అన్వేషించండి

Bigg Boss 8 Telugu Day 24 Promo 3: విష్ణు ప్రియపై బిగ్ బాస్ సెటైర్లు... నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ కామెడీ 

Bigg Boss Telugu 8 Latest Promo: బిగ్ బాస్ 8 తెలుగు డే 24 షో నుంచి తాజాగా ప్రోమో 3 రిలీజ్ అయ్యింది. అందులో రెండు ఛాలెంజ్ లు పెట్టారు బిగ్ బాస్. విష్ణు ప్రియపై బిగ్ బాస్ చేసిన కామెడీ హైలెట్ అయ్యింది.

బిగ్ బాస్ సీజన్ 8 డే 24కు సంబంధించిన మూడో ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. అందులో అంతకు ముందే ప్రకటించిన విధంగా 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీలను అడ్డుకోవడానికి తమకు ఇచ్చిన టాస్క్ విన్ అవ్వాల్సి ఉంటుంది. దీంతో తాము కాకుండా హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా కంటెస్టెంట్స్ అడుగు పెట్టకుండా ఉండడానికి హౌస్ మేట్స్ చేయగలిగిన ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి రెండు టాస్కులు పెట్టినట్టుగా ప్రోమోలో చూపించారు. అయితే రెండవ టాస్క్ లో బిగ్ బాస్ విష్ణుప్రియపై సెటైర్లు వేసి అందరినీ నవ్వించారు. మరి తాజా ప్రోమోలో ఉన్న విశేషాలు ఏంటో ఒక లుక్కేద్దాం పదండి. 

బాల్ ని పట్టు టవర్ లో పెట్టు 
తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి 12 మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ అనౌన్స్ చేసి హౌస్ లో బిగ్ బాంబ్ పేల్చారు బిగ్ బాస్. ఇక ఆ వైల్డ్ కార్డు ఎంట్రీల వల్ల ఏకంగా బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే కంటెస్టెంట్స్ గా ఉన్న వారిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ కూడా ఉందని హెచ్చరించారు బిగ్ బాస్. అలాగే "ఆ వైల్డ్ కార్డు ఎంట్రీలను ఆపగలిగే శక్తి సామర్థ్యాలు మీకే ఉన్నాయి" అంటూ ఏకంగా 12 టాస్కులు పెట్టడానికి సిద్ధమయ్యారు బిగ్ బాస్. ఆ పన్నెండు ఛాలెంజ్ లలో గెలిస్తే వైల్డ్ కార్డు ఎంట్రీలను ఆపగలరు అంటూ బిగ్ బాస్ ఆదేశించగా, హౌస్ మేట్స్ ముందుగా షాక్ అయినా తమకు వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే మొదటి టాస్క్ బాల్ పట్టు టవర్ లో పెట్టు అంటూ హౌస్ మేట్స్ కు కొత్త ఛాలెంజ్ ఇచ్చారు బిగ్ బాస్. తాజాగా రిలీజ్ అయిన డే 24 ప్రోమో 3లో ఈ టాస్క్ ను కిరాక్ సీత క్లాన్ విన్ అయినట్టుగా చూపించారు. 

Read Also : బిగ్ బాస్ 8 నాలుగో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీళ్ళే.. లిస్ట్ లో సోనియా ఉందిగా

విష్ణు ప్రియపై బిగ్ బాస్ ఫన్నీ కామెంట్స్  
ఆ తర్వాత హౌస్ మేట్స్ కి బిర్యానీ టాస్క్ పెట్టారు. అందులో హౌస్ మేట్స్ ముందు బిర్యానీ పెట్టి 'ఈట్ ఇట్ టు బీట్ ఇట్' అనే ఫుడ్ ఛాలెంజ్ పెట్టారు. ఇందులో నిఖిల్ క్లామ్ నుంచి సోనియా పాల్గొనగా, కిరాక్ సీత క్లాన్ నుంచి నబిల్ పాల్గొన్నాడు. అయితే ప్రోమో చూస్తుంటే ఇద్దరూ తినలేకపోయినట్టుగా కనిపిస్తోంది. ఛాలెంజ్ సీరియస్ గా సాగుతుంటే మధ్యలో బిగ్ బాస్ "విష్ణు ప్రియా.. ఆ భోజనాన్ని చూస్తుంటే నీకు కూడా ఆకలేస్తుందా?" అని అడిగాడు. ఆమె వెంటనే "ఆ అవును బిగ్ బాస్" అని చెప్పగా.. "అయితే చూసి ఆనందించండి" అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. అయితే సోనియా, నబిల్ ఆ బిర్యానీని తినలేక అవస్థలు పడుతుంటే వాళ్ల వాళ్ళ క్లాన్ లో నుంచి మరొకరి హెల్ప్ తీసుకోమన్నారు. చివరగా యష్మి గౌడ గురించి నిఖిల్ మాట్లాడుతుండగా సడన్ గా ఆమె ఎంట్రీ ఇవ్వడంతో ప్రోమోను ఎండ్ చేశారు బిగ్ బాస్.

read also : బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లిస్ట్.. ఆ నలుగురు కన్ఫామ్ అట 

టాప్ హెడ్ లైన్స్

Kadali Satyanarayana: బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!
బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
Patas Hari: పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Embed widget