Bigg Boss OTT Telugu: అఖిల్ వర్సెస్ బిందు మాధవి, అసలు తగ్గడం లేదుగా
గతంలో ప్రసారమైన బిగ్ బాస్ షోల్లో కొన్ని జంటలు గొడవ పడ్డాయి. బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్, అఖిల్ ల మధ్యలో వార్ జరిగిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ ఓటీటీ తెలుగు నాన్ స్టాప్ మొదలై వారం రోజులవుతోంది. ఫస్ట్ వీక్ లో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. ఇందులో ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ కనిపించారు. మిత్ర, అషురెడ్డిల మధ్య పెద్ద గొడవే జరిగినట్లు ఉంది. ఇదే సమయంలో బిందు మాధవికి, అఖిల్ ల మధ్య కూడా డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.
మొదటి వారం నామినేషన్స్ సమయంలో అఖిల్ ని నామినేట్ చేసింది బిందు మాధవి. అఖిల్ కారణంగానే గేమ్ ఆగిపోయిందని.. అతడు వారియర్స్ టీమ్ ని కంట్రోల్ చేస్తున్నాడంటూ కామెంట్స్ చేసింది. అలానే.. వీకెండ్ ఎపిసోడ్ లో డాన్స్ చేసేప్పుడు కూడా తనకు పోటీగా అఖిల్ ని ఛాలెంజ్ చేసింది. ఇలా చాలా విషయాల్లో అఖిల్ కి టఫ్ ఫైట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది బిందు మాధవి.
గతంలో ప్రసారమైన బిగ్ బాస్ షోల్లో ఇలానే కొన్ని జంటలు గొడవ పడ్డాయి. బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్, అఖిల్ ల మధ్యలో వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బిందు మాధవి టఫ్ ఫైట్ ఇచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికి అయితే అఖిల్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి అతడు ఎక్కువ వారాలు హౌస్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. బిందు మాధవి నామినేషన్స్ లోకి రాలేదు కాబట్టి ప్రస్తుతం ఆమె స్టామినా ఏంటి అనేది తెలియదు.
గేమ్ పరంగా చూసుకుంటే ఇప్పటివరకు బిందు మాధవి చాలా డీసెంట్ గా గేమ్ ఆడుతూ వచ్చింది. ఆమె మాట్లాడడం కూడా చాలా లాజికల్ గా ఉంటుంది. తమిళ బిగ్ బాస్ లో బిందు మాధవి మంచి ఓటింగ్ పర్సెంటేజ్ తో దూసుకుపోయింది. అక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినా.. దాదాపు టాప్ 5 వరకు రీచ్ అయింది. కానీ మిడ్ వీక్ ఎవిక్షన్ లో భాగంగా ఆమె ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. లేదంటే కచ్చితంగా టాప్ 5లో ఉండేది. మరి తెలుగు బిగ్ బాస్ లో ఎంతవరకు సర్వైవ్ అవుతుందో చూడాలి!
Also Read: నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారో ముందే చెప్పేసిన ముమైత్
Also Read: ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్, ఎలిమినేట్ అయిన ముమైత్
https://t.co/b51uO1NDys
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 7, 2022
Daggers 🗡️ lanti views and opinions! Guccheskunnayi! Evaru evarni nominate chesaru mari 😱 !
Catch the full episode on @DisneyPlusHS at 9PM!!#BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop @EndemolShineIND
Before You Go
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















