అన్వేషించండి

Bigg Boss 5 Telugu: హౌస్ మేట్స్ కి షాకిచ్చిన నాగ్.. ఎవరినీ సేవ్ చేయలేదుగా..

శనివారం నాటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మేట్స్ అందరికీ షాకిచ్చాడు.

బిగ్ బాస్ స్టేజ్ పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ముందుగా శుక్రవారం హౌస్ లో ఏం జరిగిందో చూపించారు. 
 
శుక్రవారం హైలైట్స్.. 
 
శ్రీరామచంద్ర పక్షపాతం చూపిస్తాడని అందరూ అంటారని.. కానీ టైమ్ కి వచ్చేసరికి ఎవరూ మాట్లాడరని సిరి, షణ్ముఖ్, జెస్సీ చర్చించుకున్నారు. ఆ తరువాత కాజల్.. సింపతీ కార్డు ప్లే చేస్తుందని రవి.. మానస్ తో చెప్పాడు. ఈ విషయాన్ని కాజల్ తో డిస్కస్ చేసి అందరికీ ఇలానే చెప్తున్నాడని.. బ్రెయిన్ వాష్ చేస్తున్నాడని మానస్ అన్నాడు. 
 
రేషన్ మ్యానేజర్ గా విశ్వ సరిగ్గా పని చేయడం లేదని ప్రియా.. మీరు చూడకుండా ఎలా మాట్లాడతారని విశ్వ ఒకరిపై మరొకరు అరుచుకున్నారు. ఈ క్రమంలో 'మైండ్ యువర్ లాంగ్వేజ్..' అంటూ వార్నింగ్ ఇచ్చింది ప్రియా. 
 
  • అనంతరం హౌస్ మేట్స్ తో మాట్లాడిన నాగార్జున.. ముందుగా షణ్ముఖ్ ని 'మొత్తం గేమ్ ప్లే మారిపోయిందిగా' అని ప్రశ్నించగా.. 'ఫస్ట్ వీక్ నుంచి ఫోర్త్ వీక్ వరకు నన్ను ఎవరూ నామినేట్ చేయలేదు. నేను గేమ్ బాగానే ఆడుతున్నా అనుకున్నా.. కానీ సీక్రెట్ గా నామినేషన్ వేయడంతో షాకయ్యను. అందుకే ఇలా ఆడుతున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు.
  • 'బిగ్ బాస్ టైటిల్ ఇష్టమా -హమీదా ఇష్టమా' అని శ్రీరామ్ ని క్వశ్చన్ చేయగా.. చాలాసేపు ఆలోచించిన శ్రీరామ్.. టైటిల్ ముఖ్యమని చెప్పాడు.
  • ఎవరి వంట వాళ్లు వండుకోవాలని చెప్పడం నాకు నచ్చలేదని నాగార్జున.. శ్రీరామ్ ని ప్రశ్నించగా.. తను రిక్వెస్టింగ్ గా జెస్సీకి చెప్తే, తను తప్పుగా అనుకున్నాడని చెప్పాడు. వెంటనే జెస్సీ.. 'నాకు రిక్వెస్టింగా అనిపించలేదు. కమాండింగా అనిపించిందని' చెప్పుకొచ్చాడు. 
 
హౌస్ లో 'కొండపొలం' టీమ్.. 
 
'ఉప్పెన' సినిమాలో వైష్ణవ్ నటనను పొగిడారు నాగార్జున. ఆ తరువాత వైష్ణ‌వ్ ఇంత చిన్న వ‌య‌స్సులోనే ర‌కుల్‌ని ప్రేమించావా అని హోస్ట్ నాగార్జున అడగగా చేయాల్సి వచ్చిందని నవ్వుతూ బదులిచ్చాడు వైష్ణవ్. సినిమా ఎన్నిరోజుల్లో పూర్తైందని అడగ్గా 40 రోజులు అని క్రిష్ చెప్పడంతో మా వాళ్లు 105 రోజులు ఇక్కడుంటున్నారన్నారు నాగ్. అంటే 45 రోజుల్లో మనుషులు ఎలా మారుతారో.. మారిపోతారో, జారిపోతారో అన్న నాగ్ మాటలను కంటిన్యూ చేస్తూ ఇంటిసభ్యురాలు ప్రియ పారిపోతారో అనగానే..గేట్స్ ఓపెన్ కావు ప్రియా అన్నారు. బిగ్ బాస్ టైటిల్ ఇష్టమా -హమీదా ఇష్టమా అని శ్రీరామ్ ని క్వశ్చన్ చేస్తే టైటిల్ ముఖ్యం అన్నాడని.. తానక్కడుంటే హమీదా ముఖ్యం అని చెప్పేవాడిని అంటూ క్రిష్ చెప్పడం నవ్వులు పూయించింది. ఆ తరువాత హౌస్ మేట్స్ ని రకరకాల ప్రశ్నలు అడిగారు క్రిష్ అండ్ తేజ్. 
 
  • జెస్సీని శ్రీరామ్ కొట్టిన విషయాన్ని నాగార్జున ప్రశ్నించారు. దానికి శ్రీరామ్ 'నేను బ్లాక్ చేశాను కానీ కొట్టలేదు సార్' అని చెప్పాడు. గేమ్ లో ఇలాంటివి అవుతాయ్ కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు.
  • కాజల్ నీకు ఎవరైనా మిడిల్ ఫింగర్ చూపించారా..? అని కాజల్ ని ప్రశ్నించారు నాగ్. చూపించారని, లోబో పేరు చెప్పింది. అయితే తనకు అలాంటి ఇంటెన్షన్ లేదని లోబో చెప్పాడు. 
 
రూలర్ ఎవరు..? స్లేవ్ ఎవరు..? 
 
హౌస్ మేట్స్ తో రూలర్ ఎవరు..? స్లేవ్(బానిస) ఎవరు..? అనే టాస్క్ ఆడించారు నాగార్జున. ముందుగా ప్రియా.. శ్రీరామచంద్రని రూలర్ గా ఎన్నుకొని అతడికి కిరీటం పెట్టింది. వెంటనే నాగార్జున.. 'అతను ఎవరికో స్లేవ్ అనుకున్నా నేను' అంటూ కౌంటర్ వేశారు నాగార్జున. దానికి శ్రీరామచంద్ర దండం పెడుతూ నవ్వేశాడు. ఆ తరువాత స్లేవ్ గా హమీదని ఎంపిక చేసుకుంది. శ్రీరామచంద్ర రూలర్ కిరీటం కాజల్ కి పెడుతూ.. 'హౌస్ అంతా తన గురించి మాట్లాడుకునేటట్లు చేస్తున్న కాజల్ ఈజ్ ఏ రూలర్ సర్' అని చెప్పాడు. దానికి నాగ్ 'చిన్న వెటకారం ఉంది' అనగా.. కాజల్ 'బరాబర్ ఉంది' అని చెప్పింది. షణ్ముఖ్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడని అతడికి స్లేవ్ కిరీటం పెట్టారు. 
 
కాజల్ రూలర్ కిరీటం ప్రియాకు పెట్టింది. స్లేవ్ కిరీటం రవికి పెడుతూ.. హౌస్ మేట్స్ ని గేమ్ విషయంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని చెప్పింది. ఆ తరువాత రవికి రూలర్ కిరీటం పెట్టింది ప్రియాంక. అలానే లోబోకి స్లేవ్ కిరీటం పెట్టింది. 
 
ఆ తరువాత రవి రూలర్ కిరీటం మానస్ కి, స్లేవ్ కిరీటం ప్రియాంకకు పెట్టాడు. మానస్ రూలర్ కిరీటం సన్నీకి పెట్టి.. స్లేవ్ గా హామీదను సెలెక్ట్ చేసి 'వెరీ స్ట్రాంగ్ ప్లేయర్ కానీ స్లేవ్ అయిపోతుంది అనిపిస్తుంది.. గేమ్ ఆడు హమీద ప్లీజ్' అని రీజన్ చెప్పాడు. ఆ వెంటనే సన్నీ రూలర్ కిరీటం మానస్ కి, స్లేవ్ కిరీటం విశ్వకు పెట్టాడు. సన్నీకి రూలర్ కిరీటం పెట్టిన లోబో, స్లేవ్ కిరీటం విశ్వకి పెట్టాడు. 
 
ఆ తరువాత షణ్ముఖ్ తనకు తనే కిరీటం పెట్టుకొని ఫోజిచ్చాడు. దానికి నాగ్ 'ఏంట్రా ఇది' అనగా.. 'నాకు నేనే కింగ్ సర్ హౌస్ లో.. ఎవరూ ఇవ్వక్కర్లేదు' అని చెప్పాడు. దానికి నాగ్ 'ఇలాంటి పని చేశావ్ కాబట్టే.. 8 మెంబర్స్ నామినేట్ చేశారు నిన్ను' అని పంచ్ వేశారు. 'ఎవరూ ఓపెన్ గా చేయలేదని' షణ్ముఖ్ అనగా.. 'ఓపెన్ గా అయినా.. నేను చేసేదాన్ని' అంటూ ప్రియా చెప్పింది. ఆ తరువాత రవికి రూలర్ కిరీటం పెట్టాడు. ఆ తరువాత హమీదని స్లేవ్ అని చెబుతూ.. 'నా ఈ వీక్ హమీద కనిపించలేదు సర్.. ఈ హౌస్ లో ఓన్లీ 14 కంటెస్టెంట్స్ ఆడుతున్నారనిపించింది' అని చెప్పగా.. వెంటనే హమీద.. 'నువ్ ఆడావా..?' అని ప్రశ్నించింది. 
 
హమీద రూలర్ కిరీటం మానస్ కి పెడుతూ.. 'రాజ్యంలో టాస్క్ మొత్తం మానసే ఆడినట్లు నాకు అనిపించింది' అని రీజన్ చెప్పింది. స్లేవ్ గా సన్నీకి కిరీటం పెట్టింది. రూలర్ గా కాజల్ కి కిరీటం పెట్టిన శ్వేతా, స్లేవ్ గా మానస్ కి కిరీటం పెట్టింది. ఆ తరువాత జెస్సీ.. రూలర్ గా రవిని, స్లేవ్ గా లోబోని సెలెక్ట్ చేశాడు. రూలర్ గా సన్నీని, స్లేవ్ గా లోబోని సెలెక్ట్ చేశారు యానీ మాస్టర్. తర్వాత సిరి రూలర్ కిరీటం రవికి పెట్టింది. అది చూసిన నాగ్.. 'రవి ఏంటో తెలుసా సిరి.. బాగా తెలివితేటలు ఉన్న యానిమల్' అని కౌంటర్ వేశారు. స్లేవ్ గా శ్రీరామ్ కు కిరీటం పెట్టింది సిరి. ఆ తరువాత రూలర్ కిరీటం రవికి పెట్టాడు విశ్వ. స్లేవ్ కిరీటం ప్రియాకు పెట్టాడు. 
 
ఇక ఈ వారం ఎవరినీ సేవ్ చేయకుండా షాకిచ్చారు నాగార్జున.    

Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget