంది. ఇందులో భాగంగా రతిక ‘‘నేను శివాజీని పెద్దన్న, పెద్దన్న అని పిలుస్తా. ఎందుకంటే నేను లో ఫీల్ అయినప్పుడల్లా అన్నయ్య నాకు ధైర్యం చెప్పిండు’’ అని తెలిపింది. దానికి నాగార్జున బదులిస్తూ ‘‘పెద్దయ్యతో ఆడేటప్పుడు పెద్దన్న సపోర్ట్’’ అనగానే హౌస్ లో నవ్వులు విరిశాయి.
ఆ తర్వాత శివాజీ ‘‘అమర్ అందరితో ఆడిస్తున్నాడు. కానీ తను ఆడట్లేదు. అది నా బాధ. నన్ను నామినేట్ చేయడం అనేది దారుణం అనిపించింది. అటువంటి మూమెంట్ రావద్దనేది నా ఫీలింగ్’’ అని అన్నాడు. ‘‘నేను పవర్ అస్త్ర ఆడడానికి వెళుతున్నప్పుడు షకీలా రెండుసార్లు నాకు దిష్టి తీశారు’’ అని సందీప్ చెప్తే, ‘‘అల్లం వెల్లుల్లి టాపిక్ తీసి షకీలా ఆ విషయంలో నన్ను నామినేట్ చేసింది’’ అని పల్లవి ప్రశాంత్ చెప్పాడు. ఆ తర్వాత టేస్టీ తేజ షకీలాతో అటు పో ఇటు రమ్మని ఆట పట్టిస్తూ నవ్వించాడు. ‘‘శోభ శెట్టిని చూడంగానే భలే ఉందిలే అనుకున్నాను. వచ్చిన రోజు ఓ పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది’’ అని ఆమె గురించి తేజ నాగార్జునకి చెబితే అప్పుడు నాగార్జున ‘‘బాత్రూం క్లీనింగ్ కి తేజ హెల్ప్ తీసుకోవచ్చు’’ అని శోభ శెట్టితో చెబుతారు. దీంతో శోభ ‘‘థాంక్యూ సో మచ్ సార్’’ అని తెలిపింది.
ఆ తర్వాత షకీలా డాన్స్ తో ఆకట్టుకున్నారు. ‘‘రాత్రిపూట లైట్స్ ఆఫ్ చేయండి సార్’’ అంటూ టేస్టీ తేజ నాగార్జునతో చెబితే ‘‘నువ్వు అడిగావు కాబట్టి ఈరోజు నైట్ లైట్స్ అసలు ఆఫ్ చేయను’’ అని అన్నారు. ఇక ప్రోమో చివర్లో నామినేట్ అయిన కంటెస్టెంట్స్ కి ఓ పౌచ్ ఇచ్చి పౌచ్ లో ఉన్న నెంబర్ ఏంటో చెప్పమని ముందుగా దామినిని అడిగారు. దాంతో దామిని 81 అని చెబుతుంది. ఆ తర్వాత నామినేటెడ్ కంటెస్టెంట్స్ అందరూ తమ పౌచ్ లో ఉన్న నెంబర్ ని చూసుకుంటారు. దాంతో లాస్ట్ లో 'యువర్ ఎలిమిటెడ్' అని నాగార్జున చెప్పడంతో ప్రోమో ఎండ్ అవుతుంది.
అయితే ఈ ప్రోమో లో కూడా ఈవారం ఎవరు ఎలిమినేట్ అయ్యారనే విషయాన్ని సస్పెన్స్ గా ఉంచారు. ఇక ఇదిలా ఉంటె మొదటి వారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో మొత్తం ఎనిమిది మంది సభ్యులు నామినేట్ అయిన విషయం తెలిసిందే. వారిలో పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, షకీలా, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, దామినిలు ఉన్నారు. వీరిలో రతిక, పల్లవి ప్రశాంత్ టాప్ 2 ప్లేసులో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే షకీలా, కిరణ్ రాథోడ్ డేంజర్ జోన్ లో ఉండగా కిరణ్ రాథోడ్ ఈవారం ఎలిమినేట్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read : ఆ టీవీ చానెల్‌లో బ్లాక్‌బస్టర్ మూవీ 'బేబీ' - టెలికాస్ట్ ఎప్పుడంటే?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ
బెదరగొట్టిన ‘యానిమల్’, రామ్ ‘స్కంద’.. ‘చంద్రముఖి-2’ ఎలా ఉన్నాయ్? ఇవీ ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలు
Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ గౌతమ్ మెడపై గాయాలు - తేజను తిట్టిపోస్తున్న ప్రేక్షకులు
Bigg Boss Season 7 Latest Promo: ఓరి వీరి వేషాలో, చూస్తుంటునే డోకు వస్తోందిగా - వింత అవతారాల్లో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు, దెయ్యం పిల్లగా ప్రియాంక!
Bigg Boss Updates: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఫుడ్ లొల్లి - శివాజీ దుమ్ముదులిపిన శోభా శెట్టి, యావర్ హర్ట్!
KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్ మీటింగ్ వచ్చే వారం !
TDP News : అధికార మత్తు వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్ చూశారా?
/body>