అన్వేషించండి

Game Changer Second Single Promo : కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   

'గేమ్ ఛేంజర్' నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సెకండ్ సింగిల్ 'రా మచ్చా మచ్చా' ప్రోమో తాజాగా వచ్చేసింది. మరి ప్రోమో ఎలా ఉందో చూసేద్దాం పదండి.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటింగ్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'గేమ్ ఛేంజర్' నుంచి రెండవ సాంగ్ తాజాగా రిలీజ్ అయ్యింది. మరి ఈ సాంగ్ ప్రోమో ఎలా ఉంది? 'రా మచ్చా' సాంగ్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

మాస్ బీట్ తో అదిరిపోయిన 'రా మచ్చా మచ్చా' ప్రోమో    

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ల పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. 2024 క్రిస్మస్ సందర్భంగా 'గేమ్ ఛేంజర్' మూవీని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ మూవీ అప్డేట్స్ కోసం మెగా ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత రెండు రోజుల నుంచి 'గేమ్ ఛేంజర్' మూవీలో నుంచి సెకండ్ సాంగ్ 'రా మచ్చా మచ్చా' రిలీజ్ కాబోతోంది అంటూ ఊరిస్తూ వస్తున్నారు మేకర్స్. ఎట్టకేలకు ఆ పాట ప్రోమో వచ్చేసింది.

'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమోను చూశాక, ఇదే ఈ రేంజ్ లో కిక్ ఇస్తే యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఇచ్చిన మాస్ బీట్ ఉన్న ఈ అదిరిపోయే సాంగ్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఈ పాటకు అనంత్  శ్రీరామ్ లిరిక్స్ రాయగా, గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించారు. ఇప్పటికే డైరెక్టర్ శంకర్ ఈ పాటలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులను, వారి సాంప్రదాయ నృత్యాలను ఇందులో భాగం చేశామంటూ పాటపై అంచనాలను పెంచేశారు. అంతేకాకుండా ఏకంగా ఇండియాలోని 1000 మందికి పైగా జానపద కళాకారులతో ఈ పాటను చిత్రీకరించారన్న వార్త సంచలనంగా మారింది. శంకర్ ఇచ్చిన హింట్ ప్రకారం చూస్తే థియేటర్లలో ఈ సెకండ్ సింగిల్ చెర్రీ ఫ్యాన్స్ కు మంచి మాస్ మ్యూజికల్ ఐ ఫీస్ట్ అవుతుందని అని చెప్పొచ్చు.  

Read Also : Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 

నెవర్ బిఫోర్ ఇంట్రో 

ఇక సినిమాలో ఇది హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అని ఇప్పటికే డైరెక్టర్ శంకర్ హింట్ ఇచ్చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రోమోను చూస్తుంటే ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 'గేమ్ ఛేంజర్'లో చెర్రీ ఇంట్రడక్షన్ ఉండబోతోందని, ఎప్పటిలాగే తమన్ మ్యూజిక్ అదరగొట్టేసాడు అనిపిస్తుంది. ఈ సీన్ కు థియేటర్లు దద్దరిల్లడం పక్కా రాసి పెట్టుకోండి అంటున్నారు మెగా ఫాన్స్. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన 'జరగండి జరగండి' పాటకు మిక్స్డ్ టాక్ వచ్చింది. భారీ హైప్ తో వచ్చిన ఈ పాట ఫర్వాలేదు అన్న దగ్గరే ఆగిపోయింది. మరి 'రా మచ్చా' సాంగ్ ఆకాశాన్నంటిన మెగా అభిమానుల అంచనాలను అందుకుంటుందా ? అంటే కంప్లీట్ సాంగ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Read Also : Bigg Boss 8 Nominations: షాకింగ్ ఓటింగ్ రిజల్ట్స్... ఈ వీక్ కూడా బయటకు వెళ్ళేది అబ్బాయే - డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
DC Movie OTT : ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
Irumudi Trailer : ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget