అన్వేషించండి

Bigg Boss 7 Telugu: అమర్ వీడియోను లీక్ చేసిన బిగ్ బాస్, శోభ శెట్టి ఏడుపు - ఫన్ టాస్క్‌లోనూ అదే లొల్లి

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఈవారమంతా ఫన్ టాస్కులు జరగనున్నాయి. వీటికి ఫన్ టాస్క్ అని పేరు పెట్టినా కూడా హౌజ్‌మేట్స్ మాత్రం వీటిని సీరియస్‌గానే తీసుకుంటున్నారు.

Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్స్ దగ్గర పడుతున్నాయి. అంతే కాకుండా ఇప్పటినుంచి కంటెస్టెంట్స్‌కు వచ్చే ఓటింగ్.. వారిని విన్నర్ అవుతారా లేదా అని డిసైడ్ చేస్తుంది. ఈ రెండు వారాల్లో ఎవరికైతే ఎక్కువ ఓటింగ్ లభిస్తుందో.. వారే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌గా నిలుస్తారు. అయితే ప్రేక్షకులకు నేరుగా ఓటింగ్ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కంటెస్టెంట్స్‌కు అందించారు బిగ్ బాస్. కానీ అలా చేయాలంటే పలు ఫన్నీ టాస్కులు దాటాలి. అయితే ఈ టాస్కులు ఫన్నీగా ఉన్నా.. దీనివల్ల గొడవలు మాత్రం సీరియస్‌గానే జరిగాయి. అంతే కాకుండా టాస్కులో ఓడిపోవడం వల్ల శోభా కన్నీళ్లు కూడా పెట్టుకుంది.

అమర్ వీడియో లీక్..
హౌజ్‌మేట్స్ ఓటు అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పిన బిగ్ బాస్.. ఈవారమంతా వారు కొన్ని ఫన్నీ టాస్కులు ఆడబోతున్నారని బయటపెట్టారు. అయితే ఈ ఫన్నీ టాస్కుల్లో గెలిచినవారే ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందా లేదా అనే విషయాన్ని మాత్రం అప్పుడే రివీల్ చేయలేదు. ఈ ఫన్ టాస్కులు మొదలయ్యే ముందుకు అమర్‌దీప్‌ను యాక్టివిటీ ఏరియాలోకి పిలిచిన బిగ్ బాస్.. దాదాపు ఒక కిలో కేక్‌ను ఒక్కడినే తినమని ఆదేశించారు. అలా తినగలిగితే మిగతా హౌజ్‌మేట్స్‌కు కూడా కేక్ లభిస్తుందని తెలిపారు. దీంతో అమర్ తనకు కుదిరినంత వరకు కేక్‌ను తినే ప్రయత్నం చేశాడు. కానీ కాసేపటికే తన వల్ల కావడం లేదని కేక్‌ను వదిలేశాడు. బయటికి వెళ్లి యాక్టివిటీ ఏరియాలో జరిగినదాని గురించి ఎవరికీ చెప్పవద్దని బిగ్ బాస్ ఆదేశించడంతో బయటికి వచ్చిన అమర్.. ఓవరాక్షన్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కాసేపటికే అసలు అమర్ యాక్టివిటీ ఏరియాలో ఏం చేశాడు అనే విషయాన్ని వీడియో ద్వారా హౌజ్‌మేట్స్ అందరికీ చూపించారు బిగ్ బాస్. దీంతో అందరూ ఆ వీడియో చూసి నవ్వుకున్నారు. సరిపడా కేక్ తిన్నాడు కాబట్టి రోజంతా తనకు ఫుడ్ పెట్టకూడదని నిర్ణయించుకున్నారు.

శోభా ఏడుపు..
బిగ్ బాస్.. హౌజ్‌మేట్స్‌కు ఇచ్చిన ఫన్నీ టాస్కుల్లో మొదటిది పూల్ టాస్క్. ఈ టాస్క్‌లో మ్యూజిక్ ప్లే అయినప్పుడు కంటెస్టెంట్స్ అంతా పరిగెత్తుకుంటూ వెళ్లి పూల్‌లో దూకాలి. ఎవరైతే చివరిగా దూకుతారో.. వారు టాస్క్ నుంచి ఔట్ అయిపోతారు. అలా ముందు రౌండ్‌లోనే అమర్‌దీప్ ఔట్ అవ్వడంతో తనను సంచాలకుడిగా వ్యవహరించమని బిగ్ బాస్ తెలిపారు. ఆ తర్వాత రౌండ్‌లో శోభ ఔట్ అవ్వడంతో కన్నీళ్లు పెట్టుకుంది. తనకు మళ్లీ అవకాశం రాదని, ఇదే లాస్ట్ అని ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏం జరగదని అమర్ ఓదార్చే ప్రయత్నం చేసినా కూడా శోభా మాత్రం టాస్క్ అయిపోయే వరకు డల్‌గానే కూర్చుంది. శోభా తర్వాత అర్జున్, తర్వాత ప్రశాంత్‌లు ఔట్ అయ్యారు.

అయితే తాను ముందు పూల్‌లో దూకానని, ప్రియాంక తన తర్వాతే దూకిందని ప్రశాంత్ ఆరోపించడం మొదలుపెట్టాడు. సంచాలకుడిగా అమర్‌దీప్.. తాను చూశానని చెప్తున్నా కూడా ప్రశాంత్ నమ్మలేదు. వీడియో కావాలి అంటూ అరిచాడు. ఫన్ టాస్క్‌లో ఏంటి మీ గోల అని అర్జున్ చెప్తున్నా వినలేదు. ఫైనల్‌గా పూల్ టాస్కులో యావర్, శివాజీ మిగలగా.. సెకండ్ తేడాలో యావర్ ముందుగా పూల్‌లోకి దూకాడు. దీంతో మొదటి ఫన్ టాస్కు‌లో యావర్ విన్నర్ అయ్యి ఓటు అప్పీల్ చేసుకోవడానికి ఒక అడుగు ముందుకు వెళ్లాడని బిగ్ బాస్ ప్రకటించారు. అయితే యావర్ గెలవడం కోసం తనను చేతితో నెట్టేసి ముందుకు వెళ్లాడని అర్జున్ ఆరోపించాడు. యావర్ చేయి తన మొహానికి గట్టిగా తగిలిందని, ఇది ఫన్ టాస్క్‌లాగా లేదని, రేపు కూడా అలాగే చేస్తే తిరిగి కొడతానని అమర్‌తో చెప్పాడు అర్జున్.

Also Read: ‘బిగ్ బాస్’లో ముద్దులు పెట్టుకున్న కంటెస్టెంట్స్, రాత్రయితే రచ్చే - తిట్టిపోస్తున్న జనం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rushikonda Buildings: రుషికొండపై వైసీపీ సీక్రెట్‌గా కట్టింటిన భవనాల్లో ఏముంది? తొలిసారి మీడియా లోపలికి - మొత్తం చూపించిన మాజీ మంత్రి
రుషికొండపై వైసీపీ సీక్రెట్‌గా కట్టింటిన భవనాల్లో ఏముంది? తొలిసారి మీడియా లోపలికి - మొత్తం చూపించిన మాజీ మంత్రి
Medak Section 144: మెదక్ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరా, గోవుల రవాణా వివాదంతో 144 సెక్షన్‌
మెదక్ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరా, గోవుల రవాణా వివాదంతో 144 సెక్షన్‌
Renu Desai: నేను కాదు, ఆయనే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు - పవన్ ఫ్యాన్‌కు రేణు దేశాయ్ ఘాటు రిప్లై! కామెంట్ వైరల్
నేను కాదు, ఆయనే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు - పవన్ ఫ్యాన్‌కు రేణు దేశాయ్ ఘాటు రిప్లై! కామెంట్ వైరల్
NCERT Books Revised: NCERT బుక్స్‌లో బాబ్రీ మసీదు పాఠం తొలగింపు, వివాదాల జోలికి పోకుండా సిలబస్‌లో మార్పులు
NCERT బుక్స్‌లో బాబ్రీ మసీదు పాఠం తొలగింపు, వివాదాల జోలికి పోకుండా సిలబస్‌లో మార్పులు
Advertisement
Advertisement
Advertisement
metaverse

వీడియోలు

Sreesanth About Sanju Samson Shivam Dube | సంజు శామ్సన్ జట్టులో ఉండాలన్న శ్రీశాంత్ | ABP DesamSunil Gawaskar Furious About Florida | ఫ్లోరిడా స్టేడియంపై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP DesamTeam India Sentiment in T20 Worldcup 2024 | టీ20 కప్ టీమిండియాదే అంటున్న ఫ్యాన్స్ | ABP DesamChiranjeevi Wife Surekha Gift to Pawan kalyan | పవన్ కు ఇచ్చిన పెన్ను ధర లక్షల్లో ఉంటుందా..? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rushikonda Buildings: రుషికొండపై వైసీపీ సీక్రెట్‌గా కట్టింటిన భవనాల్లో ఏముంది? తొలిసారి మీడియా లోపలికి - మొత్తం చూపించిన మాజీ మంత్రి
రుషికొండపై వైసీపీ సీక్రెట్‌గా కట్టింటిన భవనాల్లో ఏముంది? తొలిసారి మీడియా లోపలికి - మొత్తం చూపించిన మాజీ మంత్రి
Medak Section 144: మెదక్ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరా, గోవుల రవాణా వివాదంతో 144 సెక్షన్‌
మెదక్ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరా, గోవుల రవాణా వివాదంతో 144 సెక్షన్‌
Renu Desai: నేను కాదు, ఆయనే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు - పవన్ ఫ్యాన్‌కు రేణు దేశాయ్ ఘాటు రిప్లై! కామెంట్ వైరల్
నేను కాదు, ఆయనే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు - పవన్ ఫ్యాన్‌కు రేణు దేశాయ్ ఘాటు రిప్లై! కామెంట్ వైరల్
NCERT Books Revised: NCERT బుక్స్‌లో బాబ్రీ మసీదు పాఠం తొలగింపు, వివాదాల జోలికి పోకుండా సిలబస్‌లో మార్పులు
NCERT బుక్స్‌లో బాబ్రీ మసీదు పాఠం తొలగింపు, వివాదాల జోలికి పోకుండా సిలబస్‌లో మార్పులు
Ram Charan-Klin Kaara: ఫాదర్స్‌ డే.. కూతురితో రామ్‌ చరణ్‌ ఆటలు - క్యూట్‌ ఫోటో వైరల్‌
ఫాదర్స్‌ డే.. కూతురితో రామ్‌ చరణ్‌ ఆటలు - క్యూట్‌ ఫోటో వైరల్‌
AP New Cabinet: మంత్రి పదవులు ఎక్కువ మందికి ఎందుకివ్వరు? ఏపీలో 26 మందికే ఎందుకు?
మంత్రి పదవులు ఎక్కువ మందికి ఎందుకివ్వరు? ఏపీలో 26 మందికే ఎందుకు?
NEET: 'నీట్'గా అమ్మేశారు! ఒక్కో అభ్యర్థి నుంచి 30 లక్షలు వసూలు? జాతీయ మీడియాలో జోరుగా కథనాలు
'నీట్'గా అమ్మేశారు! ఒక్కో అభ్యర్థి నుంచి 30 లక్షలు వసూలు? జాతీయ మీడియాలో జోరుగా కథనాలు
Elon Musk: EVMలను ఏ మాత్రం నమ్మలేం, హ్యాక్‌ అయ్యే ప్రమాదముంది - మస్క్ సంచలన వ్యాఖ్యలు, సమర్థించిన రాహుల్
EVMలను ఏ మాత్రం నమ్మలేం, హ్యాక్‌ అయ్యే ప్రమాదముంది - మస్క్ సంచలన వ్యాఖ్యలు, సమర్థించిన రాహుల్
Embed widget