News
News
X

Bigg Boss 6 Telugu: బీబీ హోటల్‌లో గొడవలు మొదలు, బాత్రూమ్‌లు వాడడానికి వీల్లేదు

Bigg Boss 6 Telugu: బీబీ హోటల్ టాస్కు ప్రస్తుతం హౌస్ లో సాగుతోంది.

FOLLOW US: 

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్ల టాస్కు నడుస్తోంది. అదే హోటల్ వర్సెస్ హోటల్. బీబీ హోటల్, దానికి పోటీగా గ్లామ్ ప్యారడైజ్ హోటల్స్ ను ఇచ్చారు బిగ్‌బాస్. ఇందులో కొంతమంది బీబీ హోటల్ సిబ్బందిగా, అయిదుగురు అమ్మాయిలు గ్లామ్ ప్యారడైజ్ సిబ్బందిగా, మిగతావారు గెస్టులుగా వ్యవహరిస్తారు. గెస్టుల నుంచి వీలైనంతగా డబ్బులు సంపాదించాని హోటల్ సిబ్బంది, వారిచేత తక్కువ డబ్బులకే పనులు చేయించుకోవాలని గెస్టులు ప్రయత్నిస్తారు. ఇక అర్జున్ కళ్యాన్ మాత్రం శ్రీసత్యకు డబ్బులు ఇచ్చేస్తున్నాడు. 

ఇక ప్రోమోలో ఏముందంటే...హోటల్ సిబ్బంది బాత్రూములు వాడాలంటే గెస్టులు అయిదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పారు. రాజశేఖర్ నేను ఆల్రెడీ డీల్ పెట్టుకున్నా అంటూ చెప్పాడు. అయితే రేవంత్ డబ్బులు ఇవ్వకుండా బాత్రూములు వాడడానికి లేదు తేల్చిచెప్పాడు. ఇక శ్రీహాన్ ‘బాత్రూముకు రెండు వందలు ఇస్తా, బాత్రూములు వాడమంటే వాడతా, లేకుండా రేపు సాయంత్రం వరకు ఏమీ తినను, కొనను, వాళ్లకి డబ్బులు రానివ్వను’ అంటూ శపథం చేశాడు. 

ఫైమా వర్సెస్ సుదీప
వీరిద్దరు రెండు హోటల్స్ కు సంబంధించిన మేనేజర్లు కావడంతో వాళ్లిద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. గెస్టులతో డీల్ పెట్టుకున్న విషయంలో ఫైమా చేసిన చిన్న తప్పు అక్కడ గొడవలకు కారణం అయ్యియి. సుదీప ఈ విషయంలో ఫైమాని గట్టిగా నిలదీసింది. అలా డీల్ పెట్టుకోవడం నా తప్పే అంది. ‘ఇక్కడ్నించి మీరెళ్లండి వందసార్లు చెప్పకండి’ అనడంతో సుదీపకు కోపం వచ్చేసింది. 

ఇక పాపం గీతూకు ఆడే స్కోప్ దొరికినట్టు కనిపించలేదు. అయితే మధ్యలో దూరుతూనే ఉంది. చంటి ఏదో అనగానే ‘సోది రూల్స్ తెస్తావు నువ్వు తెలుసా’ అంటూ నోటికి పనిచెప్పింది. 

ఈ సారి నామినేషన్స్ లో ఎక్కువమందే ఉన్నారు. ఆదివారం కీర్తి, అర్జున్ కళ్యాణ్ నేరుగా నామినేట్ అయ్యారు. 
1. సుదీప
2. కీర్తి
3. ఆరోహి
4. గీతూ
5. శ్రీహాన్
6. ఇనయా
7. రాజశేఖర్
8. సూర్య
9. అర్జున్
10. రేవంత్

ఈసారి వాసంతి, కీర్తి, రాజశేఖర్... ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా. బిగ్ బాస్ లో ఏమైనా జరగొచ్చని నేహా ఎలిమినేట్ అయ్యాక అర్థమవుతోంది. కాబట్టి ఈ అంచనా కచ్చితమని కూడా చెప్పలేం. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారో ఈ నాలుగురోజుల్లోని ఆట తేల్చేస్తుంది. గత వారం నేహ ఆట చక్కగా ఆడినా కూడా ఎలిమినేట్ అయ్యింది.

Also read: వైట్ చాక్లెట్ రోజుకో ముక్క తింటే చాలు, జ్ఞాపకశక్తిలో పెరుగుదల

Also read: గర్భిణులు ఆకుకూరలు తింటే శిశువులు ఏడుస్తారు, క్యారెట్లు తింటే నవ్వుతారు, అదిరిపోయే అధ్యయనం

Published at : 28 Sep 2022 12:19 PM (IST) Tags: Bigg Boss 6 Telugu inaya sulthana Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Revnath

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

టాప్ స్టోరీస్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు