అన్వేషించండి

Devara Collection Day 1: ఫ్యాన్స్ కాలర్ 'దేవర' ఫస్ట్ డే కలెక్షన్స్...‌ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ', బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'స్త్రీ 2'ను బీట్ చేసిన ఎన్టీఆర్ సినిమా

Devara First Day Collection: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'దేవర' ఫస్ట్ డే కలెక్షన్స్ ఉన్నాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?

అభిమానులు కాలర్ ఎగరేసేలా 'దేవర పార్ట్ 1' (Devara Part 1) ఉంటుందని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ సినిమా మాత్రమే కాదు... బాక్సాఫీస్ బరిలో కలెక్షన్లు కూడా అభిమానులు కాలర్ ఎగరేసేలా ఉన్నాయి. ఫస్ట్ డే 'దేవర' సినిమా భారీ ఓపెనింగ్ సాధించింది. ఈ సినిమా ఓపెనింగ్ డే ఎన్ని కోట్ల కలెక్ట్ చేసిందో తెలుసా? 

'దేవర' ఫస్ట్ డే బాక్సాఫీస్ @ 172 కోట్లు!
అక్షరాల నూట డబ్బె రెండు కోట్ల రూపాయలు... బాక్స్ ఆఫీస్ బరిలో దేవర మొదటి రోజు రాబట్టిన వసూళ్ల మొత్తం! దేవర సినిమా ఓపెనింగ్ డే 172 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Also Read: దేవర రివ్యూ: ఎన్టీఆర్‌కు 'ఆర్ఆర్ఆర్' రేంజ్ హిట్ వస్తుందా? కొరటాల శివ తీసిన సినిమా ఎలా ఉందంటే?

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'స్త్రీ 2' కంటే ఎక్కువ!
బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు అక్కడ ట్రేడ్ వర్గాలను సైతం ఎన్టీఆర్ 'దేవర' సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఆశ్చర్యపరిచాయి. బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ 2024 శ్రద్ధ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన 'స్త్రీ 2' కంటే 'దేవర' సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ ఎక్కువ. హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'స్త్రీ 2' ఇండియాలో తొలి రోజు 54 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎన్టీఆర్ సినిమా సుమారు 90 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.

ఇండియా వైడ్ 'కల్కి' కంటే తక్కువ...
కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ!
ఇండియా వైడ్ కంపేర్ చేస్తే... 'కల్కి 2898 ఏడీ' కంటే కాస్త వెనుక బడింది 'దేవర'. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన 'కల్కి 2898 ఏడీ' ఓపెనింగ్ డే ఇండియాలో 95 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దాని కంటే ఐదు కోట్లు తక్కువగా... 90 కోట్ల గ్రాస్ రాబట్టింది దేవర. అయితే... తెలుగు రాష్ట్రాలలో 'దేవర'కు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఇక్కడ 'కల్కి 2898 ఏడీ'ని బీట్ చేసింది.  

తెలుగులో 'కల్కి 2898 ఏడీ' సుమారు 45 కోట్ల రూపాయల షేర్ రాబడితే... దానికి ముందు 'సలార్' 50.50 కోట్ల రూపాయల షేర్ రాబట్టి... తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో హైయెస్ట్ షేర్ రాబట్టిన సినిమాల జాబితాలో నిన్నటి వరకు రెండు, మూడవ స్థానాలలో ఉన్నాయి. ఆ రెండిటిని ఎన్టీఆర్ 'దేవర' సినిమా వెనక్కి నెట్టింది. 

'దేవర'కు తెలుగు రాష్ట్రాలలో 54 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. దాని కంటే ముందు ఎన్టీఆర్ ఓ హీరోగా నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా మాత్రమే ఉంది. ఆ సినిమాకు తెలుగు రాష్ట్రాలలో 74 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

Also Readతెలుగు రాష్ట్రాల్లో 'దేవర'కు ఫస్ట్ డే ఏ ఏరియాలో ఎన్ని కోట్ల షేర్‌ వచ్చిందో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Benefit Shows Cancelled In Telangana: ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
Srikakulam Latest News:కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్‌- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు
కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్‌- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలుఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీసంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Benefit Shows Cancelled In Telangana: ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
Srikakulam Latest News:కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్‌- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు
కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్‌- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు
Devendra Fadnavis First Interview: హిందుత్వ అజెండాతోనే బీజేపీ గెలిచిందా? మొదటి ఇంటర్వ్యూలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఏం చెప్పారు?
హిందుత్వ అజెండాతోనే బీజేపీ గెలిచిందా? మొదటి ఇంటర్వ్యూలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఏం చెప్పారు?
పార్లమెంట్‌లో రామ్మోహన్ నాయుడు -  సుధామూర్తి ఇంట్రస్టింగ్ సీన్
పార్లమెంట్‌లో రామ్మోహన్ నాయుడు - సుధామూర్తి ఇంట్రస్టింగ్ సీన్
Rashmika Mandanna : దేవరకొండ ఫ్యామిలీతో మూవీకి వెళ్ళిన రష్మిక... కోడలిగా ఫిక్స్ అయిపోయారా?
దేవరకొండ ఫ్యామిలీతో మూవీకి వెళ్ళిన రష్మిక... కోడలిగా ఫిక్స్ అయిపోయారా?
Allu Arjun: అల్లు అర్జున్‌కు మళ్లీ నేషనల్ అవార్డు... 'పుష్ప 2'కు వచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
అల్లు అర్జున్‌కు మళ్లీ నేషనల్ అవార్డు... 'పుష్ప 2'కు వచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
Embed widget