(Source: Poll of Polls)
Bigg Boss 5 Telugu: 'నీ సీరియల్ యాక్టింగ్‌లు ఈడ చేయకు..' సిరిపై రవి కామెంట్స్..
ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ కంటిన్యూ అవుతోంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
ఈ వారం 'రాజ్యానికి ఒక్కడే రాజు' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో రవి, సన్నీలు రాకుమారులుగా మారి.. సింహాసనం గెలుచుకోవాలి. హౌస్ మేట్స్ అందరూ ప్రజలుగా ఉంటారు. ఏ రాకుమారుడికైతే ప్రజల మద్దతు దొరుకుతుందో వారే రాజుగా ఎంపికవుతారు. నిన్నటి నుంచి హౌస్ లో ఈ టాస్క్ జరుగుతోంది. ఈరోజు ఎపిసోడ్ లో కూడా టాస్క్ కంటిన్యూ అవ్వనుంది. ఈ క్రమంలో బుధవారం నాడు విడుదల చేసిన ప్రోమో షోపై ఆసక్తిని పెంచుతోంది.
Also Read: ‘మా’ ఎన్నికలు.. దీనికి కూడా బయట వాళ్లు ఎందుకు? దర్శకుడు రవిబాబు కీలక వ్యాఖ్యలు
సిరి-కాజల్ కూర్చొని ఎవరివైపు ఉండాలనే విషయంపై చర్చలు జరుపుతున్నారు. ఎక్కువ మంది రవిని సపోర్ట్చేస్తుండడంతో .. 'నువ్వు నేను సన్నీ వైపు వెళ్తే అతడు గెలుస్తాడు' అంటూ కాజల్.. సిరికి చెబుతోంది. సిరి సపోర్ట్ కోరడానికి వెళ్లిన రవి.. 'నీ సపోర్ట్ ఉంటే షణ్ముఖ్ ని కెప్టెన్సీ టాస్క్ కంటెండర్ గా చేస్తా.. ఇదే నా ప్రామిస్' అని చెబుతుండగా.. సిరి వెటకారంగా నవ్వింది. అది చూసిన రవి ''నీ సీరియల్ యాక్టింగ్‌లు ఈడ చేయకు' అని కామెంట్ చేశాడు.
ఇక మానస్ తో రవి డిస్కషన్ పెట్టాడు. ఈ సమయంలో మానస్ 'నీ దగ్గరా ఫైర్ ఉంది.. ఆయన దగ్గరా ఫైర్ ఉంది.. దాన్ని బయటకు తీయండి.. అప్పుడే కదా గేమ్ ఇంటరెస్టింగా ఉంటుంది' అని అన్నాడు. ఆ తరువాత బోర్డుపై కెప్టెన్సీ పోటీదారుల ఫోటోలు పెట్టే టాస్క్ జరగగా.. ఇరు వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగినట్లు ప్రోమోలో చూపించారు. ఒకరినొకరు తోసుకుంటూ బోర్డులు కింద పడేశారు. మానస్, జెస్సీ గట్టి గట్టిగా అరుస్తూ కనిపించారు. మరి ఈ టాస్క్ లో ఎవరు గెలుస్తారో.. ఈరోజు ఎపిసోడ్ లో తెలియనుంది.
#Ravi Vs #Sunny captaincy contender task is on next level fire 🔥 🔥 🔥 #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFire & #FiveMuchFun pic.twitter.com/ALoIQc66Nf
— starmaa (@StarMaa) October 6, 2021
Also Read : ఆడపడుచుల చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం..మెగాస్టార్ ట్వీట్ వైరల్
Also Read : సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమార్తె సితార వెండితెర ఎంట్రీ...ఏ సినిమాతో అంటే...
Also Read: రెహమాన్ 'బతుకమ్మ' సాంగ్.. లాంచ్ చేసిన కల్వకుంట్ల కవిత
Also Read: "రిపబ్లిక్" సినిమాపై కొల్లేరు ప్రజల ఆగ్రహం ! అసలు వివాదం ఏమిటంటే ?
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్స్క్రైబ్ చేయండి