అన్వేషించండి

Bigg Boss 8 Nominations: షాకింగ్ ఓటింగ్ రిజల్ట్స్... ఈ వీక్ కూడా బయటకు వెళ్ళేది అబ్బాయే - డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ లో ఉన్న హౌస్ మేట్స్ కు వస్తున్న ఓటింగ్ రిజల్ట్ షాక్ ఇచ్చేలా ఉంది. గత రెండు వారాల్లో జరిగినట్టుగానే ఈ వారం అబ్బాయి ఎలిమినేట్ కాబోతున్నాడని తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 8 నాలుగవ వారం దగ్గర పడడంతో ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్ళబోతున్నారు అన్న విషయం ఆసక్తికరంగా మారింది. మరి ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లబోయేది ఎవరు? ఓటింగ్ రిజల్ట్స్ ఏంటి? డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి. 

మారుతున్న ఓటింగ్ రిజల్ట్స్ 
ఈ వారం నామినేషన్లలో ఆరుగురు సభ్యులు ఉన్న విషయం తెలిసిందే. అందులో నబిల్, సోనియా, ప్రేరణ కంబం, ఆదిత్య ఓం, పృథ్వీ రాజ్, నాగ మణికంఠ, నైనిక ఉన్నారు. ఇక ఈ వారం నామినేషన్లలో ఉన్నవారిలో హయ్యెస్ట్ ఓటింగ్ ఉన్నది ఓరుగల్లు పోరడు నబిల్ అఫ్రిదికే. నెగెటివిటీ లేకపోవడంతో ఇతనికి ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో పాటు ఓటింగ్ కూడా బాగానే పడుతుంది. సోనియాతో ఈ వారం నామినేషన్లలో అతను వేసిన వెకిలి చేష్టలను జనాలు పెద్దగా పట్టించుకున్నట్టుగా అనిపించట్లేదు. ఏదేమైనా మొదటి వారం నుంచి సైలెంట్ గా ఉంటూ వచ్చిన నబిల్ ఇప్పుడు మాత్రం నెంబర్ వన్ ప్లేస్ లోకి దూసుకెళ్లడం విశేషం. అతని ఆట తీరు ఇలాగే కంటిన్యూ అయితే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లిస్టులో నబిల్ పేరు కూడా ఉంటుంది. అంతేకాకుండా నబిల్ ప్రతిరోజూ టాస్క్ లలో పాల్గొంటున్నాడు. ఇక నామినేషన్స్ లో టాప్ లిస్ట్ లో ఉన్న వారి గురించి చెప్పుకోవాల్సి వస్తే మొన్నటిదాకా పృథ్వీరాజ్ పేరు కనిపించింది. అతనితో పాటు ఆదిత్య ఓం, సోనియా కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం పృథ్వీరాజ్ ను దాటుకుని వెళ్లి ఆదిత్య నాలుగో పొజిషన్లో ఉన్నాడు. అతను డౌన్ టు ఎర్త్ ఉండడం వల్లనే ఈ రేంజ్ లో ఓటింగ్ పడుతోందని కొంతమంది అంటుంటే, మరి కొంతమంది మాత్రం ఇది అసలు రియల్ ఓటింగ్ కాదు, రియల్ ఓటింగ్ లో ఆయన లీస్ట్ లో ఉన్నారని చెబుతున్నారు.

ఇక లీస్ట్ లో ఉన్నవారిలో పృథ్వీరాజ్ గురించి మాట్లాడుకుంటే అతను ఈ వీక్ ఎలిమినేషన్ లో బయటకు వెళ్లే ఛాన్స్ లేదు. ఎందుకంటే పృథ్వీరాజ్ ఫుటేజ్ పెరగడంతో పాటు అతను ప్రతి టాస్క్ లోనూ టఫ్ పోటీని ఇస్తున్నాడు. డబుల్ ఎలిమినేషన్ ఉన్నప్పటికీ పృథ్వీరాజ్ డేంజర్ జోన్ లోనే ఉంటాడు గానీ బయటకు మాత్రం వెళ్లే ఛాన్స్ లేదు. ఇక సోనియా విషయానికి వస్తే ఆమెకు బయట ఓ రేంజ్ లో పబ్లిసిటీ జరుగుతుంది. ఓవైపు ఆర్జివీ సపోర్ట్ చేస్తుంటే, మరోవైపు ఆమె అభిమానులు భారీ ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు. పైగా టాస్క్ లలో కూడా ఆమె బాగానే పర్ఫార్మ్ చేస్తోంది. కాబట్టి కొంతవరకు ఆమె సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే అనఫీషియల్ పోల్స్ లో ఆమె టాప్ ప్లేస్ లో ఉన్నప్పటికీ, అఫిషియల్ గా చూసుకుంటే సోనియా డేంజర్ జోన్ లో ఉన్నట్టే. సెకండ్ పొజిషన్లో ప్రేరణ, మణికంఠ మూడో స్థానంలో ఉన్నాడు. 

Read Also : Bigg Boss 8 Latest Promo : జెన్యూన్ గా ప్రేమిస్తున్న విష్ణు ప్రియ - వాడుకుంటున్న పృథ్వీ... జెలసీగా ఫీల్ అయ్యేది ఎవరు ?

డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? 
ఇదిలా ఉంటే ప్రస్తుతం డేంజర్ జోన్లో ఉన్న నెంబర్ వన్ కంటెస్టెంట్ ఆదిత్య. ఈ వారం ఆయన కచ్చితంగా బయటకు వెళ్తారు అని టాక్ నడుస్తోంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఆయనతో పాటు సోనియా కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ చెప్పిన మాటను గుర్తు చేసుకోవాలి. ఎన్ని టాస్కులు గెలిస్తే అన్ని వైల్డ్ కార్డులు తగ్గించవచ్చు అని బిగ్ బాస్ చెప్పారు. టాస్క్ లో ఫెయిల్ అయితే గనక ఎక్కువ మంది వైల్డ్ కార్డు ఎంట్రీలు రావడంతో పాటు మీలో కొందరు బయటకు వెళ్లే ప్రమాదం కూడా ఉందని ముందే బిగ్ బాస్ హెచ్చరించారు. అయితే బిగ్ బాస్ చెప్పిందాని ప్రకారం చూసుకుంటే హౌస్ లో ఎంతమంది ఉన్నారో, అంతమంది అడుగు పెట్టే ఛాన్స్ ఉంది. ఎలా చూసుకున్నా గాని ఈ వారం, నెక్స్ట్ వారం మాత్రమే డబుల్ ఎలిమినేషన్ కి స్కోప్ ఉంటుంది. ఈ వారంలో ఒక్కరే బయటకెళ్తే నెక్స్ట్ వారం ఇద్దరు వెళ్లాల్సి వస్తుంది. రెండు వారాల్లో ముగ్గురు లేదా నలుగురు ఎలిమినే ద్వారా బయటికి వెళ్లి ఛాన్స్ ఉంది. ప్రస్తుతం హౌస్ లో 11 మంది ఉన్నారు కాబట్టి అందులో ముగ్గురిని బయట పంపి, హౌస్ లో ఉన్న ఎనిమిది మందికి పోటీగా మరో ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీలను దింపే ఛాన్స్ ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Varsha: బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Bigg Boss Telugu Season 10 : బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget