By: ABP Desam | Updated at : 07 Mar 2022 03:22 PM (IST)
నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారో ముందే చెప్పేసిన ముమైత్ (image credit: hotstar)
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలై అప్పుడే వారం రోజులు పూర్తయింది. మొదటి ఎలిమినేషన్ లో భాగంగా ముమైత్ ఖాన్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చేసింది. సీజన్ 1లో అయితే ముమైత్ ని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ లో పెట్టారు. ఈసారి మాత్రం ఆమె మొదటివారంలోనే ఇంటి నుంచి బయటకు పంపించేశారు. ఈ క్రమంలో ఆమె చాలా ఎమోషనల్ అయింది. తనను కావాలనే బ్యాడ్ చేశారని.. బయటకు తప్పుగా పోట్రే చేశారంటూ స్టేజ్ పైనే ఎదచేసింది.
ఇంత త్వరగా ఎలిమినేట్ చేస్తారనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తరువాత ఆమె బిగ్ బాస్ నాన్ స్టాప్ బజ్ లో పాల్గొంది. యాంకర్ రవి ఈ షోని హోస్ట్ చేస్తున్నారు. తాజాగా ముమైత్ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఇంటి సభ్యుల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది ముమైత్ ఖాన్. ఒక్కో కంటెస్టెంట్ కి ఒక్కో ట్యాగ్ ఇచ్చింది.
బిందు మాధవికి స్నేక్ ట్యాగ్ ఇచ్చింది. సరయుకి మహానటి, శ్రీరాపాకకు పొగరని చెప్పిన ముమైత్.. హౌస్ లో బాగా కనెక్ట్ అయిన అజయ్ కి లవ్ సింబల్ పెట్టింది. బిందు మాధవి చాలా క్యాలుక్యునేషన్‌తో గేమ్ ఆడుతుందని చెప్పింది. ఇక తను ఎలిమినేట్ కావడానికి ఆర్జే చైతునే కారణమని.. అతడు పెద్ద ఫేక్ కంటెస్టెంట్ అని చెప్పింది. అంతేకాదు.. నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వబోయేది కూడా అతడేనని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది.
తను ఎలిమినేట్ కావడం వలన ఆర్జే చైతు, బిందు మాధవి, యాంకర్ శివ, శ్రీరాపాకలు హ్యాపీగా ఉన్నారని చెప్పుకొచ్చింది. అలానే యాంకర్ శివపై కూడా ఫైర్ అయింది ముమైత్. శివ వయసు 25 అని.. తన వయసు 36 అని.. అతని గురించి ఏం చెప్పాలనుకున్నానో దీన్ని బట్టి మీరే అర్ధం చేసుకోండి అంటూ కామెంట్స్ చేసింది ముమైత్.
Good morning Bigg Boss fam!
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 7, 2022
The week's excitement is not over yet! Head on over to @DisneyPlusHS at 11 am and watch Mumaith Khan's exclusive interview after her elimination.#BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop@EndemolShineIND pic.twitter.com/7Ml43tbctB
Mumaith Khan is the first elimination of #BiggBossNonStop!
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 6, 2022
Mee thoughts and reactions enti? #BiggBoss #BiggBossTelugu @DisneyPlusHS @EndemolShineIND @iamnagarjuna
Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా
Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం
Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!
Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !
TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి
Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం
Mla Balakrishna : ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే ఈ తిప్పలు, వైసీపీ గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తుంది - ఎమ్మెల్యే బాలకృష్ణ