అన్వేషించండి

IIFA Utsavam 2024 Winners List: ఐఫా 2024 విన్నర్స్ లిస్ట్... చిరుకు స్పెషల్, నానికి బెస్ట్ యాక్టర్, బాలయ్యకు ఏ అవార్డు వచ్చిందో తెలుసా?

మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్న 'ఐఫా 2024' వేడుక అబుదాబిలో సెప్టెంబర్ 27న స్టార్ట్ అయ్యింది. మొదటి రోజు ఈ ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న స్టార్స్ ఎవరో తెలుసుకుందాం పదండి.

అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ (IIFA) అవార్డ్స్ 24వ ఎడిషన్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వంటి దక్షిణాది చలనచిత్ర పరిశ్రమల నుంచి పలువు స్టార్స్ అవార్డులు అందుకోబోతున్న ఐఫా ఉత్సవం మూడు రోజుల పాటు కన్నుల పండుగగా జరగబోతోంది. 

మెగాస్టార్ కి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ హానర్ 
అబుదాబిలో సెప్టెంబర్ 27న బాలీవుడ్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలకు చెందిన దిగ్గజ నటీనటులందరినీ ఒకే తాటిపైకి తీసుకువస్తూ ఐఫా ఉత్సవం మొదటి రోజు అత్యద్భుతంగా జరిగింది. ఇక ఈ వేడుకలో పలువురు నటీనటులు, టెక్నీషియన్లకు అవార్డులను అందజేశారు. అలాగే భారతీయ సినిమా చరిత్రలో అత్యుత్తమ విజయాన్ని సాధించిన మెగాస్టార్ చిరంజీవిని బెస్ట్ అచీవ్‌మెంట్ ఫర్ ఇండియన్ సినిమా అవార్డుతో ఘనంగా సత్కరించారు. ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ, ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్‌లు ఆయనను సన్మానించారు. అంతేకాకుండా ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డును సౌత్ క్వీన్ సమంత రూత్ ప్రభు గెలుచుకోవడం విశేషం. ఈ ఈవెంట్లో మణిరత్నం, ఐశ్వర్యారాయ్ బచ్చన్, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్స్ అందరూ ఒకే ఫ్రేమ్ లో కన్పించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. రెండవ రోజు ఐఫా అవార్డ్స్ నైట్ లో పలువురు బాలీవుడ్ స్టార్స్ ప్రేక్షకులను అలరించునున్నారు. ఇక ఈ వేడుకలో మొదటి రోజు అవార్డులు అందుకున్న సౌత్ స్టార్స్ ఎవరెవరో ఒక లుక్కేద్దాం పదండి.

ఐఫా 2024 అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్ పూర్తి 
ఉత్తమ చిత్రం (తమిళం): జైలర్
ఉత్తమ నటుడు (తెలుగు): నాని (దసరా)
ఉత్తమ నటుడు (తమిళం): విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్: 2 )
ఉత్తమ నటి (తమిళం): ఐశ్వర్య రాయ్ (పొన్నియిన్ సెల్వన్: 2)
ఉత్తమ దర్శకుడు (తమిళం): మణిరత్నం (పొన్నియిన్ సెల్వన్: 2)
ఉత్తమ దర్శకుడు (తెలుగు): అనిల్ రావిపూడి (భగవంత్ కేసరి)
ఉత్తమ సంగీత దర్శకత్వం (తమిళం): , ఏఆర్ రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్: 2)
బెస్ట్ అచీవ్‌మెంట్ ఫర్ ఇండియన్ సినిమా : చిరంజీవి
భారతీయ సినిమాకు అత్యుత్తమ సహకారం : ప్రియదర్శన్
ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఇన్ ఇండియన్ సినిమా : సమంత రూత్ ప్రభు
బెస్ట్ విలన్ (తమిళం) : ఎస్జె స్సూర్య (మార్క్ ఆంటోని)
బెస్ట్ విలన్ (తెలుగు): షైన్ టామ్ చాకో (దసరా)
బెస్ట్ విలన్ (మలయాళం): అర్జున్ రాధాకృష్ణన్ (కన్నూర్ స్క్వాడ్)
బెస్ట్ సపోర్టింగ్ రోల్ - మేల్ (తమిళం): జయరామ్ (పొన్నియిన్ సెల్వన్: 2)
బెస్ట్ సపోర్టింగ్ రోల్ - ఫిమేల్ (తమిళం): సహస్ర శ్రీ (చిత్త)
గోల్డెన్ లెగసీ అవార్డు: నందమూరి బాలకృష్ణ
కన్నడ సినిమాలో అత్యుత్తమ ప్రతిభ (అవుట్ స్టాండింగ్ ఎక్సలెన్స్): రిషబ్ శెట్టి
బెస్ట్ డెబ్యూ (మహిళ - కన్నడ): ఆరాధనా రామ్ (కాటెరా) 

Also Readతెలుగు రాష్ట్రాల్లో 'దేవర'కు ఫస్ట్ డే ఏ ఏరియాలో ఎన్ని కోట్ల షేర్‌ వచ్చిందో తెలుసా?

ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు లెజెండ్స్ 
ఇక ఐఫా వేదికపై ముగ్గురు టాలీవుడ్ లెజెండ్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఒకే ఫ్రేమ్ లో కన్పించి, అభిమానులకు ఐ ఫీస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా రెండో రోజు ఐఫా వేడుకల్లో ప్రేక్షకులను అలరించడానికి షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్, కరణ్ జోహార్ వంటి హిందీ తారలు వేదికపైకి రానున్నారు. సీనియర్ నటి రేఖ చాలా కాలం తర్వాత ఐఫా వేదికపై ప్రదర్శన ఇవ్వనుంది. ఆమె 150 మంది డ్యాన్సర్లతో 22 నిమిషాల పాటు ప్రదర్శన ఇవ్వనున్నట్లు సమాచారం. 

Read Also : Devara Collection Day 1: ఫ్యాన్స్ కాలర్ 'దేవర' ఫస్ట్ డే కలెక్షన్స్...‌ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ', బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'స్త్రీ 2'ను బీట్ చేసిన ఎన్టీఆర్ సినిమా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
BRS Chief KTR: బీఆర్ఎస్ తదుపరి సుప్రీం కేటీఆరేనా ? మరి హరీశ్ రావు పాత్ర ఏంటి?
బీఆర్ఎస్ తదుపరి సుప్రీం కేటీఆరేనా ? మరి హరీశ్ రావు పాత్ర ఏంటి?
TGSRTC Special Buses: కురుమూర్తి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, టికెట్ బుకింగ్స్ ఇలా
కురుమూర్తి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, టికెట్ బుకింగ్స్ ఇలా
Free Gas Cylinder Scheme: శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లుకేబీఆర్ పార్క్ వద్ద పోర్షే కార్ బీభత్సంLSG Released KL Rahul Retention Players | కెప్టెన్ కేఎల్ రాహుల్ ను వదిలేసిన లక్నో సూపర్ జెయింట్స్ | ABP DesamDC Release Rishabh Pant IPL 2025 Retention | పోరాట యోధుడిని వదిలేసుకున్న ఢిల్లీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
BRS Chief KTR: బీఆర్ఎస్ తదుపరి సుప్రీం కేటీఆరేనా ? మరి హరీశ్ రావు పాత్ర ఏంటి?
బీఆర్ఎస్ తదుపరి సుప్రీం కేటీఆరేనా ? మరి హరీశ్ రావు పాత్ర ఏంటి?
TGSRTC Special Buses: కురుమూర్తి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, టికెట్ బుకింగ్స్ ఇలా
కురుమూర్తి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, టికెట్ బుకింగ్స్ ఇలా
Free Gas Cylinder Scheme: శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
Singham Again Review - 'సింగం ఎగైన్' రివ్యూ: ఇది పోలీస్ స్టోరీ కాదు... రోహిత్ శెట్టి రామాయణం - సినిమాగా ఎలా ఉందంటే?
'సింగం ఎగైన్' రివ్యూ: ఇది పోలీస్ స్టోరీ కాదు... రోహిత్ శెట్టి రామాయణం - సినిమాగా ఎలా ఉందంటే?
Liquor Price Hike: తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్! త్వరలో మద్యం ధరల పెంపు
తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్! త్వరలో మద్యం ధరల పెంపు
Bhool Bhulaiyaa 3 Review: భూల్ భులయ్యా 3 రివ్యూ: హిందీ ‘చంద్రముఖి’ సిరీస్‌లో మూడో పార్ట్ - ఎలా ఉంది?
భూల్ భులయ్యా 3 రివ్యూ: హిందీ ‘చంద్రముఖి’ సిరీస్‌లో మూడో పార్ట్ - ఎలా ఉంది?
KTR Padayatra: తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర- కార్యకర్తల ఆకాంక్షల మేరకు కీలక నిర్ణయం 
తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర- కార్యకర్తల ఆకాంక్షల మేరకు కీలక నిర్ణయం 
Embed widget