Bigg Boss 9: బిగ్ బాస్ 9లో దివ్వెల మాధురి ఆల్మోస్ట్ కన్ఫర్మ్... రాజాతో వస్తే రచ్చ రచ్చే
Bigg Boss 9 Telugu Contestants: 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 మాంచి రసవత్తరంగా ఉండబోతోందని కంటెస్టెంట్ల పేర్లు వింటుంటే అర్థం అవుతోంది. సామాన్యులతో పాటు రాజకీయ సెలబ్రిటీలకూ చోటు ఇస్తోంది స్టార్ మా.

రాజకీయాలతో పాటు తెలుగు సోషల్ మీడియాలో దివ్వెల మాధురి - రాజకీయ నేత దువ్వాడ శ్రీనివాస్ పాపులర్. వాళ్ళిద్దరి బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'బిగ్ బాస్' ఇంటిలో వీళ్ళిద్దరూ సందడి చేసే అవకాశం లేకపోలేదు. ఇద్దరిలో ఒకరు అయితే కన్ఫర్మ్. ఆ వివరాల్లోకి వెళితే...
'బిగ్ బాస్ 9'లో దివ్వెల మాధురి!
Madhuri Divvala to enter Bigg Boss 9 Telugu House: ఏపీ అసెంబ్లీకి 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం తెరపైకి వచ్చింది. భార్య వాణీకి దూరంగా, దివ్వెల మాధురికి దగ్గరగా ఆయన ఉండటం చర్చనీయాంశం అయ్యింది. తమ బంధాన్ని అడల్ట్రీ అనుకోమని దివ్వెల మాధురి నేరుగా మీడియా ముందు చెప్పారు. దాంతో ఆవిడ కుండబద్దలు కొట్టినట్టు స్పష్టత ఇచ్చినట్టు అయ్యింది. ఇంటి ముందు భార్యా బిడ్డలు ధర్నాలు చేసినా దువ్వాడ శ్రీనివాస్ పట్టించుకున్నది లేదు.
విమర్శలను లెక్క చేయకుండా సమాజంలోనూ, సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట అన్యోన్యంగా తిరుగుతోంది. రాజకీయాలతో పాటు ప్రజల్లోనూ టాక్ ఆఫ్ ది టౌన్ అయినటువంటి వీళ్ళు 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంది. దివ్వెల మాధురి అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్. మరి 'రాజా' అంటూ ఆవిడ ముద్దుగా పిలుచుకునే దువ్వాడ శ్రీనివాస్ వస్తారా? లేదా? అనేది చూడాలి. నిజానికి గతేడాది 'బిగ్ బాస్'లో మాధురి ఎంటర్ అవుతారని వార్తలు వచ్చాయి. ఈ సీజన్ సమయానికి అది కుదిరింది అన్నమాట.
'బిగ్ బాస్ 9' ఇంటిలో సందడి చేసేదెవరు?
Bigg Boss 9 Telugu Contestants List: దివ్వెల మాధురితో పాటు సీరియల్ స్టార్ దేబ్ జాన్ మోదక్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, అలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూతో పాపులరైన రమ్య మోక్ష కంచర్ల, హీరో సుమంత్ అశ్విన్, నటి జ్యోతి రాయ్, అమర్ దీప్ చౌదరి భార్య తేజస్విని గౌడ తదితరులు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది.
'బిగ్ బాస్ 9' ఇంటిలో కొందరు సామాన్యులకు సైతం అవకాశం ఇస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసం 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' షో చేస్తున్నారు. ప్రస్తుతం ఆ షో షూటింగ్ జరుగుతోంది. ఆగస్టు 22న స్టార్ట్ చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ తొలి వారంలో 'బిగ్ బాస్ 9' ప్రారంభం కానుంది.
Also Read: 'బిగ్ బాస్ 9' హౌస్‌కు డివోషనల్ టచ్... థీమ్, కాన్సెప్ట్ తెలుసా?





















