Anusha Ratnam: వరంగల్ to 'బిగ్ బాస్' వయా సాఫ్ట్‌వేర్ జాబ్... ఎవరీ అనూష? అగ్నిపరీక్షలో వైరల్ అమ్మాయి, ఇన్‌స్టా సెలబ్రిటీ గురించి తెల్సా?
Bigg Boss Agnipariksha Contestants: సామాన్యులను 'బిగ్ బాస్'కు తీసుకు వెళ్లడం కోసం ప్రారంభించిన 'అగ్నిపరీక్ష'లో 15 మందిని ఎంపిక చేశారు. వారిలో అనూషా రత్నం ఒకరు. ఆమె ఇన్‌స్టాలో సెలబ్రిటీ.

Bigg Boss Telugu Season 9 Latest Updates: 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 ఇంకా మొదలు కాలేదు. కానీ, బిగ్ బాస్ మంటలు మాత్రం సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి. ఈసారి ఇంటిలోకి సామాన్యులకు ప్రవేశం కల్పించడం కోసం చేస్తున్న 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' షూటింగ్ విశేషాలు లీక్ అవుతున్నాయి. అందులో ఎక్కువగా వినబడుతున్న పేరు అనూషా రత్నం. ఇంతకీ, ఆ అమ్మాయి ఎవరో తెలుసా?
అనూషా రత్నం... వరంగల్ అమ్మాయి!
అనూషా రత్నం తెలంగాణ అమ్మాయి. ఆమెది వరంగల్. ఆ పేరుకు ఒక హిస్టరీ ఉంది. తన తల్లిదండ్రులది ప్రేమ వివాహం అని, అయితే తల్లి కంటే ముందు మరో మహిళతో తండ్రికి లవ్ స్టోరీ ఉందని, నాన్న ఫస్ట్ గాళ్ ఫ్రెండ్ పేరు తనకు పెట్టారని ఒక ఇంటర్వ్యూలో అనూషా రత్నం తెలిపారు. ఆమె తల్లి స్కూల్ ప్రిన్సిపాల్. ప్రస్తుతం తండ్రి లేరు. ఆయన మరణించినప్పుడు తలకొరివి అనూష పెట్టారు. ఆమెకు చెల్లి ఉన్నారు. అనూష చెల్లెకి మోడలింగ్ అంటే ఇష్టం. ఫ్యాషన్ పోటీలకు వెళ్లారు కూడా! ఇప్పుడు ఆమె యూకేలో ఉన్నారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి సెలబ్రిటీగా...
తల్లిదండ్రులది కులాంతర ప్రేమ వివాహం కావడంతో బంధు మిత్రుల నుంచి తమకు ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ రాలేదని, అందువల్ల చిన్నప్పటి నుంచి తాము కష్టాలు పడ్డామని అనూషా రత్నం తెలిపారు. మే 5, 2022న ఆమె తండ్రి మరణించారు. తండ్రి మరణం తర్వాత, అంతకు ముందు కొన్ని సందర్భాల్లో డిప్రెషన్‌కు వెళ్లిన సందర్భాలు ఉన్నాయని ఆవిడ వివరించారు. తల్లిని తండ్రి కొట్టేవారని, రక్తం చూశానని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి మద్యానికి బానిస కావడంతో తాము ఇబ్బందులు పడ్డామని వివరించారు.

ఎడ్యుకేషన్ విషయానికి వస్తే... అనూషా రత్నం ఎంఎస్సీ చేశారు. హైదరాబాద్ సిటీలో 2019 వచ్చారు. ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేశారు. ఐదేళ్లు ఓ కంపెనీలో పని చేశాక బ్రేక్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ అయ్యారు. అప్పటి నుంచి గుర్తింపుతో పాటు డబ్బులు కూడా రావడంతో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరాయి.
హరీష్ శంకర్ నుంచి అనూకి మెసేజ్...
రఘు కుంచె సపోర్ట్, యాంకర్‌గా ఈవెంట్స్!
అనూష ఓపెన్‌గా మాట్లాడే అమ్మాయి. ఇప్పుడు ప్రేమ తక్కువ ఉందని, ఆ సుఖం కోసం వెంటపడే అబ్బాయిలు ఎక్కువ అని ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు. ఈ రోజుల్లో ప్రేమ దొరకడం కష్టం అని, ఆ సుఖం దొరకడం సులభమైందని ఆవిడ పేర్కొన్నారు.
Also Read: ట్రాన్స్ మహిళ అంకితకు కమ్యూనిటీ వెన్నుపోటు... బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి వెనక్కి!
ఇన్‌స్టాలో వీడియోలు చేయడం ప్రారంభించిన తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ నుంచి ఒక మెసేజ్ వచ్చిందని అనూష పేర్కొన్నారు. రఘు కుంచె తనకు సపోర్ట్ చేశారని, వీడియోస్ బావున్నాయని చెబుతూ ఉంటారని అనూష వివరించారు. కొన్ని సినిమా ఈవెంట్స్‌కు ఆమె యాంకరింగ్ కూడా చేశారు. 'వర్జిన్ బాయ్స్' సినిమా ఈవెంట్‌లో 'కొత్త యాంకర్ కొత్త ఆవకాయ్ కింద ఉంది' అని నిర్మాత రాజా దారపునేని కామెంట్ చేయడం వైరల్ అయ్యింది. సుమ కనకాల ఇన్స్పిరేషన్ అని ఓ ఇంటర్వ్యూలో ఆవిడ పేర్కొన్నారు. 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' నుంచి 'బిగ్ బాస్ 9' వరకు అనూష వెళుతుందా? లేదా? వీక్షకులలో ఆమెకు ఎటువంటి ఆదరణ దక్కుతుంది? అనేది చూడాలి. ఇన్‌స్టాలో ఆమెకు ఆల్మోస్ట్ 280k ఫాలోయర్లు ఉన్నారు.
Also Read: 'బిగ్ బాస్ 9' హౌస్‌కు డివోషనల్ టచ్... థీమ్, కాన్సెప్ట్ తెలుసా?





















