Gangavva: గంగవ్వకు నాగార్జున కట్టించిన కొత్త ఇంటిని చూశారా?
నాగార్జున, స్టార్ మా కలిసి గంగవ్వకి కొత్త ఇల్లు కట్టించాలని నిర్ణయించుకున్నారు. ఫైనల్ గా ఈ ఇంటి నిర్మాణం పూర్తికావడంతో గంగవ్వ రీసెంట్ గానే గృహప్రవేశం చేసింది.
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ప్రముఖ యూట్యూబర్ గంగవ్వ(Gangavva) ఇటీవల కొత్తింట్లోకి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. 'మై విలేజ్ షో' అనే యూట్యూబ్ ఛానెల్ తో గంగవ్వ బాగా ఫేమస్ అయింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. గతేడాది బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొని.. బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. హౌస్ లో చాలా కాలంపాటు ఉన్న ఆమె ఆరోగ్య సమస్యల కారణంగా బయటకు వచ్చేసింది.
అలా వచ్చేస్తూ.. హోస్ట్ నాగార్జునతో తన కోరికను తెలియజేసింది. చాలా ఏళ్లుగా తనకంటూ ఓ సొంతిల్లు నిర్మించుకోవాలని కల అని చెప్పింది. దీంతో నాగార్జున, స్టార్ మా కలిసి గంగవ్వకి కొత్త ఇల్లు కట్టించాలని నిర్ణయించుకున్నారు. దీని నిర్మాణం మొదలుపెట్టి చాలా కాలమవుతున్నా.. కరోనా కారణంగా ఆలస్యమైంది. ఫైనల్ గా ఈ ఇంటి నిర్మాణం పూర్తికావడంతో గంగవ్వ రీసెంట్ గానే గృహప్రవేశం చేసింది.
ఇక తాజాగా తన కొత్తింటిని చూపిస్తూ ఓ వీడియో విడుదలను చేసింది గంగవ్వ. ఆ వీడియోలో తన ఇంటి విషయాలను పంచుకుంది. ముందుగా తనకు ఇల్లు కట్టిస్తానని మాటిచ్చిన నాగార్జున, బిగ్ బాస్ టీమ్ కు, స్టార్ మాకు ధన్యవాదాలు చెప్పింది. తన ఇంటి గృహప్రవేశానికి కలగూర గంప టీంతో పాటు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అఖిల్ తన తల్లితో వచ్చాడని, అలాగే సావిత్రి కూడా వచ్చిందని తెలిపింది గంగవ్వ. కొంతమంది షూటింగ్స్, డబ్బింగ్ కారణంగా రాలేకపోయారని చెప్పింది. తన కొత్తింటిని, అందులో గదులను చూపిస్తూ మురిసిపోయింది గంగవ్వ. మొత్తానికి గంగవ్వ బిగ్ బాస్ వల్ల ఇంటిని సొంతం చేసుకుంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Also Read:అమెరికాలో విజయ్ దేవరకొండ.. పూరితో చిల్ అవుతూ..
Also Read: బాలయ్య షోకి గెస్ట్ గా సెన్సేషనల్ హీరో.. రచ్చ మాములుగా ఉండదేమో..
Also Read: జనవరిలో మహేష్ బాబు రావడం లేదు. కానీ, ఆయన మేనల్లుడు వస్తున్నాడోచ్
Also Read: వీవీ వినాయక్ క్లాప్‌తో... బాలకృష్ణ107వ సినిమా షురూ
Also Read: ప్రభాస్, పూజా హెగ్డే షి'కారు'... అదీ సముద్రంలో! ఈ రాతలే... రాధే శ్యామ్!
Also Read: బాలకృష్ణ కాపాడిన ప్రాణం... బాలకృష్ణ ముందుకు తీసుకొచ్చిన నాని
Also Read: పవన్ కల్యాణ్ చూశారు... ప్రశంసించారు! సంతోషంలో సినిమాటోగ్రాఫర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి