అన్వేషించండి

Bigg Boss 8 Day 12 Promo 3: నాన్నకు ప్రేమతో, మీరు నాన్న అయితే తప్ప తెలియని ఫీలింగ్... ప్రోమో 3 ఎమోషనల్ రోలర్ కోస్టర్

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈరోజు 12వ ఎపిసోడ్ కు సంబంధించిన 3వ ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమో తండ్రి సెంటిమెంట్ తో ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ఉంది. ఈ ప్రోమో విశేషాలు ఏంటో చూసేద్దాం పదండి.

'బిగ్ బాస్ సీజన్ 8'లో ఈ రోజు 12వ ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే అంత కంటే ముందే 'బిగ్ బాస్' వరుసగా ప్రోమోలను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తున్నారు. నిన్న మొన్నటిదాకా ఏంటి ఈ రోత అనిపించగా, ఈ రోజు ఉదయం నుంచి బిగ్ బాస్ రిలీజ్ చేసిన మూడు ప్రోమోలను చూస్తే తాజా ఎపిసోడ్ పై క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఎమోషనల్ సర్ప్రైజ్ అంటూ హౌస్ మేట్స్ తో పాటు షో చూస్తున్న వాళ్ళను కూడా ఏడిపించే విధంగా 12వ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారు బిగ్ బాస్. ఇక తాజాగా బిగ్ బాస్ ప్రోమో 3ని రిలీజ్ చేయగా,  అందులో హౌస్ మేట్స్ అందరూ తండ్రి సెంటిమెంట్ తో ఏడ్చి మనసుని కదిలించారు. 

ఎమోషనల్ అవుతున్న కంటెస్టెంట్స్ 
ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ చాలా త్వరగా ఎమోషనల్ అవుతున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా ఏడుస్తున్నారు. ఇక మొదటి నుంచి ఈ సీజన్ డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పుకొచ్చిన బిగ్ బాస్ సైతం ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో ట్విస్ట్ ఇస్తున్నారు. ఈసారి రెండవ వారమే ఫ్యామిలీ ఎమోషన్ ను వాడి, ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసే ప్లాన్ చేశారు బిగ్ బాస్. అందులో భాగంగా ఎమోషనల్ సర్ప్రైజ్ అంటూ ప్రతి ఒక్కరి ఇంటి నుంచి వాళ్లకు చిరస్మరణీయంగా ఉండే మెమోరీస్ ని తెప్పించారు. అయితే హౌస్ మేట్స్ లో 5 మందికి మాత్రమే ఇంటి నుంచి వచ్చిన గిఫ్ట్ లను తీసుకునే అవకాశం ఉందని, ఆ ఐదుగురు ఎవరు అనే విషయాన్ని హౌస్ మేట్స్ నిర్ణయించాలని ప్రకటించారు. అందులో భాగంగా ఇద్దరిద్దరు కంటెస్టెంట్స్ వచ్చి హౌస్ మేట్స్ కు తమ బాధను చెప్పుకుని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఎపిసోడ్ ప్రోమోలో ఎవరెవరు ఏమేం రీజన్స్ చెప్పి హౌస్ మేట్స్ మనసును గెలుచుకున్నారు అనే విషయాన్ని చూపించారు.

Also Read: ఎన్టీఆర్ కు రవి బస్రూర్ అదిరిపోయే మ్యూజికల్ గిఫ్ట్, ‘దేవర’ రిలీజ్ కు ముందు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

అయితే ఈ మూడవ ప్రోమోలో ఎక్కువగా తండ్రి సెంటిమెంట్ కనిపించింది. ప్రోమో పరంగా ముందుగా శేఖర్ భాష, సోనియా మొదలుపెట్టారు. శేఖర్ భాషకు కుక్కపిల్ల ఫోటో రాగా, సోనియా తను వస్తువుల కంటే మనుషులకే వాల్యూ ఇస్తానని చెప్పింది. అయితే వీరిద్దరిలో తన ఓటు సోనియాకే వేస్తూ తామిద్దరం మరింత దగ్గర కావాలని కోరుకున్నాడు అభయ్. మణికంఠ సింపతి కార్డు కోసం అయితే తనకు అస్సలు ఓటు వేయొద్దని కోరాడు. ఆదిత్య ఓం తనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ తానే నేర్చుకున్నానని, గుడ్ క్వాలిటీస్ మాత్రం తన తండ్రి నుంచి వచ్చినవని చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో కరిగిపోయిన ప్రేరణ ఆయనకే సపోర్ట్ చేసింది. ఆ తర్వాత నబిల్, పృథ్వీ రాగా.. నబిల్ ఇది మా నాన్నతో లాస్ట్ ఫోటో, కోవిడ్ వల్ల ఆయన చనిపోయాడని చెప్పారు. ఇక పృథ్వీ కూడా తన తండ్రి సెంటిమెంట్ ను బయట పెడుతూ తను చివరగా మాట్లాడింది ఆగస్టు 15, అదేరోజు మా నాన్న చనిపోయాడు అంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే నబిల్ కి ఉన్న చివరి ఫోటో ఇదే అంటూ అందరూ అతనికే సపోర్ట్ చేశారు. ఇక శేఖర్ భాష "నాన్నకు మనం అంటే ఎంత ఇష్టమో చాలామందికి తెలియదు. మీరు నాన్న అయితే తప్ప.. మనం వాళ్ళని ఎత్తుకొని ఆడించేటప్పుడు తెలుస్తుంది" అంటూ కంటతడి పెట్టుకున్నారు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ఉండబోతుందని అర్థమవుతుంది.

Read Also: Citadel Diana OTT Release Date: ఓటీటీలోకి ఫ్యూచరిస్టిక్ స్పై థ్రిల్లర్ 'సిటాడెల్ డయానా' - ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతోందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
Safest Cars: ఇండియాలో సేఫెస్ట్ కార్లు ఇవే - టాటా పంచ్ నుంచి ఎక్స్‌యూవీ700 వరకు!
ఇండియాలో సేఫెస్ట్ కార్లు ఇవే - టాటా పంచ్ నుంచి ఎక్స్‌యూవీ700 వరకు!
TDP: గొడ్డలి వేటు పడినా పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా విధులు - పల్నాడు కార్యకర్తకు పదవి ఇచ్చిన టీడీపీ
గొడ్డలి వేటు పడినా పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా విధులు - పల్నాడు కార్యకర్తకు పదవి ఇచ్చిన టీడీపీ
TG Praja Vijayotsavalu: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాది! - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాది! - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
CM Chandrababu: తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి కమిటీ - త్వరలోనే శుభవార్త చెబుతానంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి కమిటీ - త్వరలోనే శుభవార్త చెబుతానంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget