అన్వేషించండి
Advertisement
Bigg Boss 5 Telugu: మానస్-కాజల్ ఎవరిని సేవ్ చేస్తారో..?
ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో ఎవిక్షన్ పాస్ కి సంబంధించిన టాస్క్ జరిగింది. దాని హైలైట్స్ పై ఓ లుక్కేయండి.
కెప్టెన్సీ టాస్క్..
కెప్టెన్సీ పోటీదారులకు 'రింగ్ ఈజ్ కింగ్' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. మానస్, ప్రియాంక, సిరి, యానీ మాస్టర్ కలిసి ఈ టాస్క్ ఆడారు. ఒక రింగ్ ను నలుగురూ పట్టుకొని గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో ముందుగా యానీ అవుట్ అయిపోయింది. ఆ తరువాత సిరి, ప్రియాంక అవుట్ అయిపోవడంతో.. చివరి మానస్ చేతిలో రింగ్ ఉండడంతో అతడు కెప్టెన్ గా ఎంపికయ్యాడు.
ఆ తరువాత మానస్, సన్నీ, కాజల్ గ్రూప్ హగ్ చేసుకున్నారు. ఆ టైంలో సన్నీ.. 'నేను వర్జిన్ రా.. లిప్స్ తో ఎవరినీ కిస్ చేయలేదు' అంటూ కామెంట్ చేశాడు. రవి-శ్రీరామచంద్ర ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకువెళ్తారని డిస్కస్ చేసుకున్నారు. సన్నీ బయటకు వెళ్లిపోతాడేమోనని రవి అన్నాడు.
నిప్పులే శ్వాసగా.. గుండెలో ఆశగా..
ఈ సీజన్ ఫైనల్ కి చేరేందుకు ఒకరికి అర్హత కల్పిస్తూ బిగ్ బాస్ ఎవిక్షన్ పాస్ ను ఆఫర్ చేశారు. ఈ పాస్ దక్కించుకున్న తొమ్మిది మంది సభ్యుల్లో ఒకరు నేరుగా ఫైనల్స్ కి వెళ్లిపోతారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. అదే 'నిప్పులే శ్వాసగా.. గుండెలో ఆశగా'. గార్డెన్ ఏరియాలో ఉన్న ఫైర్ ఇంజన్లో రెండు సీట్లు ఉంటాయి. అలారం మోగిన వెంటనే ఎవరైతే ముందుగా వెళ్లి ఆ సీట్స్ లో కూర్చుంటారో.. వారి ఎదురుగా ఇద్దరు కంటెస్టెంట్స్ ఫోటోలు ఉంటాయి. ఫైర్ ఇంజన్ లో కూర్చున్న ఇద్దరూ ఒక మాట మీద ఆ ఫొటోలలో ఒకరిని సేవ్ చేసి.. మరొకరిని కాల్చాల్సి ఉంటుంది. ఒకవేళ ఇద్దరూ ఏకాభిప్రాయంతో ఒకరి పేరు చెప్పకపోతే.. బర్నింగ్ హౌస్ మీద ఉన్న ఇద్దరు ఫోటోలను కాల్చేయొచ్చు. ఫైర్ ఇంజన్లో కూర్చున్న వాళ్లని హౌస్ మేట్స్ తమ ఫొటోలను కాల్చొద్దని కన్విన్స్ చేసుకోవచ్చు. ఈ టాస్క్ లో ఎవరి ఫోటో అయితే చివరి వరకూ కాల్చకుండా ఉంటుందో వారికి ఎవిక్షన్ పాస్ దక్కుతుంది.
- ముందుగా.. షణ్ముఖ్, రవి ఫైర్ ఇంజన్ లో కూర్చోగా.. వారికి శ్రీరామ్-మానస్ ల ఫొటోలు వచ్చాయి. షణ్ముఖ్.. మానస్ పేరు చెప్పగా, రవి.. శ్రీరామ్ పేరు చెప్పాడు. ఇద్దరూ ఫైనల్ గా మానస్ ఫోటోని కాల్చేశారు.
- రెండోసారి మానస్-సన్నీ ఫైర్ ఇంజన్ లో కూర్చోగా.. వాళ్లకి రవి-యానీ మాస్టర్ ల ఫొటోలు వచ్చాయి. వారు రవి ఫొటోను కాల్చేశారు.
- మూడోసారి షణ్ముఖ్-సిరి ఫైర్ ఇంజన్ లో కూర్చోగా.. వాళ్లకి ప్రియాంక-సన్నీల ఫొటోలు వచ్చాయి. వారు ప్రియాంక ఫొటోను కాల్చేశారు. ఈ గ్యాప్ లో ప్రియాంక-మానస్ గొడవ పడ్డారు.
- నాలుగోసారి యానీ మాస్టర్-శ్రీరామచంద్ర ఫైర్ ఇంజన్ లో కూర్చోగా.. వాళ్లకి సిరి-షణ్ముఖ్ ల ఫొటోలు వచ్చాయి. వారు షణ్ముఖ్ ఫొటోను కాల్చేశారు.
- ఐదోసారి ప్రియాంక-కాజల్ ఫైర్ ఇంజన్ లో కూర్చోగా.. వాళ్లకి సిరి-శ్రీరామచంద్ర ఫొటోలు వచ్చాయి. వారు శ్రీరామచంద్ర ఫొటోను కాల్చేశారు.
ఆ తరువాత రవి-శ్రీరామ్ గేమ్ గురించి మాట్లాడుకున్నారు. సన్నీ-కాజల్ ఫొటోలు వస్తే.. ఇద్దరివీ కాల్చేద్దామని శ్రీరామ్ అన్నాడు.
- ఆరోసారి యానీ మాస్టర్-ప్రియాంక ఫైర్ ఇంజన్ లో కూర్చోగా.. సన్నీ-కాజల్ ల ఫొటోలు వచ్చాయి. వారు కాజల్ ఫొటోను కాల్చేశారు.
- ఏడోసారి కాజల్-మానస్ ఫైర్ ఇంజన్ లో కూర్చోగా.. సిరి-యానీ మాస్టర్ ల ఫొటోలు వచ్చాయి. ఈ విషయంలో మానస్-కాజల్ ల మధ్య డిస్కషన్ జరిగింది. ఇద్దరినీ కాల్చేస్తే సన్నీ మిగులుతాడని తన గేమ్ ప్లాన్ చెప్పింది కాజల్. కానీ దానికి మానస్ ఒప్పుకోలేదు. అది కరెక్ట్ కాదని అన్నాడు.
ఇంతలో యానీ మాస్టర్.. ప్రియాంక దగ్గరకు వెళ్లి ఇలా జరుగుతుందని నీకు తెలుసా అని..? ప్రశ్నించింది. దానికి పింకీ తనకేం తెలియదని చెప్పింది. వెంటనే యానీ.. 'యాక్టింగ్.. యాక్టింగ్ నెంబర్ 1లు' అంటూ కామెంట్ చేసింది. వెంటనే ప్రియాంక ఫైర్ అవ్వగా.. నిన్ను అనలేదని చెప్పింది యానీ.
Also Read: నాగ్ పంచ్‌కు చైతూ కౌంటర్.. ‘లేడిస్ ఫస్ట్’ అంటూ కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్!
Also Read: అరె ఏంట్రా టార్చర్... ఆడండ్రా..జనాలతో ఆడుకోకండ్రా...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
సినిమా
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion