అన్వేషించండి

Bigg Boss 8 Elimination: నాలుగవ వారం హౌస్ నుంచి సోనియా అవుట్- కొంప ముంచిన నిఖిల్, పృథ్వి ఫ్రెండ్షిప్ 

Bigg Boss Telugu 8 Elimination: బిగ్ బాస్ 8 తెలుగు రియాలిటీ షోలో 4వ వారం నామినేషన్లలో సోనియా ఎలిమినేట్ అయ్యింది. దీంతో హౌస్ లో నిఖిల్, పృథ్వీ లతో కలిసి ఆడిన ఆమె గేమ్ బెడిసికొట్టినట్టు అయ్యింది.

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 ఈసారి 14 మంది కంటెస్టెంట్లతో మొదలైంది. ప్రస్తుతం నాలుగో వారం చివరికి రాగా, మొదటి మూడు వారాల్లో వరుసగా బెజవాడ బేబక్క, శేఖర్ భాష, అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు. తాజాగా నాలుగో వారం నామినేషన్లలో మాత్రం ప్రేక్షకులు ఎవరిరైతే బయటకు వెళ్ళిపోవాలనుకున్నారో ఆమె ఎలిమినేట్ కావడం విశేషం. 

హౌస్ ఉంచి సోనియా అవుట్ 
ఈ వారం నామినేషన్ లో ఆరుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. సోనియా, ఆదిత్య ఓం, పృథ్వీ శెట్టి, నబిల్, ప్రేరణ కంబం, నాగ మణికంఠ నామినేషన్లలో ఉన్నారు. అయితే వీరందరిలోనూ సోనియా, ఆదిత్య, పృథ్వి కి తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉండగా, అందరికంటే తక్కువగా ఓట్లు వచ్చిన సోనియా తాజాగా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా, ఆదివారం ఎపిసోడ్లో సోనియాను నాగార్జున ఎలిమినేట్ చేసి బయటకు పంపబోతున్నారు. ఈ విషయం తెలిసిన చాలా మంది సోనియా ఎలిమినేట్ అవ్వడం పట్ల హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హౌస్ లో ఉన్నంత కాలం ఆమె సరిగ్గా గేమ్ ఆడలేదని, ఎప్పుడు చూసినా సోనియా ఫోకస్ అంతా నిఖిల్, పృథ్వీల పైనే ఉంటుందని ఇప్పటికే భారీ ఎత్తున కామెంట్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. హౌస్ లోపల ఏం జరుగుతుందో తెలియదు కానీ బయటకు వచ్చే ఫుటేజ్ వల్ల ఆమెకు సపోర్ట్ చేసే వారి కంటే నెగిటివ్ ఎక్కువగా పెరిగిపోయింది. 

Read Also : Game Changer Second Single Promo : కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   

కొంప ముంచిన గ్రూప్ గేమ్ 
ఈవారం నామినేషన్లలో సోనియా నామినేట్ అవ్వడానికి ముఖ్యమైన కారణం గ్రూప్ గేమ్. అంతకంటే ముందు నుంచే సోనియా నిఖిల్, పృథ్వీ లతో క్లోజ్ గా ఉండడం అనేది బయటకు ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా పోర్ట్రైట్ అవుతూ వచ్చింది. కానీ బయట మాత్రం ఆమె సన్నిహితులు సోనియా ఇద్దరిని అన్నదమ్ములుగా భావిస్తోంది అంటూ సమర్ధించారు. ప్రేక్షకులు మాత్రం సోనియా వారి పట్ల వ్యవహరిస్తున్న తీరును చూసి ఆ స్టేట్మెంట్ ను జీర్ణించుకోలేకపోయారు. అంతేకాకుండా సోనియా వల్ల పృథ్వి, నిఖిల్ ల గేమ్ పై ఎఫెక్ట్ పడుతుందని హౌస్ మేట్స్ తో పాటు చాలామంది ప్రేక్షకులు ఫీలయ్యారు. సోనియా..  నిఖిల్, పృథ్విలను తన కనుసన్నలో ఆడిస్తోందని, ఈవారం ఎలాగైనా ఆమెను బయటకు పంపాలని కంకణం కట్టుకున్నట్టున్నారు ప్రేక్షకులు.

నిజానికి సోనియాకు బయట బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్న విషయాన్ని నాగర్జున బయట పెట్టినప్పటికీ, హౌస్ లో ఆ ఇద్దరితో ఆమె ప్రవర్తన దారుణంగా ఉందంటూ చెడుగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు జనాలు. ముఖ్యంగా నిఖిల్ ని ఎమోషనల్ ఫూల్ ను చేసి ఆడుకుంటుంది అంటూ కామెంట్స్ వినిపించాయి. ఇక వీళ్ళ మధ్య జరిగే హగ్గుల రచ్చ ప్రేక్షకులను విపరీతంగా చికాకు పెట్టింది. ఫలితంగా రామ్ గోపాల్ వర్మ వంటి కాంట్రవర్షియల్ డైరెక్టర్ సపోర్టు ఉన్నప్పటికీ ఈ బ్యూటీ నాల్గవ వారమే హౌస్ నుంచి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఇప్పటికైనా పృథ్వి, నిఖిల్ తమ గేమ్ తాము ఆడతారా? అన్నది చూడాలి.

Also Read: 'లవ్ సితార' రివ్యూ: శోభితా ధూళిపాళ పెళ్లి సినిమా - Zee5 OTTలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Viral News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం- బీటెక్ స్టూడెంట్, వివాహిత అఫైర్-  భార్య ఎదుటే ప్రియుడ్ని చితక్కొట్టారు!
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం- బీటెక్ స్టూడెంట్, వివాహిత అఫైర్- భార్య ఎదుటే ప్రియుడ్ని చితక్కొట్టారు!
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Embed widget