By: ABP Desam | Updated at : 23 Mar 2022 03:38 PM (IST)
Image Credit: Disney Plus Hotstar
నటరాజ్ మాస్టర్ ఏ మాత్రం మారలేదు. ఇంకా అలాగే ఉన్నారంటున్నారు బిగ్ బాస్ అభిమానులు. అదేంటీ, అంతగా ఆయన ఏం చేశారనే మీ సందేహం? ఇదిగో ఏం చేశారో చూడండి.
ఓటీటీలో ప్రసారమవుతున్న ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ద్వారా నటరాజ్ మాస్టర్ తన లక్ పరీక్షించుకోడానికి రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పటికీ ఆయన ఒరిజినాలిటీ అలాగే ఉంది. ఒక్కోసారి ప్రేమగా మాట్లాడుతూనే, మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. రకరకాల షేడ్స్ చూపిస్తున్నారు. తాజాగా ఆయన కోపంతో తన చెంపలను చెల్ చెల్‌మని వాయించుకుని షాకిచ్చారు. ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇంతకీ ఏం జరిగింది?: గతవారం కెప్టెన్‌గా ఎంపికైన ఆర్జే చైతూ.. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. దీంతో హౌస్‌లో కెప్టెన్ లేడు. ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్ లేకపోవడంతో ‘బిగ్ బాస్’ హౌస్‌మేట్స్ అందరికీ మరో కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. దాని ప్రకారం.. గార్డెన్ ఏరియాలో విసిరేసే స్టార్లను సభ్యులంతా కలెక్ట్ చేయాలి. ఎక్కువ స్టార్స్ కలెక్ట్ చేసేవారు ఆ ఇంటికి కెప్టెన్‌గా ఎంపికవుతారు. ఇక ఆ హింట్ ఇస్తే చాలు.. చెలరేగిపోతామని బరిలోకి దిగిన హౌస్‌మేట్స్, తమ స్టార్స్‌తోపాటు పక్కోళ్ల స్టార్స్ కూడా ఎత్తేస్తున్నారు.
Also Read: ‘బిగ్ బాస్ ఓటీటీ’ ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారంటే?
తాజాగా విడుదలైన ప్రోమో ప్రకారం.. తెల్లవారుజామున ఎవరో స్టార్లు దొంగలించారని, అతడెవరో తనకు తెలిసినా, నేను చెప్పనని అరియానా చెప్పింది. మరోపక్క అఖిల్‌తో అషూరెడ్డి మాట్లాడుతూ.. తన మీద అరుస్తూ, హర్ట్ చేసి మళ్లీ సారి చెప్పదని అని చెప్పింది. దీంతో అఖిల్.. ‘‘నా లిమిట్స్‌తో నేను ఉంటా’’ అని చెప్పాడు. ఆ మాటకు అషూరెడ్డి అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ స్టార్లు విసురుతున్న సమయంలో నటరాజ్ మాస్టర్ స్టార్లు దాచుకున్న కవర్ చిరిగిపోయింది. దీంతో మిగతా హౌస్‌మేట్స్ వాటిని ఎత్తేశారు. ఆగ్రహంతో రగిలిపోయిన నటరాజ్ తన చెంపలు వాయించుకుంటూ ఏడ్చేశారు. మరి, ఎవరి వద్ద ఎక్కువ స్టార్స్ ఉన్నాయి? ఎవరు గెలుస్తారనేది ఓటీటీలోనే చూడాలి. మరోవైపు అఖిల్, హమీదా మధ్య కూడా రచ్చ నడుస్తోంది. అఖిల్ తనను అభ్యంతరకరంగా టచ్ చేశాడంటూ హమీదా ఫిర్యాదు చేసింది. తనమీద తప్పుడు నిందలేయొద్దని అఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అషూరెడ్డి వారికి రాజీ కుదిర్చే ప్రయత్నం చేసింది.
Bigg Boss 7 Telugu: అర్జున్ ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ.. అంటూ కంటెస్టెంట్‌కు షాకిచ్చిన నాగార్జున
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌కు క్యాష్ ప్రైజ్ ఎంతో రివీల్ చేసిన నాగార్జున, డబ్బులతో పాటు అవన్నీ కూడా!
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నా సామిరంగ’ హీరోయిన్ - ఇంప్రెస్ చేసి ఫ్లయింగ్ కిస్ కొట్టేసిన అమర్
Bigg Boss 7 Telugu: సండే ఎపిసోడ్లో నాని - ప్రియాంకకు మ్యాథ్స్, యావర్‌కు తెలుగు క్లాసులు
Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
/body>