అన్వేషించండి

Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 

Dhoom 4 Update: గత కొన్ని రోజులుగా బాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంచైజీ 'ధూమ్ 4'లో సూర్య నటించబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఇందులో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రకు ఎంపికైనట్టు తెలుస్తోంది.

Ranbir Kapoor: బాలీవుడ్ లోని మోస్ట్ క్రేజియస్ట్ సిరీస్ లలో 'ధూమ్' కూడా ఒకటి. ఈ సినిమాకు హిందీలోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సిరీస్ లలో ఉండే దోపిడీ సీన్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఇక 'ధూమ్' అనగానే గుర్తొచ్చే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సినిమాలోని విలన్. హీరో కంటే ఇందులో విలన్ కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే అందులో నటించే విలన్స్ కి సపరేట్ గా క్రేజ్ ఉంటుంది. అయితే తాజాగా ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి పాన్ ఇండియా స్టార్ రణబీర్ కపూర్ రెడీ అయ్యారని, ఆయన 'ధూమ్' సిరీస్ లో అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది.

విలన్ గా మారనున్న రణబీర్ కపూర్ 

బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధూమ్' బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీలో ఇప్పటిదాకా మూడు సినిమాలు వచ్చాయి. అయితే ఇందులో మొదటి రెండు పార్ట్స్ సూపర్ డూపర్ హిట్స్ గా నిలవగా, మూడో భాగం మాత్రం పర్వాలేదు అనిపించింది. ఇక నాలుగో పార్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని 'ధూమ్' లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇందులో నటించబోయే స్టార్స్ వీళ్లేనంటూ గత కొన్ని రోజులుగా పలువురు స్టార్ హీరోల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ తాజాగా ఈ మూవీకి సంబంధించిన సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటిదాకా 'ధూమ్ 4' సినిమాలో కోలీవుడ్ స్టార్ సూర్య విలన్ గా నటించబోతున్నాడని వార్తలు వినిపించాయి. కానీ తాజాగా ఆ పుకార్లకు చెక్ పెడుతూ బాలీవుడ్ నుంచి క్రేజీ కాంబో ఈ సినిమాలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో పాటు రణబీర్ కపూర్ విలన్స్ గా నటించబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నిర్మాత ఆదిత్య చోప్రా ఈ ప్రాజెక్టుకు సంబంధించి రణబీర్ కపూర్ తో చర్చలు జరిపారని, ఆయన కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే రణబీర్ అభిమానులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. 'యానిమల్' మూవీ తర్వాత ఈ హీరో చేస్తున్న మరో పవర్ ఫుల్ రోల్ ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. 

Read Also : IIFA Utsavam 2024 Winners List: ఐఫా 2024 విన్నర్స్ లిస్ట్... చిరుకు స్పెషల్, నానికి బెస్ట్ యాక్టర్, బాలయ్యకు ఏ అవార్డు వచ్చిందో తెలుసా?

'ధూమ్ 4' పట్టాలెక్కేది ఎప్పుడంటే ?

'ధూమ్ 4' మూవీ 2026 మొదట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇది రణబీర్ కపూర్ కెరీర్లో 25వ సినిమా కావడం విశేషం. కాగా ఇప్పటిదాకా వచ్చిన 'ధూమ్' సిరీస్లలో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు భాగమయ్యారు. మొదటి పార్ట్ లో జాన్ అబ్రహం విలన్ గా నటించగా, ధూమ్ 2లో హృతిక్ రోషన్ అదరగొట్టాడు. ఈ రెండు పార్ట్స్ లోనూ అభిషేక్ బచ్చన్ పోలీస్ గా నటించారు. మూడో పార్ట్ లో మాత్రం మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించారు. ఇప్పుడు రణబీర్ కపూర్ వంతు వచ్చింది. 

Read Also : Devara Collection Day 1: ఫ్యాన్స్ కాలర్ 'దేవర' ఫస్ట్ డే కలెక్షన్స్...‌ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ', బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'స్త్రీ 2'ను బీట్ చేసిన ఎన్టీఆర్ సినిమా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
BCCI Retainership: బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
JD Vance India Visit: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP DesaAyush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రేVirat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్Rohit Sharma 76* vs CSK IPL 2025 | హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించిన రోహిత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
BCCI Retainership: బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
JD Vance India Visit: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
Dhanush D56 Movie: మరోసారి సూపర్ హిట్ కాంబో రిపీట్ - ధనుష్ కొత్త సినిమాకు రెహమాన్ మ్యూజిక్!
మరోసారి సూపర్ హిట్ కాంబో రిపీట్ - ధనుష్ కొత్త సినిమాకు రెహమాన్ మ్యూజిక్!
KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
Aishwaryarai Bachchan: ఐశ్వర్య రాయ్, అభిషేక్, ఆరాధ్య.. క్యూట్ ఫ్యామిలీ - విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టేశారుగా!
ఐశ్వర్య రాయ్, అభిషేక్, ఆరాధ్య.. క్యూట్ ఫ్యామిలీ - విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టేశారుగా!
Embed widget