అన్వేషించండి
Advertisement
Bigg Boss 5 Telugu: సన్నీను ఓ రేంజ్ లో ఆడేసుకున్న నాగ్.. ఫైనల్ గా సారీ చెప్పి..
సీక్రెట్ రూమ్ లో ఉన్న జెస్సీతో డాక్టర్స్ మాట్లాడారు. ఆయనకు ట్రీట్మెంట్ అవసరమని.. చెప్పారు.
ఫ్రైడే హైలైట్స్..
కెప్టెన్సీ టాస్క్ లో ఓడిపోయిందని సిరి ఏడుస్తుండగా.. షణ్ముఖ్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. సిరి అన్న మాటలు గుర్తు తెచ్చుకొని మరింత ఏడ్చింది. మరోపక్క సిరి నోటికొచ్చినట్లు గలీజ్ గా మాట్లాడుతుందని సన్నీ, మానస్ అనుకున్నారు. తను హౌస్ లో ఉన్నతకాలం కాజల్ తో మాట్లాడనని యానీ.. రవితో చెప్పింది. గేమ్ కోసం దిగజారుతుందని కామెంట్ చేసింది. 'నాకు నచ్చదు అన్నప్పుడు ఆపకుండా.. సాగదీస్తావ్ అని' ప్రియాంకతో గొడవ పెట్టుకున్నాడు మానస్. దెబ్బకి ప్రియాంక ఏడ్చేసింది. ఆ తరువాత మానస్ సారీ చెప్పగా.. 'నువ్ నా విషయంలో ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నావ్ అని తెలియదు మానస్. లేకపోతే దూరంగానే ఉండేదాన్ని' అంటూ డైలాగ్స్ వేసింది.
సీక్రెట్ రూమ్ లో ఉన్న జెస్సీతో డాక్టర్స్ మాట్లాడారు. ఆయనకు ట్రీట్మెంట్ అవసరమని.. చెప్పారు. అనంతరం నాగార్జున జెస్సీతో మాట్లాడగా.. హౌస్ లోకి వెళ్లడానికి రెడీగా ఉన్నానని చెప్పాడు. కానీ ఫైనల్ రిపోర్ట్స్ వచ్చేవరకు వెయిట్ చేద్దామని చెప్పారు నాగార్జున.
FIR:
హౌస్ మేట్స్ తో FIR అనే గేమ్ ఆడించారు నాగార్జున. ఈ టాస్క్ లో భాగంగా నాగార్జున పిలిచే కంటెస్టెంట్ మరో హౌస్ మేట్ మీద FIR ఫైల్ చేయాలి. ఆ వ్యక్తి తనను డిఫెండ్ చేసుకోవడానికి డిఫెన్స్ లాయర్ ని నియమించుకోవచ్చు. ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ మెజారిటీను బట్టి గిల్టీ, నాట్ గిల్టీ అనేది డిసైడ్ అవుతుంది.
యానీ మాస్టర్ - కాజల్ మీద FIR ఫైల్ చేయగా.. ఆమె వాదించడానికి మానస్ ని పిలిచింది. కానీ అతడు ఫన్నీగా చేయడంతో కాజల్ నేరుగా వాదించుకుంది. హౌస్ మేట్స్ అందరూ యానీని సపోర్ట్ చేయడంతో కాజల్ ని గిల్టీగా తేల్చేశారు.
రవి - సన్నీని జైల్లో పెట్టి.. వెరీ బ్యాడ్ బిహేవియర్, ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తాడు.. ఇస్తమొచ్చింది చేస్తా అంటున్నాడు.. నా దృష్టిలో అది తప్పని చెప్పాడు. మానస్ ని తన లాయర్ గా ఎన్నుకున్నాడు సన్నీ. 'ఏం పదాలు వాడాడు చెప్పు' అంటూ మానస్ అడగడంతో.. 'తంతా' అనే పదం వచ్చిందా రాలేదా.. మీ నోటి నుంచి అని అడిగాడు రవి. 'ఎవరిని తంతా అన్నాను..' అని ఇన్నోసెంట్ గా అడిగాడు సన్నీ. 'ఎవరినో అన్నావ్ అని కాదు.. తంతా అనే వర్డ్ వాడావా..?' అని అడిగారు నాగార్జున. లేదు సార్ అని చెప్పాడు సన్నీ. మళ్లీ రవి మానస్ ని అడిగాడు.. ఆ వర్డ్ యూజ్ చేశాడా లేదా అని.. నేనైతే వినలేదని చెప్పాడు మానస్. వెంటనే నాగ్ వీడియో వేసి చూపించగా.. అందులో సన్నీ తంతా అని అన్నాడు. అది చూసిన సన్నీ తను 'బ్రిక్స్'నే అన్నానని చెప్పగా.. కంప్లీట్లీ రాంగ్ సార్ అని సిరి చెప్పింది. 'నిన్నే అమ్మేస్తానని కూడా బ్రిక్స్ నే అన్నావా..?' అని ప్రశ్నించారు నాగార్జున. అసలు అమ్ముతాననే వర్డ్ నేను యూజ్ చేయలేదు సార్ అని చెప్పాడు సన్నీ. వెంటనే యానీ.. 'ఆయన కోపంలో చెప్తాడు కానీ.. సిరిని అనాలని ఇంటెన్షన్ కాదు సార్' అని చెప్పింది. దానికి నాగ్ 'అంటే యానీ కోపంలో ఏమన్నా ఓకేనా..?' అని అడిగారు. దాని యానీ తెల్లమొహం వేసింది. నాగార్జున కాసేపు సన్నీకి క్లాస్ పీకడంతో చేసేదేం లేక సన్నీ సైలెంట్ అయిపోయాడు. హౌస్ మేట్స్ ప్రకారం సన్నీ గిల్టీ అని తేలింది.
సన్నీ - సిరిపై FIR ఫైల్ చేసి జైల్లో పెట్టాడు. గేమ్ లో ఉన్నప్పుడు సిరి కావాలనే డిస్టర్బ్ చేసిందని.. ఫిజికల్ కూడా అయిందని చెప్పాడు. దానికి సిరి.. 'సన్నీను డిస్టర్బ్ చేయాలని కాదు.. నా గేమ్ స్ట్రాటజీ అది. నా బ్రిక్స్ సేవ్ అవుతాయనే సన్నీను పట్టుకున్నానని' చెప్పింది. హౌస్ మేట్స్ ప్రకారం సిరి నాట్ గిల్టీ అని తేలింది.
సిరి - సన్నీపై FIR ఫైల్ చేసి.. బిహేవియర్ నచ్చలేదని చెప్పింది. హౌస్ మేట్స్ ప్రకారం సన్నీ గిల్టీ అని తేలింది.
మానస్ - యానీపై FIR ఫైల్ చేసి.. నామినేషన్స్ లో చెప్పిన రీజన్స్ నచ్చలేదని చెప్పాడు. హౌస్ మేట్స్ ప్రకారం యానీ నాట్ గిల్టీ అని తేలింది.
శ్రీరామ్ - ప్రియాంకపై FIR ఫైల్ చేసి.. టాస్క్ లో తనకు ఎన్ని సేవలు చేసినా.. టిప్స్ ఇవ్వలేదని ఆరోపణలు చేశాడు. వీరిద్దరి మధ్య సంభాషణ ఫన్నీగా సాగింది.
ప్రియాంక - మానస్ పై FIR ఫైల్ చేసి తనపై గట్టిగా అరుస్తున్నాడని రీజన్ చెప్పింది. హౌస్ మేట్స్ ప్రకారం మానస్ నాట్ గిల్టీ అని తేలింది.
కాజల్ - యానీ మాస్టర్ పై FIR ఫైల్ చేసి.. ఆమెని ఏం అనకపోయినా.. తనను కావాలనే ఎక్కిరిస్తోందని చెప్పింది. హౌస్ మేట్స్ ప్రకారం యానీ నాట్ గిల్టీ అని తేలింది.
షణ్ముఖ్ - సన్నీపై FIR ఫైల్ చేసి.. 'ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని ఆడుతున్నావ్ అని.. రెస్పెక్ట్ ఇవ్వడం లేదని' అన్నాడు షణ్ముఖ్. దీనికి సన్నీ రియాక్ట్ అవుతూ.. 'షణ్ముఖ్ తో మాట్లాడడానికి ఎంత ట్రై చేసినా.. ఆయన మాట్లాడేవాడు కాదని..' తనను డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. యూట్యూబ్ వరకే అని ఎందుకు అన్నావ్ అని షణ్ముఖ్ ప్రశ్నించాడు. దీంతో నాగార్జున వీడియో వేసి చూపించాడు. ఈ విషయంలో సన్నీ-షణ్ముఖ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఫైనల్ గా షణ్ముఖ్ కి సారీ చెప్పాడు సన్నీ.
హౌస్ మేట్స్ అందరికీ ఒక సలహా ఇచ్చారు నాగార్జున. ఎవరితో సమస్య ఉంటే వాళ్లతో నేరుగా మాట్లాడుకోమని.. వేరే వాళ్లను ఇన్వాల్వ్ అవ్వొద్దని చెప్పారు.
సన్నీ సేఫ్..
నామినేషన్ లో ఉన్న ఐదుగురికి చిన్న టాస్క్ ఇచ్చి.. సన్నీ సేవ్ అయినట్లుగా అనౌన్స్ చేశారు.
Also Read:అమెరికాలో విజయ్ దేవరకొండ.. పూరితో చిల్ అవుతూ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion